Latest Updates
-
జెన్ జెడ్ తరానికి శ్రీకృష్ణుడి సందేశం.. గీత నుంచి నేటి యువత నేర్చుకోవాల్సిన కీలక పాఠాలివే.! -
కేవలం 15 నిమిషాల్లో.. పైకి కరకరలాడుతూ, లోపల సాఫ్ట్ గా ఉండే ఎగ్ పకోడి ఎలా చేసుకోవాలంటే.. -
కొత్తగా తల్లయిన వారికి అలర్ట్.. పిల్లలకు రెండేళ్ల వరకు ఇదొక్కటి అస్సలు ఇవ్వకూడదు.! -
ఉట్టికి, చిన్ని కృష్ణుడికి సంబంధమేంటి.. కృష్ణాష్టమికి ఉట్లు ఎందుకు కొడతారో తెలుసా.? -
గుడిలో పెట్టే ప్రసాదం రుచితో.. ఈ జన్మాష్టమికి ఇంట్లోనే కమ్మని పంచామృతం చేసుకోండిలా.. -
చుక్క నూనె లేకుండా లంచ్ బాక్స్‌లోకి ఈజీగా చేసెయొచ్చు.. రక్తహీనతని సైతం తరిమికొట్టేస్తుంది.! -
Powerful Krishna Mantras: కృష్ణాష్టమి నాడు ఈ మంత్రాలు జపిస్తే.. మీ కోరికలన్నీ ఇట్టే నెరవేరుతాయి! -
యదా యదా హి ధర్మస్య.. శ్రీకృష్ణుడి స్ఫూర్తితో మీ బంధుమిత్రులకు జన్మాష్టమి శుభాకాంక్షలు చెప్పండిలా! -
బుధ గ్రహ గోచారం: అదృష్టం అంటే వీరిదే.. సెప్టెంబర్ 7 నుంచి ఈ నాలుగు రాశుల వారికి గోల్డెన్ డేస్.! -
కృష్ణాష్టమి స్పెషల్ అటుకులు నువ్వుల లడ్డూ..10 నిమిషాల్లోనే ఎలా చేసుకోవాలంటే..
ఆకాశంలో రేపు అద్భుతం.. నల్లగా మారనున్న చంద్రుడు! ఎందుకంటే?
విశ్వం ఎప్పుడూ అంతు చిక్కని రహస్యమే. అందులో ఎన్నో అద్భుతమైన సంఘటనలు ప్రతిరోజూ జరుగుతూ ఉంటాయి. ఆ ఘటనలు ఎప్పుడూ ఆశ్చర్యపరుస్తూనే ఉంటాయి. అందులోని గ్యాలక్సీలు, వాటికి సంబంధించిన చిత్రాలు ఎప్పుడూ ట్రెండింగ్‌లో ఉంటాయి. అయితే రేపు మన విశ్వంలో బ్లాక్ మూన్ కనిపించనుంది. ఇప్పటి వరకు చంద్రుడు పసుపు, ఎరుపు, కొన్ని కొన్ని సార్లు గులాబీ రంగులో కూడా కనిపిస్తుంటాడు. కానీ ఇప్పుడు నలుపు రంగులో దర్శనమివ్వనున్నాడు. దీనికి సంబంధించిన మరిన్ని విషయాలు మనం ఈ స్టోరీలో తెలుసుకుందామా?
నలుపు రంగులో చంద్రుడు
చంద్రుడు ఎప్పుడూ పాలరాతి రంగులో తెల్లగా ప్రకాశిస్తూ కనిపిస్తుంటాడు. ఇప్పటి వరకు చంద్రుడిని అనేక రంగుల్లో చూశాము. కానీ ఈసారి సరికొత్తగా నలుపు రంగులో చూడబోతున్నాము. దీనిని బ్లాక్ మూన్ అని కూడా పిలుస్తుంటారు. దీంతో ప్రపంచ దేశాల్లోనో శాస్త్రవేత్తల చూపు చంద్రుడిపై పడింది. అలాగే స్కై వాచర్ల ఇంట్రెస్ట్ దీనిపై మళ్లిందని చెప్పుకోవచ్చు.

అమెరికాకు చెందిన నావల్ అబ్జర్వేటరీ ప్రకారం ఈ నల్ల చంద్రుడు కొన్ని దేశాల్లో మాత్రమే కనిపించనుంది. ఇంగ్లండ్ టైం ప్రకారం ఈరోజు సాయంత్రం 5:27 గంటలకు ఈ నలుపు చంద్రుడు దర్శనమివ్వనున్నాడు. ఐరోపా, ఆఫ్రికా, ఆసియాలోని కొన్ని దేశాల్లో ఈ సమయంలో నల్ల చంద్రుడు కనిపిస్తాడు. మన దేశంలో కూడా నలుపు చందమామ డిసెంబర్ 31వ తేదీ తెల్లవారు జామున 3:57 గంటలకు కనిపించనున్నాడు.
ఎందుకు ఏర్పడుతుంది?
ఈరోజు సోమవతి అమావాస్య అన్న విషయం తెలిసిందే. అయితే అమావాస్య రాత్రి సూర్యుడు, చంద్రుడు సమాంతరంగా ఉండడంతో పాటు.. భూమిపై చంద్రుడు ప్రకాశించే భాగాన్ని సూర్యుడు కవర్ చేయడం వల్ల ఈ బ్లాక్ మూన్ ఏర్పడుతుంది. కొన్ని కొన్ని సార్లు ఒకే నెలలో రెండు అమావాస్యలు ఏర్పడినప్పుడు కూడా ఈ బ్లాక్ మూన్ కనిపిస్తుంటుంది. ఈ బ్లాక్ మూన్ ఏర్పడడం అనేది అత్యంత అరుదైన సంఘటన అని చెప్పుకోవచ్చు. కొన్ని అనివార్య సంఘటనలలో మాత్రమే ఇది కనిపిస్తుంటుంది.
బ్లూ మూన్ మాదిరిగానే
బ్లాక్ మూన్ కూడా బ్లూ మూన్ మాదిరిగానే ఉంటుంది. అయితే బ్లూ మూన్ పౌర్ణమి వచ్చినప్పుడు ఏర్పడుతుంది. కానీ బ్లాక్ మూన్ అమావాస్య వచ్చిన మరుసటి రోజు కనిపిస్తుంది. మన క్యాలెండర్ ప్రకారం దీనిని నవచంద్ర అని కూడా పిలుస్తుంటారు. బ్లాక్ మూన్ నిజానికి చాలా అరుదుగా జరుగుతుంది. ఇది 29 నెలలకు ఒకసారి మాత్రమే వస్తుంది, కాలానుగుణంగా ప్రతి 33 నెలలకు ఒకసారి వస్తుంది.



Click it and Unblock the Notifications