Latest Updates
-
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.!
పుష్ప-2 ట్రైలర్, లాంచ్ ఈవెంట్ సాధించిన రికార్డులు ఇవే.. ఇండస్ట్రీ మొత్తం పుష్ప కిందే
అల్లు అర్జున్, రష్మిక జంటగా సుకుమార్ తెరకెక్కించిన చిత్రం.. పుష్ప-2. డిసెంబర్ 5వ తేదీన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో నిన్న అంటే నవంబర్ 17వ తేదీన ఈ మూవీ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ పాట్నాలో జరిగింది. ఈ ఈవెంట్‌తో పలు రికార్డులను అల్లు అర్జున్ తన ఖాతాలో వేసుకున్నారు. ఈ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ విశేషాలు, ట్రైలర్ ఎలా ఉంది?, ట్రైలర్ ఎలాంటి రికార్డులను సృష్టించింది అనేది ఈ స్టోరీలో తెలుసుకుందాం.
పుష్ప-2 ఈవెంట్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ప్రత్యేకతలు
బీహార్ రాజధాని పాట్నాలో ఈ మూవీకి సంబంధించిన ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌ను నిర్వహించారు. అత్యంత వైభవంగా నిర్వహించిన ఈ ఈవెంట్‌కు చాలా మంచి స్పందన లభించింది. ఈ ఈవెంట్‌కు సుమారు రెండు లక్షల మంది హాజరైనట్లు అంచనా. ఒక తెలుగు హీరోకి.. హిందీ బెల్ట్‌లో ఈ రేంజ్‌లో గుర్తింపు రావడం అనేది ఒక ప్రత్యేకమైన విషయం అని చెప్పుకోవచ్చు. ఈ ఈవెంట్‌ను సుమారు 900 మంది పోలీసులు గస్తీ కాసారు. అలాగే ఈ ఈవెంట్‌కు బీహార్ ప్రభుత్వం అనేక వసతులను కల్పించింది. ఏది ఏమైనప్పటికీ.. పుష్ప-2 ట్రైలర్ లాంచ్ ఈవెంట్ గ్రాండ్ సక్సెస్ అయ్యింది అని చెప్పుకోవచ్చు.

ప్రభాస్, మహేష్ రికార్డులను బద్దలుకొట్టిన అల్లు అర్జున్
పుష్ప-2 ట్రైలర్‌తో అల్లు అర్జున్ అన్ని రికార్డులను తిరగరాశారు. ప్రభాస్, మహేష్ బాబు, ఎన్టీఆర్ రికార్డులను తిరగరాసి అల్లు అర్జున్ పుష్ప-2తో సరికొత్త రికార్డులను సృష్టించారు. ఈ ట్రైలర్ కేవలం 15 గంటల్లోనే 41 మిలియన్ వ్యూస్‌ను సాధించి ఆల్ టైం రికార్డు సృష్టించింది. ఒక్క హిందీలోనే ఈ మూవీ ట్రైలర్‌కు 30 మిలియన్ల వ్యూస్ రావడం గమనార్హం. దీంతో యూట్యూబ్‌లో ట్రైలర్ విడుదలైన మొదటి రోజు అత్యధిక వ్యూస్ సాధించిన ట్రైలర్‌గా పుష్ప-2 ట్రైలర్ నిలిచింది. ఆ తరువాతి స్థానాల్లో మహేష్ బాబు గుంటూరు కారం, ప్రభాస్ సాలార్ సినిమాల ట్రైలర్లు ఉన్నాయి.
ట్రైలర్ ఎలా ఉంది? సినిమా బిజినెస్ ఎంత జరిగింది?
పుష్ప-2 ట్రైలర్ ఆధ్యంతం అద్భుతంగా ఉందని చెప్పుకోవచ్చు. ట్రైలర్‌లో సినిమాకు కావాల్సిన ఎలిమెంట్స్ అన్నీ ఉన్నాయి. ట్రైలర్ ఆసక్తికరంగా ఉండడంతో పాటు స్టోరీ కూడా కొంచెం కొత్తదిగా ప్రపంచం మొత్తం సూట్ అయ్యే విధంగా ఉన్నట్లు తెలుస్తోంది. ట్రైలర్‌లో విజువల్స్, గ్రాండియర్, మ్యూజిక్ అంతా బాగున్నాయి. ట్రైలర్ చూస్తున్నంత సేపు పుష్ప ప్రపంచంలో మనం ఉన్నట్లు అనిపిస్తోంది. ట్రైలర్‌లో పుష్ప మాత్రమే కనిపిస్తారు. అల్లు అర్జున్ ఏమాత్రం కనిపించరు. ట్రైలర్ చూస్తే సినిమా కచ్చితంగా 1500 కోట్లకు పైగా వసూళ్లను సాధించే అవకాశం ఉందని తెలుస్తోంది.
ఇప్పటికే ఈ మూవీ ప్రీరిలీజ్ బిజినెస్ వెయ్యి కోట్లకు పైగా చేసినట్లు టాక్ నడుస్తోంది. పైగా ఈ సినిమాకు బన్నీ రూ.300 కోట్లకు పైగా రెమ్యునరేషన్ తీసుకుంటున్నారట. ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా 13500 థియేటర్లలో విడుదల కానుంది. కేవలం ఇండియాలోనే 7500 స్క్రీన్‌లలో ఈ సినిమా విడుదల కానున్నట్లు తెలుస్తోంది. ఈ లెక్కన చూస్తే తొలిరోజు తొలి షోకు పాజిటివ్ టాక్ వస్తే ఈ మూవీ కచ్చితంగా 300 కోట్లకు పైగా వసూళ్లను రాబోట్టోచ్చు.



Click it and Unblock the Notifications