Latest Updates
-
ముంబై స్టైల్ మసాలా ప్యాటీస్ పావ్.. వర్షం పడుతుంటే వేడివేడిగా తింటుంటే మస్త్ మజా..! -
శని దేవుడి కటాక్షం: ఈ రాశుల వారికి నేడు ఊహించని ధనలాభం, అదృష్టం మీదే! -
మనసు ప్రశాంతంగా ఉండట్లేదా? పురాతన హిందూ ధ్యాన పద్ధతులు జీవితాన్నే మార్చేస్తాయి -
వివాహిత స్త్రీ వేరొకరి పట్ల ఆకర్షితురాలవుతోందని సూచించే సంకేతాలివే! -
రాహుకాలం అంటే ఏంటి? ఈ టైంలో పుడితే అన్నీ కష్టాలేనా?..అదృష్టాన్ని తెచ్చే జ్యోతిష్య రహస్యం! -
ఫోన్ పాస్‌వర్డ్‌లే ఇప్పుడు భార్యాభర్తల మధ్య పెద్ద అనుమానాలకు కారణమవుతున్నాయా -
సండే స్పెషల్: పప్పుచారులోకి అదిరిపోయే సైడ్ డిష్ గ్రీన్ మసాలా కింగ్ ఫిష్ ఫ్రై..ఇంట్లోనే ఇలా ఈజీగా -
రోజుకో పెగ్గు ఆరోగ్యానికి మంచిదా?..మీకు ఈ నిజం తెలుసా? -
రెచ్చిపోయి తినేంత రుచి..అరిటాకులో పొట్లం చికెన్ బిర్యానీ ఇలా చేస్తే ఇంట్లో వాళ్లు ఫిదా! -
Viral Video: ఆ బుడ్డోడు మాములోడు కాదయ్యా..తానే చదివిస్తానంటూ ఆనంద్ మహీంద్రా బంపరాఫర్
Youtubers Income: 2024లో ఎక్కువగా సంపాదించిన తెలుగు యూట్యూబర్లు వీరే.. ఎవరి సంపాదన ఎక్కువ అంటే?
తెలుగు రాష్ట్రాల్లో చాలా మంది యూట్యూబర్లు, ఇన్‌స్టాగ్రామ్ ఇన్‌ఫ్లయెన్సర్లు ఉన్నారు. చాలా మందికి లక్షల్లో సబ్స్‌క్రైబర్లు, ఫాలోవర్లు ఉన్నారు. ఈ యూట్యూబర్లు భారీగానే డబ్బులు సంపాదిస్తున్నారు. ప్రమోషన్స్ అని, యాడ్ రెవెన్యూ అని భారీగానే సొమ్ము చేసుకుంటున్నారు. అయితే 2024లో ఎక్కువగా డబ్బులు సంపాదించిన ఇన్‌ఫ్లయెన్సర్లు ఎవరు? అలాగే తెలుగులో టాప్-6 ఇన్‌ఫ్లయెన్సర్లు ఎవరు వారి సంపాదన ఎంత అనేది ఈ స్టోరీలో తెలుసుకుందాం.
హర్ష సాయి
తెలుగు ఇన్‌ఫ్లయెన్సర్ల ప్రస్తావన వస్తే నంబర్ వన్ స్థానంలో ఉండేది కచ్చితంగా హర్షసాయి అని చెప్పుకోవచ్చు. ఇతనికి యూట్యూబ్‌లో సుమారుగా 11 మిలియన్ మంది సబ్స్‌క్రైబర్లు ఉన్నారు. అలాగే ఇన్‌స్టాగ్రామ్‌లో 13 మిలియన్స్‌కు పైగా ఫాలోవర్లు ఉన్నారు. యూట్యూబ్ అండ్ ఇన్‌స్టాగ్రామ్ కలిపి ఈయన నెలకు 40 లక్షలకు పైగానే సంపాదిస్తున్నారు. కొన్ని కొన్ని నెలల్లో ఆ సంపాదన కోట్లలో కూడా ఉంటుంది.

నా అన్వేషణ
నా అన్వేషణ అన్వేష్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రపంచ యాత్ర చేసే ఈయన వీడియోలు తెలుగులో ఫుల్ ఫేమస్. ఆటగాళ్లు అంటూ అందరికీ దగ్గరయ్యారు. ఈయనకు రెండు యూట్యూబ్ చానళ్ళు ఉన్నాయి. ఒక ఛానెల్‌లో 2.2 మిలియన్స్‌కు పైగా సబ్స్‌క్రైబర్లు ఉంటే, ఇంకో ఛానల్‌లో 1 మిలియన్‌కు పైగా సబ్స్‌క్రైబర్లు ఉన్నారు. ఈయన రెండు యూట్యూబ్ ఛానళ్ల ద్వారా 20 లక్షలకు పైగానే సంపాదిస్తున్నారు. ఈయనకు ఎక్కువగా ఇతర దేశాల్లో ఉన్న వ్యక్తులు సబ్స్‌క్రైబర్లుగా ఉన్నారు.
ఫిల్మీమోజి
ఈ ఛానల్‌లో కార్టూన్, ఎంటర్టైన్మెంట్ వీడియోస్ చేస్తారు. మిడిల్ క్లాస్ మధు పేరుతో సిరీస్‌తో పాటు ఎన్నో రకాల వెబ్ సిరీస్ కామెడీ వీడియోస్ ఈ ఛానల్‌లో వస్తుంటాయి. వీరికి యూట్యూబ్‌లో 5 మిలియన్స్‌కు పైగా సబ్స్‌క్రైబర్లు ఉన్నారు. వీరు నెలకు 16 లక్షలకు పైగానే సంపాదిస్తున్నట్లు తెలుస్తోంది.
షణ్ముఖ్ జస్వంత్
ఎంటర్టైన్మెంట్ అంటే ఇష్టమవున్న వారికి షణ్ముఖ్ కచ్చితంగా పరిచయం ఉంటాడు. ఇతను ఇంటెర్టైన్మెంట్ వీడియోస్ తీస్తూ ఉటున్నారు. వెబ్ సిరీస్‌లు, షార్ట్ ఫిలిమ్స్ తీస్తూ ఉంటారు. ఈయనకు యూట్యూబ్‌లో 4.93 మిలియన్స్ సబ్స్‌క్రైబర్లు ఉన్నారు. అలాగే ఇన్‌స్టాలో కూడా భారీగానే ఫాలోయింగ్ ఉంది. ఈ రెండు సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా ఈయన నెలకు పది లక్షలకు పైగానే సంపాదిస్తున్నారు.
ప్రసాద్ టెక్ ఇన్ తెలుగు
తెలుగు టెక్ ఇండస్ట్రీలో ప్రసాద్ నంబర్ 1. ఎలాంటి మొబైల్ అయినా, ఏ విధమైన గాడ్జెట్ గురించి అయినా తెలుసుకోవాలంటే కచ్చితంగా ప్రసాద్ ఛానెల్‌ను ఓపెన్ చేసి చూస్తుంటారు. ఈయనకు యూట్యూబ్‌లో దగ్గర దగ్గరకు 5 మిలియన్స్ సబ్స్‌క్రైబర్లు ఉన్నారు. యూట్యూబ్ యాడ్ రెవిన్యూ ద్వారా ఈయన నెలకు 5 లక్షలకు పైగానే సంపాదిస్తున్నారు. మొబైల్ ప్రమోషన్స్ అదనంగా వస్తుంటాయి.
శ్రావణిస్ కిచెన్
శ్రావణి వంట వీడియోలను తమ యూట్యూబ్ ఛానల్‌లో పోస్ట్ చేస్తుంటారు. ఈమె వంటలకు తెలుగు రాష్ట్రాల్లో భారీగానే అభిమానులు ఉన్నారు. ఈమె ఏ వీడియో పెట్టినా ఆ వీడియోను లక్షలాది మంది చూస్తుంటారు. శ్రావణికి యూట్యూబ్‌లో 4.6 మిలియన్ మంది సబ్స్‌క్రైబర్లు ఉన్నారు. కేవలం యూట్యూబ్ యాడ్ రెవిన్యూ ద్వారా ఆమె 2 నుంచి 4 లక్షల వరకు సంపాదిస్తున్నారు.
బ్యాంకాక్ పిల్ల
యూట్యూబ్‌లో షార్ట్ వీడియోస్ ఎక్కువగా చూసేవారికి బ్యాంకాక్ పిల్ల గురించి తెలిసే ఉంటుంది. ఈవిడ బ్యాంకాక్ వింతలు విశేషాలను వీడియోల రూపంలో చూపిస్తుంటారు. ఈమెకు యూట్యూబ్‌లో 3.59 మిలియన్ మంది సబ్స్‌క్రైబర్లు ఉన్నారు. బ్యాంకాక్ పిల్ల కేవలం యూట్యూబ్ యాడ్ రెవిన్యూ ద్వారా నెలకు లక్ష నుంచి మూడు లక్షల వరకు సంపాదిస్తున్నారు. ప్రమోషన్స్ అదనంగా వస్తుంటాయి.
వీరితో పాటు మన తెలుగులో ఎంతో మంది యూట్యూబర్లు లక్షల్లో సంపాదిస్తున్నారు. కానీ ఎక్కువగా సంపాదిస్తుంది మాత్రం వీరు అని చెప్పుకోవచ్చు. కొందరికి ఎక్కువ మొత్తంలో సబ్స్‌క్రైబర్లు ఉన్నప్పటికీ ఆదాయం మాత్రం అంతగా రాదు. సబ్స్‌క్రైబర్లతో పాటు ఆదాయంలో టాప్-6 చానెళ్లు మాత్రం ఇవే.



Click it and Unblock the Notifications