Latest Updates
-
మండుతున్న ఎండలకు చెక్..సమ్మర్ లో మిమ్మల్ని చల్లగా ఉంచే అద్భుతమైన బూందీ రైతా..ఎలా చేసుకోవాలంటే.. -
ఇడ్లీ, దోసల్లోకి అదిరిపోయే కాంబినేషన్..పుల్లపుల్లని, కారంకారమైన జామకాయ చట్నీ..ఎలా చేసుకోవాలంటే.. -
ఎండలో ఉంటున్నా.. ట్యాబ్లెట్లు వాడుతున్నా విటమిన్-D పెరగట్లేదా? అసలు కారణం ఇదే! -
అమ్మమ్మల నాటి అమృతం.. వేసవిలో ఒంటికి చలువ చేసే తరవాని చారు -
కొంతమంది ప్రతిసారీ రాంగ్ పర్సన్ కే ఎందుకు ఎట్రాక్ట్ అవుతుంటారో తెలుసా? -
పైన మీగడ, లోపల కమ్మటి రుచి.. ఇంట్లోనే పక్కా ధాబా స్టైల్ మలై లస్సీ..ఎలా చేసుకోవాలంటే -
అచ్చం బేకరీ రుచితో కొబ్బరి బర్ఫీ.. తక్కువ సమయం, అదిరిపోయే టేస్ట్! -
కరివేపాకుతో ఈ 5 ఆహారాలు కలిపి తింటే.. మీ ఎముకలు ఉక్కులా మారుతాయి! -
వేడివేడి అన్నం, కాస్త నెయ్యి, గోంగూర కారం..ఆహా ఏమి రుచి! -
ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నారా? ముందు మహిళలు సరిదిద్దుకోవాల్సిన అతిపెద్ద సమస్య ఇదే!
Children’s Day 2024 Wishes in Telugu: తెలుగులో బాలల దినోత్సవ శుభాకాంక్షలను ఇలా అందంగా చెప్పేయండి!
Insync
oi-Banothu Praveen Kumar
నవంబర్ 14న బాలల దినోత్సవం. భారత దేశ తొలి ప్రధాని జవహర్ లాల్ నెహ్రు జయంతి(నవంబర్ 14) సందర్భంగా ఈ బాలల దినోత్సవాన్ని జరుపుకుంటారు. దేశంలోని పిల్లలందరూ దేశ వ్యాప్తంగా బాలల దినోత్సవాన్ని జరుపుకుంటారు. పిల్లలు, బాల్యానికి విలువ ఇవ్వాలని నెహ్రు ఎప్పుడూ చెప్తుండేవారు. పిల్లల కోసం ఆయన ఎన్నో కార్యక్రమాలు చేపట్టారు. అందుకే ఆయన జన్మదినాన్ని బాలల దినోత్సవంగా జరుపుకుంటారు.
అయితే ఈ బాలల దినోత్సవం రోజు మీ బంధువులు, స్నేహితులు, పిల్లలు, శ్రయోభిలాషులకు శుభాకాంక్షలు తెలియజేసేందుకు ఇక్కడ కొన్ని శుభాకాంక్షలు, కొటేషన్స్, విషెస్‌ను తెలుగులో అందించాము. వీటిని మీరు మీ స్నేహితులకు షేర్ చేయడంతో పాటు సోషల్ మీడియాలో షేర్ చేయడం, స్టేటస్ పెట్టుకోవచ్చు.

బాలల దినోత్సవం 2024 శుభాకాంక్షలు తెలుగులో..
- ఈ దేశంలోని ప్రతి బిడ్డ అంతులేని ఆశలు, ప్రేమ, ఆనందంతో జీవించాలని, వారి కోరికలు నెరవేరాలని కోరుకుంటూ బాలల దినోత్సవ శుభాకాంక్షలు.
- పిల్లలని అమాయకత్వం, వారిలోని చిలిపి అల్లరిని ఎప్పుడూ అలాగే ఉండనిద్దాం. వారిని అలానే ప్రకాశింపజేసేలా ఉండనిద్దాం. హ్యాపీ చిల్డ్రన్ డే
- బాల్యం అంటే ఎన్నో మధురమైన జ్ఞాపకాల భాండాగారం. మర్చిపోలేని అనుభూతుల లైబ్రరీ.. అంతటి గొప్ప బాల్యాన్ని ప్రతి బిడ్డకు అందజేద్దాం. మీకు, మీ కుటుంబ సభ్యులకు బాలల దినోత్సవ శుభాకాంక్షలు
- ఈ బాలల దినోత్సవం సందర్భంగా పిల్లల ఉజ్వల భవిష్యత్తు కోసం మనమందరం కృషి చేద్దాం. ఈ దేశాన్ని పిల్లల కోసం ప్రకాశవంతంగా మారుద్దాం. బాలల దినోత్సవ శుభాకాంక్షలు
- పిల్లలకు మంచి భవిష్యత్తు, సంతోషకరమైన జీవితం అందించేందుకు ఈ బాలల దినోత్సవం సందర్భంగా మనమంతా కృషి చేయాల్సిందే. హ్యాపీ చిల్డ్రన్ డే!
- తమ బోసి నవ్వులతో చిలిపి చేష్టలతో మన జీవితంలో ఆనందాన్ని తెచ్చేది, చిరునవ్వు నింపేది పిల్లలు మాత్రమే. అలాంటి పిల్లలకు బాలల దినోత్సవ శుభాకాంక్షలు
- మన దేశంలో ప్రతి బిడ్డకు సరైన ఆనందం, ప్రేమ, విద్య అందాలి. వారు వాటికి సంపూర్ణమైన అర్హులు. ఇవన్నీ వారికి దక్కే విధంగా మనందరం కృషి చేద్దాం. బాలల దినోత్సవ శుభాకాంక్షలు
- పిల్లలు మీరే మా జీవితానికి వెలుగులు నింపే ఆశా కిరణాలు. మీ అందరికీ బాలల దినోత్సవ శుభాకాంక్షలు
- పిల్లలు పువ్వు మొగ్గలాంటి వారు. వారిని స్వేచ్ఛగా వికసించేందుకు తగిన ప్రోత్సాహం అందించాలి. మీకు, మీ పిల్లలకు ఈ బాలల దినోత్సవ శుభాకాంక్షలు
- పిల్లలు మీరు చాలా ప్రతిభ కలిగిన వారు. మీరు ప్రత్యేకమైన ట్యాలెంట్ ఉన్న వారు. మీరు మీ జీవితాంతం ప్రకాశవంతంగా, ఆనంద భరితంగా ఉండాలని కోరుకుంటూ.. మీకు బాలల దినోత్సవ శుభాకాంక్షలు
- నేటి బాలలే రేపటి పౌరులు. రేపటి పౌరులే దేశ భవిష్యత్తు మార్గ నిర్దేశకులు. అలాంటి పిల్లకు స్వేచ్ఛనిద్దాం వారి ఎదుగుదలకు కృషి చేద్దాం. బాలల దినోత్సవ శుభాకాంక్షలు
- రేపటి భావి భారత నిర్మాణానికి కృషి చేసే బాలలకు, నవ భారత నిర్మాణ కారకులు నేటి బాలలకు బాలల దినోత్సవ శుభాకాంక్షలు.
- ఈ ప్రపంచాన్ని పిల్లల మనస్సు వలే కల్మషం లేకుండా స్వచంగా ఉండనిద్దాం. కల్మషం లేని ప్రపంచంలో వారిని ఎదిగేందుకు కృషి చేద్దాం. బాలల దినోత్సవ శుభాకాంక్షలు.
Comments
More From Boldsky
Prev
Next
Read more about: wishes
English summary
Heartwarming happy Children’s Day 2024 Wishes, Quotes, WhatsApp Status, messages, and greetings in telugu
Story first published: Wednesday, November 13, 2024, 18:35 [IST]
Other articles published on Nov 13, 2024



Click it and Unblock the Notifications











