Latest Updates
-
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.!
మెగాస్టార్ పారితోషికం ఎంత, చిరంజీవికి వెల కట్టే నిర్మాతలు ఉన్నారా ?
మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు సందర్బంగా ఆయన అభిమానులు చేస్తున్న సందడి సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. మెగాస్టార్ చిరంజీవి బర్త్ డే సందర్బంగా తెలుగు రాష్ట్రాల్లో మెగా అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. చిరంజీవి సినిమాలు ఎప్పుడెప్పుడు విడుదల అవుతాయా అని ఆయన అభిమానులు వెయ్యి కళ్లతో ఎదురు చూస్తుంటారు. చిరంజీవి సినిమా విడుదల కోసం ప్రపంచ వ్యాప్తంగా సినీ అభిమానులు ఎదురు చూస్తుంటారు.
మెగాస్టార్ చిరంజీవి ఒక్క సినిమాలో నటించడానికి ఎంత పారితోషికం తీసుకుంటారు అనే విషయంలో చాలా ఏళ్లుగా చర్చ జరుగుతోంది. తెలుగులో నెంబర్ వన్ హీరో, సీనియర్ హీరో అయిన చిరంజీవి పారితోషికం నేటి యువ హీరోలు, పాన్ ఇండియా సినిమా హీరోల కంటే ఎక్కువ ఉంటుందా, తక్కువ ఉంటుందా అని చాలా మందికి అనుమానాలు రావడంతో సినీ అభిమానులు కూడా చిరంజీవి పారితోషికం గురించి తెలుసుకోవడానికి గూగుల్ లో తెగ వెతికేస్తున్నారు.

వాస్తవానికి మెగాస్టార్ చిరంజీవి రాజకీయాల్లోకి రాకముందు ఆయనకంటే తెలుగు సినీ ఇండస్ట్రీలో ఎక్కువ పారితోషికం తీసుకున్న హీరోలు లేరనే తెలుగు సినీ వర్గాలు అంటున్నాయి. శంకర్ దాదా జిందాబాద్ సినిమా తరువాత హీరో చిరంజీవి రాజకీయాల్లోకి రావడంతో ఆయన సినిమా రంగానికి దూరం అయ్యారు. అప్పటి వరకు తెలుగు ఇండస్ట్రీలో చిరంజీవి నెంబర్ వన్ హీరో అని అందరికీ తెలిసిందే. రాజకీయాల్లో బిజీ అయిపోయిన తరువాత చిరంజీవి సినిమాలకు తాత్కాలికంగా దూరం అయ్యారు.
సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చిన చిరంజీవి మరోసారి ఆయన సత్తా చాటుకున్నారు. ఏ రోజు అయితే ఖైదీ నెంబర్ 150 సినిమా విడుదల అయ్యిందో ఆ రోజు తర్వాత చిరంజీవి మార్కెట్ పెరిగిపోయిందని సినిమా వర్గాలు అంటున్నాయి. చిరంజీవితో సినిమా తియ్యాలని ప్రతి ఒక్క నిర్మాత ఎక్కువగా ఆసక్తి చూపిస్తారు అనే విషయం కొత్తగా చెప్పాల్సిన అవసరంలేదు. అయితే కథ నచ్చితే కొత్త నిర్మాతలు, దర్శకులతో కూడా కలిసి పని చెయ్యడానికి చిరంజీవి ముందు వరుసలోనే ఉంటారు అనే విషయంలో ఎలాంటి సందేహం లేదు.
చిరంజీవి ఒక్క సినిమాలో నటించడానికి ఎంత పారితోషికం తీసుకుంటారు అనే సందేహం చాలా మందికి ఉంది. చిరంజీవి ఒక్క సినిమాకి ఇంత మొత్తంలో పారితోషికం తీసుకుంటారు, అంత మొత్తంలో పారితోషికం తీసుకుంటారు అని ప్రచారం జరిగినా ఆయన మాత్రం ఒక్క సినిమాకు ఇంతే అమౌంట్ అని ఫిక్స్ చేయరని తెలిసింది. సినిమా కథ విన్న తర్వాత, ఆ సినిమాలో నటించిన తరువాత, ఆ సినిమా రిలీజ్ అయిన తర్వాత వచ్చిన లాభాలలో మెగాస్టార్ చిరంజీవికి ప్రత్యేకంగా కొంత వాటా ఉంటుందని సమాచారం.

నేటి యువ హీరోలతో, ముఖ్యంగా కుమారుడు రామ్ చరణ్ తో కూడా పోటీపడి నటిస్తున్న మెగాస్టార్ చిరంజీవికి భారీ మొత్తంలో పారితోషకం ఇచ్చే విషయంలో నిర్మాతలు వెల కట్టడం లేదని, ఆయన నటించిన సినిమాలు విడుదలైన తర్వాత వచ్చే లాభాల్లో ఆయనకు వాటా ఇస్తున్నారని సమాచారం. బయట ప్రచారం జరిగినట్లు ఒక సినిమాలో నటించడానికి మెగాస్టార్ చిరంజీవి అన్ని కోట్లు తీసుకుంటారు, ఇన్ని కోట్లు తీసుకుంటారు అనే మాట వాస్తవం కాదని ఆయన సన్నిహితులు అంటున్నారు.
మెగాస్టార్ చిరంజీవితో ఒక సినిమా తీస్తే చాలు అని నిర్మాతలు క్యూలో ఎదురు చూస్తుంటారు. అలాంటిది చిరంజీవి డేట్లు ఇచ్చిన తర్వాత ఆయనతో సినిమా తీసిన తర్వాత నిర్మాతలు భారీ మొత్తంలోనే తమ అభిమాన హీరోకి పారితోషకంగా ఆ సినిమా లాభాల్లో వాటా ఇస్తుంటారు అని సమాచారం. మొత్తం మీద ఇంత వయసు వచ్చినా మెగాస్టార్ మార్కెట్ కాని, ఆయన స్టామినా కాని ఏమాత్రం తగ్గడం లేదని ఆయనకు సన్నిహితంగా ఉంటున్న నిర్మాతలు అంటున్నారు.



Click it and Unblock the Notifications