Latest Updates
-
కండరాలకు బలాన్నిచ్చే నేచురల్ ప్రోటీన్ పౌడర్..ఇంట్లోనే చేసుకోండిలా.. -
పితృ దోషం వల్లే జీవితంలో సమస్యలొస్తున్నాయా? పూర్వీకుల ఆత్మల గురించి శాస్త్రాలు చెప్పే రహస్యాలు ఇవే! -
2026 అంతర్జాతీయ యోగా దినోత్సవ ప్రత్యేకత ఇదే! -
ప్రేమలో అనుబంధం ఎప్పుడు మానసిక భారంగా మారుతుంది -
మైదా లేదు, భయం లేదు.. ఇంట్లోనే సులభంగా హెల్దీ బ్రెడ్-రవ్వ పిజ్జా.. -
మీ మొబైల్ ఫోన్లో ఈ వాల్ పేపర్ ఉంటే.. రోజూ అదృష్టం మీ వెంటే.! -
కలలో బొద్దింకలు కనిపిస్తే.. మీ జీవితంలో ఏం జరుగుతుందో తెలుసా.? -
జేబులో రూ.200 ఉంటే చాలు.. హైదరాబాద్ లో మీ ఫ్రెండ్స్ తో గడిపే సూపర్ ప్లాన్స్ ఇవే! -
చేసిన పనికి గుర్తింపు లేకపోతే ప్రేమ ఎలా తగ్గిపోతుంది -
బరువు తగ్గాలనుకునే వారు మామిడి పండ్లు తినొచ్చా? ఫిట్నెస్ నిపుణులు ఏమంటున్నారంటే!
కొనే ముందు ఏ మాంసం మంచిది..? ఎలా తెలుసుకోవాలి ?
మాంసం ఇష్టపడని వారు ఎవరుంటారు. ఎవ్వరికైనా సరే మాంసం అంటే నోట్లో లాలాజలం సముద్రం కావలసిందే. చికెన్ అయినా మటన్ అయినా లేక చేపలు, రొయ్యలు ఏదైనా సరే మార్కెట్ నుంచి తెచ్చుకొని తనివితీరా తినేవరకు ఆ లాలాజలానికి అదుపు వుండదు. సెలవు వచ్చిందంటే ఇక ఆరోజు ఇంట్లో మటన్ లేదంటే చెకెన్ వుండాల్సిందే. కడుపు నిండా దానితో తిని చివరల్లో పెరుగు వేసుకొని భోజనం ముగించి పడుకుంటే ఆ హాయి స్వర్గం కన్నా తియ్యనైనదోయ్ అని అనిపిస్తుంది.
అయితే మటన్ మార్కెట్ల నుంచి మాంసం తెచ్చుకునే సమయంలో కొన్ని జాగ్రత్తలు ఖచ్చితంగా పాటించాలి. ఏది ఇస్తే అదే మాంసాన్ని తీసుకొని వస్తే అనారోగ్యాల బారినపడే అవకాశాలున్నాయ్. మాంసం తీసుకునేప్పుడు కొన్ని అంశాలను జాగ్రత్తగా గమనించాలి, చెక్ చేసుకోవాలి. అప్పుడు మాత్రమే మాంసాన్ని కొనుగోలు చేసి ఇంటికి తెచ్చుకొని వండడం ప్రారంభించాలి. మాంసాన్ని ఎలా చెక్ చేయాలి. కొనే ముందు తీసుకోవాల్సిన జాగ్రత్తలు గురించి మీకు ఇక్కడ వివరిస్తున్నాము.
ఫ్రెష్ మటన్ కొనే ముందు తీసుకోవాల్సిన జాగ్రత్తలు :
మంచి మటన్ అయితే చూడగానే చాలా ఫ్రెష్‌గా కనిపిస్తుంది. మటన్ డల్‌గా కినిపించినా లేక రంగు పూర్తిగా మారపోయి ఎండిపోయినట్టు కినిపించినా అది తాజా మటన్ కాదని నిర్ధిరంచుకోవాలి. అక్కడ నుంచి మటన్ కొనడానికి వీలు లేదు.
ముక్కలుగా చేసిన మాంసంపై కొంత రక్తం ఉండడం సహజమే. అయితే ఈ రక్తం ఎక్కువగా ఉన్నా ప్రమాదాన్ని సూచిస్తుంది. మాంసం నుంచి ఎక్కువ నీరు వస్తున్నట్లు కనిపించినా ఆ మాంసాన్ని కొనకుండా ఆపివేయాలి.

కొన్ని బిర్యానీ సెంటర్లలో బిర్యానీ ముక్కలు ఎర్రగా వుంటాయ్. మాంసం ఎర్రగా వుంటే ముదిరిపోయినట్టేనని చెబుతున్నారు. ముదిరిపోయిన మాంసాన్ని ఎప్పుడూ తీసుకోవద్దు. రంగు ఎక్కువగా లేని తాజా మాంసాన్ని మాత్రమే తీసుకోవాలి.
మాంసానికి ఎటువంటి ప్రత్యేకమైన రుచి వుండదు. ఒక వేళ మనం కొంటున్న మాంసం నుంచి కుళ్లిపోయిన వాసన గనక వస్తుంటే దాన్ని ఎట్టి పరిస్థితుల్లో కొనకుండా వుండాలి. కొనే ముందు మాంసం వాననను తప్పకుండా చూడాలి.
ఆరోగ్యకరమైన మాంసమంటే గట్టిగా వుండాలి. లూజ్‌గా మాంసం వుంటే దాన్ని కొనకుండా వుండాలి. చూడగానే మీకు మాంసం ఎలా వుందనే దానిపై ఓ అభిప్రాయం వస్తుంది.
ముక్కలు సరైన పద్ధితిలో కట్ చేయించాలి. ముక్కలు ఒక ప్రత్యేకమైన సైజులు గనక కట్ చేయకపోతే ఆ మాంసం ఫ్రెష్ మాంసం కాదని నిర్ధిరణకు రావాలి.
మాంసం ఫ్రెష్ గా ఉందాలేదా అనేది రుచినిబట్టి కూడా చెప్పవచ్చు. మాంసం ముక్కను కడిగి ఆ రుచని చూస్తే అది ఏ రుచిలేనట్టుగా వుండాలి. ఏదైనా ప్రత్యేకమైన రుచి గనక దానికి వుంటే ఆ మాంసాన్ని కొనవద్దని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ప్యాకెజ్డ్ మాంసం కొనే ముందు వాటి ఎక్స్‌పైరీ డేట్ మాత్రమే కాదు మాంసం వున్న కవర్‌కు ఏవైనా రంద్రాలు పడ్డాయా, ఎక్కడి నుంచైనా లీక్ అవుతుందా కనుక్కోవాలి.
బాగా గుర్తింపు పొందిన షాపు నుంచో లేక వ్యక్తి నుంచో మాత్రమే మాంసాన్ని కొనాలి. ఆన్‌లైన్‌లో మాంసం కొనే ముందు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి.
మాంసం పైన ఉండే కొవ్వు తెల్లగా వుండాలి. పచ్చగా ఉన్న కొవ్వు మాంసాన్ని అస్సలు కొనవద్దు.



Click it and Unblock the Notifications