Latest Updates
-
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.!
నా బావ ముసలోడు కాదు, మహా మేధావి..55 ఏళ్ల అక్క మొగుడినే పెళ్లాడిన 18 ఏళ్ల యువతి!..వీడియో చూడండి
ప్రేమలో అంతా న్యాయమే అని పెద్దలు అంటుంటారు. అలాగే ప్రేమకు మతం, కులం, వయస్సు బేధాలు కూడా ఉండవు. కొన్ని ప్రేమకథలు ఈ మాటలను అక్షరాలా నిజం చేస్తాయి. దీనిని నిరూపించే అనేక సంఘటనలు నిత్యం మన కళ్ల ముందు చూస్తూనే ఉంటాం. సమాజం, సంప్రదాయం, వయసు వంటి హద్దులను చెరిపేసి కేవలం మనసుల బంధానికే విలువనిస్తాయి.
తాజాగా ఓ యువతి ప్రేమకు వయస్సుతో సంబంధం లేదని నిరూపించి సోషల్ మీడియాలో పెద్ద హాట్ టాపిక్ గా మారింది. తన తండ్రి వయస్సు వ్యక్తితో 18 ఏళ్ల యువతి ప్రేమలో పడటమే కాకుండా అతడే తన డ్రీమ్ బాయ్ అన్నట్లు చెబుతుంది. అంతేకాకుండా నా బావ ముసలోడు కాదు, మహా మేధావి అంటూ మురిసిపోతుంది.

ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందిన 18 ఏళ్ల యువతి కొంతకాలంగాఅనారోగ్యంతో బాధపడుతున్న తన అక్కకు సహాయంగా ఉండేందుకు, ఇంటి పనులు,వంట చేసి పెట్టేందుకు తరచూ వాళ్ళ ఇంటికి వెళ్లేది. ఈ క్రమంలో అక్క భర్తతో మాటలు కలిశాయి. ఆ పరిచయం కాస్తా సాన్నిహిత్యంగా, ఆ తర్వాత గాఢమైన ప్రేమగా మారింది.
ఒకరికొకరు తోడుగా ఉండాలని నిర్ణయించుకున్నాక,వారి బంధాన్ని పెళ్లితో మరింత పదిలం చేసుకోవాలనుకున్నారు. చుట్టూ ఉన్న ప్రపంచాన్ని,సొంత అక్కను కూడా లెక్కచేయకుండా వారిద్దరూ ఒక్కటయ్యారు.
ఇటీవల ఈ జంట ఇచ్చిన ఓ ఇంటర్వ్యూ వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది. అందులో రిపోర్టర్, ఆమె భర్తను ముసలివాడు అని అనడంతో ఆ యువతి ముఖంలో చిరునవ్వు కనిపించినా తన భర్తను గట్టిగా సమర్థించుకుంది. నా దృష్టిలో నా బావ ముసలోడు కాదు ఆయన చాలా తెలివైనవాడు, అనుభవజ్ఞుడు అని ఎంతో నమ్మకంగా చెప్పింది. ఆ వ్యక్తి కూడా తనను అలా పిలవడం ఇష్టం లేదని కాస్త గట్టిగానే బదులిచ్చాడు.
దానికి ఆ యువతి మరింత ప్రేమగా స్పందిస్తూ..నా కళ్లతో చూస్తే ఆయన అస్సలు ముసలివాడిలా కనిపించడు. జుట్టు మాత్రమే తెల్లగా ఉంది. దానికి రంగు వేసుకుంటే సరిపోతుంది. పళ్లను శుభ్రం చేసుకుంటే ఇంకా అందంగా కనిపిస్తాడు అని చెప్పడం వారి మధ్య ఉన్న ప్రేమకు నిదర్శనంగా నిలుస్తోంది.
సుమారు 55 ఏళ్ల వయసున్న బావ తెల్లటి జుట్టు, గడ్డంతో కనిపిస్తుండగా 18 ఏళ్ల వధువు గులాబీ రంగు చీరలో కళకళలాడుతూ కనిపించింది. వారి వయసుల మధ్య వ్యత్యాసం స్పష్టంగా కనిపిస్తున్నా, వారి కళ్లలో ఒకరిపై ఒకరికి ఉన్న ప్రేమ కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది.
ఈ విలక్షణ ప్రేమకథపై నెటిజన్లు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. కొందరు ప్రేమ గుడ్డిది బాబూ అని వ్యాఖ్యానిస్తుండగా, మరికొందరు బావకు 55, మరదలికి 18 అయితే మరి వాళ్ళ అక్క వయసెంత? అంటూ తర్కిస్తున్నారు.



Click it and Unblock the Notifications