Latest Updates
-
ఆకలినే ఆయుధంగా మార్చి 20 రోజులుగా నిరాహార దీక్ష.. ఎందుకీ ఉద్యమం, ఎవరీ సోనం వాంగ్ చుక్.! -
గ్రహాల శక్తితో పాటు దైవానుగ్రహం.. పూజలో ఈ రంగు వస్త్రాన్నే ఎందుకు ఉపయోగిస్తారో తెలుసా.? -
రాత్రి పూట స్వీట్ తినాలనిపిస్తుందా? ఓవెన్ అక్కర్లేకుండానే ఇంట్లోనే బేకరీ స్టైల్ బనానా బ్రెడ్ చేసుకోండిలా.. -
పిల్లలు, వృద్ధుల ఎముకల బలానికి రాగి, మునగాకు రోటి.. రోజూ ఒక్కటి తింటే చాలు.! -
మగవారిలో వీర్య కణాల సంఖ్య దారుణంగా పడిపోవడానికి ఈ పది ఆహార పదార్థాలే కారణం.! -
పప్పుచారులోకి బెస్ట్ సైడ్ డిష్.. పైన క్రిస్పీగా, లోపల సాఫ్ట్ గా ఉండే ఎగ్ వడ.. 10 నిమిషాల్లో చేసేయండిలా -
ఈ మూడు రాశుల వారికి ఊహించని ఆర్థిక అవకాశాలు.. ఏ పరిహారాలు చేస్తే ఇంకా మంచిది.! -
వారం రోజులు నిల్వ ఉండే సొరకాయ హల్వా..రసాలూరుతూ భలే రుచిగా.. -
మీ పిల్లలు రోజులో ఎన్ని చాక్లెట్స్ తింటున్నారు.. ఈ లిమిట్ దాటితే ఎంత ప్రమాదమో తెలుసా.? -
భక్తులకు అలర్ట్.. పూరీ జగన్నాథ రథయాత్రలో తొక్కిసలాట.. రద్దీలో మిమ్మల్ని మీరు ఎలా కాపాడుకోవాలి.?
హ్యాపీ హోలీ 2026..మీ బంధుమిత్రులకు పంపడానికి బెస్ట్ హోలీ విషెస్, వాట్సాప్ స్టేటస్ లు ఇవే!
హోలీ పండుగ కేవలం రంగుల పండుగ మాత్రమే కాదు, దీనికి ఎంతో చారిత్రక, సాంస్కృతిక, సామాజిక ప్రాముఖ్యత ఉంది. అహంకారి అయిన హిరణ్యకశిపుడి సోదరి హోలిక మంటల్లో కాలిపోవడం, విష్ణు భక్తుడైన ప్రహ్లాదుడు సురక్షితంగా బయటపడటాన్ని పురస్కరించుకుని ఈ పండుగ జరుపుకుంటారు. ఇది చెడు ఎంత బలమైనదైనా, చివరికి మంచిదే విజయం అని చాటిచెబుతుంది.
హోలీ రాధాకృష్ణుల పవిత్రమైన ప్రేమకు ప్రతీక. ముఖ్యంగా బృందావనంలో ఈ పండుగను ప్రేమ పండుగగా అంగరంగ వైభవంగా జరుపుకుంటారు. చలికాలం ముగిసి, చెట్లు కొత్తగా చిగురించే వసంత రుతువు రాకను ఈ పండుగ స్వాగతిస్తుంది. ప్రకృతి సైతం పచ్చదనం, పూల రంగులతో కళకళలాడుతుంది.

ఈ ఏడాది మార్చి 4న హోలీ పండుగ జరుపుకుటారు. హోలీ పండుగ సందర్భంగా మీ కుటుంబ సభ్యులకు, స్నేహితులకు, ప్రియమైన వారికి ఆకట్టుకునే విషెస్ ఎలా చెప్పాలో ఇక్కడ చూడండి.
హోలీ విషెస్ ఇలా చెప్పండి
-ఈ హోలీ పండుగ మీ జీవితంలో సంతోషం, ఆరోగ్యం, ఆనందం అనే రంగులను నింపాలని కోరుకుంటున్నాను. హ్యాపీ హోలీ.
-కష్టాలన్నీ హోలికా దహనంలో కాలిపోయి, సంతోషాలు చిగురించాలి. మీకు, మీ కుటుంబ సభ్యులకు హోలీ శుభాకాంక్షలు.
-రంగుల పండుగ తెచ్చిన ఈ నూతన ఉత్సాహం మీ ఇంట సిరులు కురిపించాలి. హ్యాపీ హోలీ 2026.
-ద్వేషాలను మరచిపోయి, ప్రేమను పంచుకునే ఈ అందమైన పండుగను ఆనందంగా జరుపుకోండి.
-మీ మనసు, మీ జీవితం ఎల్లప్పుడూ హోలీ రంగుల్లాగే ప్రకాశవంతంగా ఉండాలి. హ్యాపీ హోలీ.
-వసంత రుతువు రాకతో మీ జీవితంలో కూడా కొత్త వసంతం వికసించాలి. హోలీ శుభాకాంక్షలు.
-మీ చిరునవ్వు ఎప్పటికీ ఈ రంగుల్లాగే చెదరకుండా ఉండాలి. హ్యాపీ హోలీ.
-పగలు, ప్రతీకారాలు వదిలేసి అందరూ ఒకటై జరుపుకునే పండుగ ఇది.. అందరికీ హోలీ శుభాకాంక్షలు.
-ఆ దేవుడి ఆశీస్సులు, ఇంద్రధనుస్సులోని 7 రంగుల్లా మీ జీవితాన్ని అందంగా మార్చాలి.
-ప్రతి రంగు మీకో కొత్త ఆశను, విజయాన్ని అందించాలి. హ్యాపీ కలర్ ఫుల్ హోలీ.
-ప్రకృతి పులకించే పండుగ, మనసు మురిపించే పండుగ.. మీకందరికీ రంగుల పండుగ శుభాకాంక్షలు.
-సురక్షితమైన రంగులతో జరుపుకోండి, కుటుంబంతో సంతోషాన్ని పంచుకోండి. సేఫ్ అండ్ హ్యాపీ హోలీ.
-ఈ రోజు మీరు పూసుకునే ప్రతి రంగు మీ జీవితంలో సుఖశాంతులను తీసుకురావాలి.
-అందరితో కలిసి పంచుకునే ఆనందమే నిజమైన పండుగ. హ్యాపీ హోలీ.
-ఎరుపు ప్రేమకు, ఆకుపచ్చ సంతోషానికి, పసుపు సిరిసంపదలకు ప్రతీక.. ఇవన్నీ మీకు దక్కాలి.
వాట్సాప్ స్టేటస్ లు
-నా జీవితాన్ని రంగులమయం చేసిన ప్రతి ఒక్కరికీ హ్యాపీ హోలీ.
-పలకరింపుల హోలీ..పులకరింపుల హోలీ.. రంగుల కేళి.
-ఈ రోజు ఏ రంగు పూసుకున్నా అందమే. హ్యాపీ హోలీ 2026.
-మనసుల మధ్య దూరం చెరిపేసే పండుగ హోలీ.
-నా వాట్సాప్ స్టేటస్ చూస్తున్న అందరికీ హ్యాపీ హోలీ.
-ముఖానికి రంగులు.. మనసుకు సంతోషం. కీప్ స్మైలింగ్. హ్యాపీ హోలీ.
-స్నేహానికి రంగులద్దే రోజు ఇది. లవ్ యు ఫ్రెండ్స్.
--గొడవలు మర్చిపోదాం..రంగులు చల్లుకుందాం.
-సేఫ్ హోలీ..హ్యాపీ హోలీ. కెమికల్ రంగులకు దూరం, ప్రకృతికి దగ్గర.
-వసంతం తెచ్చిన ఈ రంగుల వేడుక మురిపాల జాతర.
-లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్.. ఎంజాయ్ ద కలర్స్ ఆఫ్ హోలీ.

హోలీ కోట్స్
-రంగులు కేవలం చర్మానికే కాదు, మనసుకు కూడా అంటుకోవాలి.. అప్పుడే అది నిజమైన సంతోషం.
-ప్రహ్లాదుడి భక్తిని, రాధాకృష్ణుల ప్రేమను గుర్తుచేసే గొప్ప పండుగ హోలీ.
-మనసులోని చీకటిని తరిమేసి, కొత్త ఆశాకిరణాలు నింపే పండుగ ఇది.
-కుల మత భేదాలు మరచి మనుషులంతా రంగుల్లో ఏకమయ్యే అద్భుతమైన రోజు హోలీ.
-ప్రేమంటే ఎరుపు, శాంతి అంటే తెలుపు..జీవితం నవరసాల, నవ వర్ణాల కలయిక.
-మనం చూసే దృష్టిలో ఉంటుంది రంగు, పంచే ప్రేమలో ఉంటుంది ఆనందం.
-అహంకారాన్ని హోలిక మంటల్లో దహనం చేసి, వినయాన్ని అలవర్చుకుందాం.
-ఎండిన ఆకు రాలిపోయి, కొత్త చిగురు వచ్చే సమయం.. మార్పు అనేది ప్రకృతి సహజం.
-ఒక రంగు ఇంకో రంగుతో కలిస్తేనే అందం.. ఒక మనిషి ఇంకో మనిషితో కలిస్తేనే ఆనందం.
రొమాంటిక్ విషెస్
-నా జీవితంలోకి వచ్చి నాలో ఆనందపు రంగులు నింపిన నీకు హ్యాపీ హోలీ.
-నీ చిరునవ్వే నా జీవితానికి అసలైన రంగు.. మై లవ్, హ్యాపీ హోలీ.
-మన ఇద్దరి ప్రేమ రాధాకృష్ణుల ప్రేమలా కలకాలం వర్ధిల్లాలి.
-నువ్వు నా పక్కన ఉంటే నాకు ప్రతి రోజూ హోలీనే.
-నా లోకంలో నిండిన ఏకైక రంగు నీ ప్రేమ. హ్యాపీ హోలీ డియర్.
-దూరంగా ఉన్నా నా మనసంతా నీవే నిండి ఉన్నావు. హోలీ శుభాకాంక్షలు.
-రంగుల ఈ పండుగ మన బంధాన్ని మరింత బలోపేతం చేయాలి.
-నువ్వు నా జీవితంలోకి వచ్చాక నా బ్లాక్ అండ్ వైట్ జీవితం కలర్ ఫుల్ గా మారింది.
-నీ చేతితో నా బుగ్గన రాసిన రంగు జీవితకాలం గుర్తుంటుంది.
-నా ప్రేమ రంగులతో నీ జీవితాన్ని ఎప్పటికీ ఆనందంగా ఉంచుతాను. హ్యాపీ హోలీ 2026.



Click it and Unblock the Notifications