Latest Updates
-
అబ్బాయి వర్జిన్ కాదని పెళ్లి రద్దు చేసుకున్న యువతి..అసలు నువ్వు వర్జినేనా అంటూ.. -
100 ఏళ్లు బతికించే హెల్తీ బ్రేక్ ఫాస్ట్..రోజుకి ఒక గిన్నె తింటే బరువు ఇట్టే తగ్గిపోతారు..ఎలా చేసుకోవాలంటే.. -
హోటల్ స్టైల్ ఇడ్లీ కారం పొడి..బ్రేక్ ఫాస్ట్ లోకి చట్నీ కూడా వద్దంటారు..ఇంట్లోనే ఇలా చేసుకోండి.. -
కిడ్నీలు పాడవడానికి ముందు కనిపించే ముఖ్యమైన లక్షణాలు ఇవే -
ఇడ్లీ,దోశ,చపాతీల్లోకి కేక పుట్టించే చికెన్ నిర్వాణ..బ్యాచిలర్స్ కూడా ఈజీగా చేసుకోవచ్చు -
పెద్ద ఎర్రిపప్ప అయ్యావ్ మావా: ప్రియురాలి కోసం మొత్తం అమ్మేసి 1900 కి.మీ ప్రయాణించి వెళ్తే..అసలు అమ్మాయే కాదట! -
దసరా స్పెషల్ నైవేద్యం చక్కెర పొంగలి..సంప్రదాయ పద్ధతిలో ఇలా చేస్తే ఇళ్లంతా డివోషనల్ వైబ్ -
దసరా స్పెషల్ కట్టె పొంగలి..ఇలా చేస్తే చల్లారినా కూడా గట్టిగా మద్ద అవ్వదు! -
దసరా నాడు అపరాజితా దేవి పూజ ఎలా చేయాలి? శుభ ముహూర్తం, మంత్రాలు, శమీ పూజ డీటెయిల్స్.. -
దసరా స్పెషల్ రెడ్ చికెన్.. చికెన్ కర్రీ వండేటప్పుడు ఈ సీక్రెట్ మసాలా వేస్తే టేస్ట్ నెక్ట్స్ లెవల్ అంతే!
మైకేల్ జాక్సన్, ప్రిన్సెస్ డయానా చనిపోకపోతే ఎలా ఉండేవారో తెలుసా..
అల్పర్ యెసిల్టాస్ అనే కళాకారుడు మైకేల్ జాక్సన్, ప్రిన్సెస్ డయానా, జాన్ లెన్నాన్, పాల్ వాకర్, హీత్ లెడ్జర్ ఫోటోలు తీయగా, ఆ ఫోటోలు వైరల్ అయ్యాయి.
చిన్నప్పటి ఫోటోలో చూడటం ప్రతి ఒక్కరికీ సరదాగా ఉంటుంది. అప్పటి నుండి ఇప్పటికి ఎంతలా మారిపోయామో తెలుసుకోవాలన్న ఆత్రుత అది. అలాగే పెద్దయ్యాక, ముసలితనం వచ్చాక ఎలా ఉంటామో తెలుసుకోవాలని ప్రతి ఒక్కరికీ ఉంటుంది. జుట్టు నెరసిపోయి, చర్మంపై ముడతలతో ఎలా ఉంటామన్న కుతూహలం ఉంటుంది. కొన్ని యాప్‌లు మనం వృద్ధాప్యంలో ఎలా కనిపిస్తామో కూడా చూపిస్తాయి. వీటిని చూసి మనం చాలా సంతోషిస్తాం. మనం ఒకేలా కనిపిస్తామో లేదో తెలియదు కానీ, పెద్దయ్యాక మనం ఎలా ఉంటామో చూడ్డానికి సరదాగా ఉండదా?

కానీ కొందరు కళాకారులు తమ ఊహల ద్వారా మనం వృద్ధాప్యంలో ఎలా ఉంటామో అనే చిత్రాన్ని చిత్రీకరిస్తారు. ఇప్పుడు టుకీకి చెందిన ఓ ఆర్టిస్ట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగించి మరణించిన పలువురు ప్రముఖుల ఫోటోలను గీశాడు. వాటిన సోషల్ మీడియాలో షేర్ చేయడంతో అవి కాస్త వైరల్ గా మారాయి. అల్పర్ యెసిల్టాస్ అనే కళాకారుడు మైకేల్ జాక్సన్, ప్రిన్సెస్ డయానా, జాన్ లెన్నాన్, పాల్ వాకర్, హీత్ లెడ్జర్ ఫోటోలు తీయగా, ఆ ఫోటోలు వైరల్ అయ్యాయి.

మైకేల్ జాక్సన్
తన అద్భుతమైన డ్యాన్స్‌తో, పాటలతో ప్రపంచాన్ని ఉర్రూతలూగించిన మైకేల్ జాక్సన్ జూన్ 25, 2009న మరణించాడు. మైకేల్ జాక్సన్ ఎంత గొప్ప టాలెంటెడ్ వ్యక్తో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పాప్ సంగీతంలో చక్రవర్తిలా వెలుగొందాడు. అయితే నల్లగా ఉండటం వల్ల తాను అందంగా లేనని అనుకునే వాడు జాక్సన్. అందుకే తాను తెల్లగా కావడం కోసం చాలా సర్జరీలు చేయించుకున్నాడు. అందుకే ప్రజలు అతని అసలు రూపాన్ని మర్చిపోయారు, ఇప్పుడు కళాకారుడు మైఖేల్ జాక్సన్ ఇప్పుడు ఉంటే ఎలా ఉండేవాడో చూపించాడు.

ప్రిన్సెస్ డయానా
యువరాణి డయానా ఆగస్ట్ 31, 1997న ఒక ప్రమాదంలో మరణించింది. డయానా మరణించిన చాలా సంవత్సరాల తరువాత ఇప్పటికీ ఆమె జ్ఞాపకం ఉంది. యువరాణి డయానా ఎప్పటికీ మా రాణి అని ఇంగ్లండ్ ప్రజలు అంటున్నారు. ఇంగ్లండ్ రాజకుటుంబానికి కోడలు అయినప్పుడు డయానా జీవితం పూర్తిగా మారిపోయింది. తన వైవాహిక జీవితంలో చాలా బాధలను అనుభవించిన డయానా. ప్రిన్స్ చార్లెస్‌కు విడాకులు ఇవ్వడం ద్వారా రాజకుటుంబానికి ఫిర్యాదు చేసింది. కాని ప్రజలు ఇప్పటికీ ఆమెను తమలాగే గుర్తుంచుకుంటారు.

పాల్ వాకర్
ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ చిత్రాలతో అటు హాలీవుడ్ ప్రేక్షకులతో పాటు భారత సినీ ప్రేక్షకులకు సుపరిచితుడయ్యాడు పాల్ వాకర్. అయితో 2013లో పాల్ వాకర్ ఓ రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయాడు. తన స్నేహితుడితో కలిసి పోర్షే కరెరా జీటీ స్పోర్ట్స్ కారులో వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ప్రమాద సమయంలో పాల్ వాకర్ డ్రైవింగ్ సీట్లో కాకుండా ప్యాసింజర్ సీట్లో కూర్చున్నట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు.
సెలీనా, జాన్ లెన్నాన్, హీత్ లెడ్జర్ యొక్క మరిన్ని ఫోటోలను చూడండి..



Click it and Unblock the Notifications
