Latest Updates
-
మేషం, సింహం, ధనుస్సు రాశుల వారికి అద్భుతమైన యోగం..! - సోమవారం, 08 జూన్ 2026 -
కండరాలకు బలాన్నిచ్చే నేచురల్ ప్రోటీన్ పౌడర్..ఇంట్లోనే చేసుకోండిలా.. -
పితృ దోషం వల్లే జీవితంలో సమస్యలొస్తున్నాయా? పూర్వీకుల ఆత్మల గురించి శాస్త్రాలు చెప్పే రహస్యాలు ఇవే! -
2026 అంతర్జాతీయ యోగా దినోత్సవ ప్రత్యేకత ఇదే! -
ప్రేమలో అనుబంధం ఎప్పుడు మానసిక భారంగా మారుతుంది -
మైదా లేదు, భయం లేదు.. ఇంట్లోనే సులభంగా హెల్దీ బ్రెడ్-రవ్వ పిజ్జా.. -
మీ మొబైల్ ఫోన్లో ఈ వాల్ పేపర్ ఉంటే.. రోజూ అదృష్టం మీ వెంటే.! -
కలలో బొద్దింకలు కనిపిస్తే.. మీ జీవితంలో ఏం జరుగుతుందో తెలుసా.? -
జేబులో రూ.200 ఉంటే చాలు.. హైదరాబాద్ లో మీ ఫ్రెండ్స్ తో గడిపే సూపర్ ప్లాన్స్ ఇవే! -
చేసిన పనికి గుర్తింపు లేకపోతే ప్రేమ ఎలా తగ్గిపోతుంది
అమెరికాలో సాప్ట్ వేర్ జీతం కన్నా..అంబానీ ఇంట్లో పనిమనిషి శాలరీనే ఎక్కువ!..ఈ జాబ్ ఎలా పొందాలంటే
ప్రపంచ కుబేరుల్లో రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేష్ అంబానీ ఒకరు. వ్యాపారంలో తన తెలివితేటలతో అంచెలంచెలుగా ప్రపంచస్థాయి కుబేరుడిగా ఎదిగారు ముఖేష్ అంబానీ. అంబానీ గారికి వ్యాపారంలో మెలకువలతో పాటు సేవాతత్వం, ఆధ్యాత్మిక చింతనలు కూడా ఎక్కువే. ఇటీవలే కటుంబసమేతంగా ప్రయాగరాజ్ వెళ్లి మహాకుంభమేళాలో పాల్గొన్నారు,పవిత్ర త్రివేణి సంగమంలో పుణ్య స్నానం చేశారు. ప్రస్తుతం అంబానీ ఆస్తుల నికర విలువ 91. 6 బిలియన్ డాలర్లకు పైగానే ఉంది, ఫోర్బ్స్ ధనవంతుల జాబితా ప్రకారం ప్రపంచంలో 17వ స్థానంలో ఉన్నారు.
అయితే ఇంత సంపద కలిగిన అంబానీ నివసించేది ఎక్కడ, ఆయన ఏం తింటారు, ఆయన జీవన విధానం ఎలా ఉంటది,ఆయన ఇంట్లో పనోళ్లకు జీతం ఎంత ఉంటుంది,అంబానీ ఇంటికి కరెంటు బిల్లు వస్తుంది వంటి అనేక విషయాలను తెలుసుకునేందుకు చాలామంది ఆసక్తి చూపిస్తుంటారు.

పనివాళ్ల జీతం ఇలా
ముఖేష్ అంబానీ తన ఫ్యామిలీతో ముంబైలో రూ. 15000 కోట్లతో నిర్మించిన ఆంటీలియా అనే ఇంట్లో నివసిస్తున్నారు. ఈ ఆంటీలియా ఇళ్లు ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ఇళ్లలో ఒకటిగా గుర్తింపు పొందింది. అంబానీ ఇంట్లో పనిచేసేవాళ్లకి కూడా లక్షల్లో జీతం ఉంటుంది. కార్పొరేట్ ఉద్యోగులకు ఏ విధమైన సౌకర్యాలు లేదా ప్రయోజనాలు ఉంటాయో ఆ విధమైన సౌకర్యాలే అంబానీ ఇంట్లో పనివాళ్లకు ఉంటాయి. అంబానీ ఇంట్లో అందరూ కలిపి 600-700 వరకు పనివాళ్లు ఉన్నారు.
కొన్ని మీడియా రిపోర్టుల ప్రకారం అంబానీ కారు డ్రైవర్ కి నెలకు రూ.2లక్షల వరకు జీతం ఉందట..అంతే ఏడాదికి రూ.24లక్షలు. ఇదేసమయంలో రిలయన్స్ ఇండస్ట్రీస్ సెక్యూరిటీ గార్డుగా పనిచేసే వ్యక్తి సగటు జీతం నెలకు రూ. 14,536 నుంచి రూ. 55,869 మధ్యలో ఉంటుంది. ఈ ప్యాకేజీ చాలా మంది ప్రభుత్వ ఉద్యోగుల సగటు CTC కంటే ఎక్కువ.
అంబానీ ఇంట్లో సిబ్బందిని ఎలా నియమిస్తారంటే
ముఖేష్ అంబానీ ఇంట్లో ఉద్యోగం సంపాదించాలంటే ఎగ్జామ్, ఇంటర్వ్యూలో పాస్ అవ్వాలి. అంతేకాకుండా సంబంధిత సర్టిఫికేట్ లేదా డిగ్రీని కలిగి ఉండటం చాలా ముఖ్యం. అంబానీ ఇంట్లో చెఫ్ కావాలనుకుంటే పాక కళలలో(culinary arts) సర్టిఫికెట్ ను కలిగి ఉండాలి. అంబానీ ఇంట్లో డిష్ వాషింగ్ చేసే ఉద్యోగం పొందాలన్నా కూడా కేటాయించబడిన వారు కూడా కఠినమైన స్క్రీనింగ్, ధృవీకరణ ప్రక్రియ ఉంటుంది.
కార్పొరేట్ ఉద్యోగులతో సమానమైన బెనిఫిట్స్
అంబానీ నివాసంలోని సిబ్బందికి అందించే జీతాలతో పాటు వారు కార్పొరేట్ ఉద్యోగులతో సమానమైన ప్రయోజనాలను కూడా పొందుతారు, వాటిలో వైద్య బీమా, అనేక ఇతర ప్రోత్సాహకాలు ఉన్నాయి. వారి నిర్దిష్ట ఉద్యోగ పాత్రల ఆధారంగా వారి జీతం, సౌకర్యాలు నిర్ణయించబడతాయి. అంబానీ ఇంట్లో హౌస్ కీపింగ్, సెక్యూరిటీ నుండి చెఫ్ లు,వ్యక్తిగత సహాయకుల వరకు ప్రతి స్టాఫ్ మెంబర్ ఇంటి సామర్థ్యాన్ని నిర్వహించడంలో కీలక పాత్ర పోషిస్తారు.



Click it and Unblock the Notifications