Latest Updates
-
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.! -
నీచ భంగ రాజయోగం: కర్కాటకంలోకి కుజ సంచారంతో ఈ రాశుల వారికి దరిద్రం వదిలిపోతుంది.! -
అమ్మ జన్మనిస్తే, గురువు జీవితాన్ని ఇస్తాడు.. టీచర్స్ డే స్పెషల్ వాట్సాప్ స్టేటస్, బెస్ట్ విషెస్ ఇవే! -
ఆ సమయంలోనే దంపతుల మధ్య ఎక్కువగా గొడవలు.. కారణాలేంటంటే.? -
ఈ పొడిని డైలీ అన్నం లేదా టిఫిన్‌లోకి తిన్నారంటే.. ఇక మందుల జోలికి వెళ్లాల్సిన పనిలేదు.! -
Teachers day recipe :ఉపాధ్యాయ దినోత్సవం స్పెషల్.. గురువుల కోసం కమ్మని పనీర్ పాయసం చేయండిలా.. -
ఉడకబెట్టాల్సిన పని లేదు.. చిక్కుడుకాయను కేటరింగ్ స్టైల్లో ఇలా చేస్తే ఫుల్‌గా లాగించేస్తారు.!
ఈ గడియారం ఒక్క ఒక్క సెకండ్ కదిలితే యుగాంతం అయిపోతుంది.. ఇప్పుడు అందులో టైం ఎంతంటే?
రెండేళ్ల తర్వాత, డూమ్స్ డే క్లాక్ మళ్లీ కదిలింది. ఇప్పుడు అది యుగాంతం సమీపానికి మరో అడుగు ముందుకువెళ్ళింది. ఇప్పటి వరకు 90 సెకండ్ల దూరంలో ఉన్న ఈ క్లాక్ ఇప్పుడు 89 సెకండ్ల దూరంలోకి వచ్చేసింది. అంటే, యుగాంతం దగ్గరపడటానికి మరొక 89 సెకండ్లే మిగిలి ఉంది. దీని అర్థం, మనం యుగాంతం వైపు చాలా దగ్గరగా ఉన్నట్లు. ఈ క్లాక్‌ను అభివృద్ధి చేసిన అణు శాస్త్రవేత్తలు ఏమంటున్నారో తెలుసుకుందాం.
డూమ్స్ డే క్లాక్ అంటే ఏమిటి?
డూమ్స్ డే క్లాక్ అంటే ప్రపంచంలో యుద్ధాలు, భూతాపం, కాలుష్యం, భూకంపాలు, సునామీలు, కరవు, ఆర్థిక సంక్షోభాలు వంటి అనేక సంఘటనలు పెరిగేకొద్దీ, ఇది మనం వినాశనం వైపు సాగిపోతున్నామని సూచిస్తుంది. దీన్ని సూచించడానికి అణు శాస్త్రవేత్తలు డూమ్స్ డే క్లాక్‌ను రూపొందించారు.

ఈ క్లాక్‌ను 1945 నుండి ఉపయోగిస్తున్నారు. 1947లో, అర్థరాత్రి 12 గంటలకు 7 నిమిషాలు మిగిలినప్పుడు ఈ క్లాక్ ప్రారంభం అయ్యింది. తరువాత, ప్రపంచ ఉద్రిక్తతలు పెరిగినప్పుడు, ఈ సమయం తగ్గుతూ.. విధ్వంసం దగ్గరలో ఉందని తెలుపుతుంది. 1960లో, మిడ్‌నైట్ 12 గంటలకు 10 నిమిషాల దూరంలో ఈ క్లాక్ కనిపించింది. 2010లో 6 నిమిషాలకు తగ్గిపోయింది. 2020లో, ఈ సమయం 100 సెకండ్లకు క్షీణించగా, 2023లో 90 సెకండ్లకు పడిపోయింది. ఇప్పుడు, ఇది 89 సెకండ్ల దూరంలో ఉంది.
ప్రపంచ అంతం..
డూమ్స్ డే అనేది ప్రపంచం అంతమయ్యే రోజును సూచిస్తుంది. ఆ రోజు, ఈ క్లాక్‌లో సమయం 12 గంటలకు చేరుకుంటుంది. ఈ రోజు తరువాత ప్రపంచం ఉండదు, అని ఈ క్లాక్ అర్థం. ప్రపంచంలోని పరిస్థితులను అంచనా వేసేందుకు మరియు అవగాహన పెంచేందుకు ఈ క్లాక్ అనధికారికంగా ఉపయోగించబడుతోంది. డూమ్స్ డే క్లాక్ ప్రారంభమైనప్పటి నుంచి, ఇప్పటివరకు ఇంత తక్కువ సమయం యుగాంతానికి మిగిలి ఉండడం ఇదే తొలిసారి.
ఈ గడియారం యొక్క ముఖ్య ఉద్దేశం మనం ప్రపంచం అంతానికి అత్యంత దగ్గరలో ఉన్నామని చెప్పడమే. అలాగే మనుషులను మీ జాతి అంతానికి చాలా దగ్గర సమయం ఉందని తెలుపుతుందని చెబుతున్నారు. అందుకే ఈ వాతావరణాన్ని, భూమిని రక్షించాలని కోరుతున్నారు.



Click it and Unblock the Notifications