Latest Updates
-
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.!
Kartika purnima 2024 wishes in Telugu: కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలను తెలుగులో ఇలా అందంగా చెప్పేయండి
హిందువులు ఎంతో పవిత్రంగా భావించే కార్తీక పౌర్ణమి వచ్చేసింది. దేశంలోని అన్ని శైవక్షేత్రాల్లో కార్తీక శోభా నెలకొంది. భక్తులందరూ ఎంతో ప్రత్యేకమైన రోజుగా భావించే ఈరోజున ఉపవాసం ఉండి, శివయ్య పూజలు చేస్తుంటారు. అలాంటి గొప్ప, ఎంతో ప్రత్యకమైన పండగ రోజున.. మీ స్నేహితులకు, కుటుంబ సభ్యులకు, శ్రయోభిలాషులకు ఈ విధంగా కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలను తెలుగులో చెప్పేయండి.
కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు 2024 తెలుగులో
కార్తీకదీపం మాదిరిగానే మీ జీవితంలో కూడా వెలుగులు నిండిపోవాలి, చీకటి తొలిగి మీ జీవితం ప్రకాశవంతం కావాలని కోరుకుంటూ.. మీకు మీ కుటుంబ సభ్యులకు కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు

కార్తీక దీపం ఇంటికి, మనిషి జీవితానికి వెలుగునిస్తుంది. మీరు ఈ సమాజానికి, మీ కుటుంబానికి వెలుగుగా మారాలని కోరుకుంటూ.. కార్తీక పౌర్ణమి శుభాకంక్షాలు
ఈ ప్రత్యేకమైన కార్తీక పౌర్ణమి నాడు శ్రీమహావిష్ణువు, శివుడి ఆశీస్సులు మీపై ఎల్ల వేళలా ఉండాలని కోరుకుంటూ.. హ్యాపీ కార్తీక పౌర్ణమి!
ఈ కార్తీక పౌర్ణమి నాటి చంద్రుడి కాంతి.. మీ ప్రియమైన వారి జీవితాల్లో వెలుగులు నింపాలని, కార్తీక శోభతో జీవితం ఆనందమయంగా మారాలని కోరుకుంటూ కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు
ఈ కార్తీక పౌర్ణమి మీకు, మీ కుటుంబానికి శాంతి, ప్రశాంతత, ఆరోగ్యం కలిగించాలని కోరుకుంటూ హ్యాపీ కార్తీక పౌర్ణమి.
సర్వ లోకాలను రక్షించే శ్రీమహావిష్ణువు మిమ్మల్ని కూడా రక్షించాలని, మీపై ఆయన ప్రేమ చూపించాలని కోరుకుంటూ కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు
ఈ కార్తీక పౌర్ణమి నాడు ఆ పరమశివుడు మీ జీవితంలో నెలకొన్న చీకట్లను తొలగిస్తాడు. మీకు ఆయురారోగ్యాలతో పాటు అష్టైశ్వర్యాలను ప్రసాదిస్తాడు. మీకు మీ కుటుంబ సభ్యులకు కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు
ఓం భగవతే వాసుదేవాయ నమః! ఆ శ్రీమహావిష్ణువు నిన్ను అనుగ్రహించుగాక ! మీకు మీ కుటుంబ సభ్యులకు కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు
ఈ కార్తీక పౌర్ణమి చంద్రుడిలాగా మీ జీవితం కూడా ప్రకాశవంతంగా వెలిగిపోయాలని, అలా వెలిగిపోయేలా ఆ పరమశివుడు మిమ్మల్ని దీవించాలని కోరుకుంటూ కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు
ఈ పవిత్రమైన కార్తీక పౌర్ణమి రోజున మీ ఆశయాలు, కోరికలు నెరవేరాలని, విష్ణువు పరమశివుడి ఆశీస్సులు మీపై ఉండాలని కోరుకుంటూ.. కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు
ఈ పవిత్రమైన కార్తీక పౌర్ణమి రోజున ఆ లక్ష్మీదేవి మీపై అనుగ్రహం చూపాలని, అదృష్టాన్ని, ఐశ్వర్యాన్ని మీకు కలగజేయాలని కోరుకుంటూ.. మీకు, మీ కుటుంబ సభ్యులకు కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు
ఈ కార్తీక పౌర్ణమి మీ జీవితంలో ఒక కొత్త అధ్యాయాన్ని ప్రారంభింపజేసి, మీరు చేస్తున్న పోరాటంలో విజయం, మీ బలహీనతల నుంచి విముక్తి, మీరు కోరుకునే జీవితాన్ని ప్రసాదించాలని కోరుకుంటూ.. కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు.



Click it and Unblock the Notifications