Latest Updates
-
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.! -
నీచ భంగ రాజయోగం: కర్కాటకంలోకి కుజ సంచారంతో ఈ రాశుల వారికి దరిద్రం వదిలిపోతుంది.! -
అమ్మ జన్మనిస్తే, గురువు జీవితాన్ని ఇస్తాడు.. టీచర్స్ డే స్పెషల్ వాట్సాప్ స్టేటస్, బెస్ట్ విషెస్ ఇవే!
Holi 2026: ఇంట్లోనే సహజసిద్ధమైన హోలీ రంగులు..తయారు చేసుకోండిలా!
రంగుల పండుగ అనగానే మనకు వెంటనే గుర్తొచ్చేది హోలీ. వసంత రుతువుకు స్వాగతం పలుకుతూ ప్రతి ఏడాదీ ఎంతో ఉత్సాహంగా జరుపుకునే ఈ పండుగ కోసం అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. ఈ ఏడాది మార్చి 4న హోలీ పండుగను జరుపుకుంటారు.కొన్ని ప్రాంతాల్లో మార్చి 3నే హోలీ సెలబ్రేషన్స్ జరుగుతాయి.
హోలీ పందర్భంగా సంతోషంగా ఒకరిమీద ఒకరు రంగులు చల్లుకుంటాం. అయితే మార్కెట్లో దొరికే రసాయనాలతో కూడిన రంగుల వల్ల చర్మ సమస్యలు, ఎలర్జీలు, జుట్టు రాలిపోవడం వంటివి జరుగుతాయి. కాబట్టి మీ ఇంట్లోనే దొరికే సహజసిద్ధమైన వస్తువులతో సురక్షితమైన రంగులను చాలా సులభంగా తయారు చేసుకోవచ్చు. అదెలాగో ఇక్కడ చూడండి.

ప్రకాశవంతమైన పసుపు రంగు
పసుపు రంగును తయారు చేయడం చాలా సులభం. రెండు స్పూన్ల ఆర్గానిక్ పసుపులో నాలుగు స్పూన్లు శనగపిండి లేదా బియ్యం పిండి కలపండి. ఈ మిశ్రమాన్ని బాగా కలుపుకుంటే చర్మానికి మేలు చేసే పొడి పసుపు రంగు రెడీ. నీటి రంగు కావాలంటే బంతిపూల రేకులను నీటిలో రాత్రంతా నానబెట్టి లేదా ఉడకబెట్టి వడకట్టుకోవచ్చు.
ఆకర్షణీయమైన ఎరుపు రంగు
ఎరుపు రంగు గులాల్ కోసం ఎండబెట్టిన మందార పూల రేకులు లేదా ఎర్ర గులాబీ రేకులను మెత్తని పొడిలా మిక్సీ పట్టుకోండి. దీనికి కొద్దిగా ఎర్ర చందనం పొడి, బియ్యం పిండి కలిపితే కమ్మని సువాసన వచ్చే ఎరుపు రంగు తయారవుతుంది. నీటి రంగు కావాలనుకుంటే బీట్ రూట్ ముక్కలను నీటిలో బాగా మరిగించి, ఆ నీటిని చల్లార్చి వాడుకోవచ్చు.
ఆహ్లాదకరమైన ఆకుపచ్చ రంగు
స్వచ్ఛమైన గోరింటాకు (మెహందీ) పొడికి సమాన పరిమాణంలో గోధుమ పిండి లేదా మైదా పిండిని కలపండి. ఇది పొడి రంగులా అద్భుతంగా పనిచేస్తుంది. మార్కెట్లో దొరికే హెయిర్ డై మెహందీ వాడకూడదు. పచ్చని నీటి కోసం పాలకూర, పుదీనా లేదా వేప ఆకులను పేస్ట్ లా చేసి నీటిలో కలుపుకోవచ్చు. ఇది చర్మానికి ఇన్ఫెక్షన్లు రాకుండా కాపాడుతుంది.

అందమైన గులాబీ రంగు
ఒక బీట్ రూట్ ను తురిమి కొద్దిగా నీళ్లు పోసి రసం తీయండి. ఆ రసాన్ని ఒక కప్పు టాల్కమ్ పౌడర్ లేదా కార్న్ ఫ్లోర్ (మొక్కజొన్న పిండి)లో బాగా కలిపి ఎండలో ఆరబెట్టండి. ఎండిన తర్వాత మిక్సీ పడితే మార్కెట్లో దొరికే గులాల్ లాంటి స్మూత్ పింక్ కలర్ మీ సొంతం.
నీలం రంగు
శంఖు పూలను ఎండబెట్టి మెత్తగా పొడి చేసి, దానికి టాల్కమ్ పౌడర్ లేదా బియ్యం పిండి కలిపితే సహజసిద్ధమైన నీలం రంగు వస్తుంది. ఆ పూలను నీటిలో మరిగించి బ్లూ కలర్ నీటిని కూడా తయారు చేసుకోవచ్చు.
సహజ రంగులతో ఉపయోగాలు
మన వంటగదిలోని వస్తువులతో తయారు చేసిన ఈ రంగులు చర్మానికి ఎలాంటి హాని చేయవు. ముఖ్యంగా పసిపిల్లలు, సున్నితమైన చర్మం ఉన్నవారు కూడా స్వేచ్ఛగా హోలీ ఆడుకోవచ్చు. పైగా వీటి తయారీలో మనం ఉపయోగించే పసుపు, శనగపిండి, గులాబీ రేకులు చర్మానికి నిగారింపును ఇచ్చే ఫేస్ ప్యాక్ లా కూడా పనిచేస్తాయి. పర్యావరణానికి కూడా ఇవి ఎంతో మేలు చేస్తాయి.



Click it and Unblock the Notifications