Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
గిబ్లీ ఫొటోలతో డబ్బే డబ్బు..ఎలా సంపాదించుకోవాలో ఇక్కడ చూడండి
గత వారం పది రోజులుగా ఫేస్ బుక్,ఇన్ స్టాగ్రామ్,వాట్సాప్,ట్విట్టర్ ఇలా ఏ సోషల్ మీడియా ఫ్లాట్ ఫాం చూసినా గిబ్లీ ఆర్ట్ ట్రెండ్ తెగ వైరల్ అవుతోంది. ప్రతి ఒక్కరూ తమ ఫొటోలను గిబ్లీ స్టైల్ లోకి మార్చేస్తున్నారు. గిబ్లీ స్టైల్ ఆర్ట్ అనేది..ఒక ప్రత్యేకమైన ప్రసిద్ధ స్టైల్ ఆర్ట్, యానిమేషన్ శైలిలో ఉంటుంది. దీనిని జపనీస్ యానిమేషన్ స్టూడియో "స్టూడియో గిబ్లీ" సృష్టించింది. స్టూడియో గిబ్లీ వ్యవస్థాపకులు హయావో మియాజాకి, ఇసావో తకాహతా ఈ స్టైల్ ఆర్ట్ ని సినీ పరిశ్రమకు పరిచయం చేశారు. ఇది ప్రపంచవ్యాప్తంగా చాలా పాపులర్ అయింది.
జపనీస్ యానిమేషన్ స్టూడియో "స్టూడియో గిబ్లీ" స్టైల్ లో క్రియేట్ చేసిన ఫొటోలు అందరినీ ఆకర్షిస్తున్నాయి. ప్రముఖులు, సామాన్యులు,సెలబ్రిటీలు, పెద్ద పెద్ద రాజకీయనాయకులు తమ ఫొటోలను గిబ్లీ స్టైల్ లోకి మార్చి వాటిని సోషల్ మీడియా ద్వారా షేర్ చేస్తున్నారు. మీరు కూడా ఇప్పటిదాకా సోషల్ మీడియాలో ఇటువంటి ఎన్నో పోస్టులు చూసి ఉండొచ్చు, లైకులు కూడా కొట్టి ఉండొచ్చు. కానీ కేవలం లైక్స్, వ్యూస్ తోనే ఆగిపోయారా? గిబ్లీ ఆర్ట్ ట్రెండ్ కేవలం వినోదం కోసమే కాదు దీని ద్వారా మంచి ఆదాయం కూడా పొందవచ్చు. మీలో కొంచెం క్రియేటివిటీ, డిజిటల్ నైపుణ్యాలు ఉంటే ఈ ట్రెండ్‌తో మీరు డబ్బు కూడా సంపాదించొచ్చని మీకు తెలుసా?

డబ్బు ఎలా సంపాదించాలి?
ఓపెన్ ఏఐ కంపెనీ..ఏఐ ఆధారిత ఇమేజ్ జనరేషన్ టూల్ కి కొత్త అప్ డేట్ ప్రకటించింది. దీన్ని ఉచితంగా చాట్ జీపీటీ వినియోగదారులకు అందుబాటులోకి తీసుకువచ్చింది. చాట్ జీపీటీ వాడేవాళ్లందరూ ఉచితంగా సాధారణ టెక్ట్స్ ప్రాంప్ట్ తో అద్భుతమైన స్టూడియో గిబ్లీ స్టైల్ లో మీమ్స్, ఫోటోలను తయారు చేసుకోవచ్చు.
చాలా మందికి చాట్‌జీపీటీలో గిబ్లీ స్టైల్ ఆర్ట్ సరిగ్గా రావడం లేదు. అందరూ మంచి ఫోటోలు సృష్టించలేకపోతున్నారు. దీనికి ఒక కారణం అన్ పెయిడ్ వెర్షన్ కావచ్చు. దీంతో ఫోటోలు సరిగ్గా జనరేట్ కాకపోవచ్చు. మీరు చాట్‌జీపీటీ పెయిడ్ వెర్షన్‌ను తీసుకుంటే అద్భుతమైన ఫోటోలను జనరేట్ చేయవచ్చు. వాటిని సోషల్ మీడియాలో స్టోరీస్ లో షేర్ చేసి ప్రమోట్ చేయవచ్చు. దీని పెయిడ్ వెర్షన్ సుమారు రూ.2000 వరకు ఉండవచ్చు. కానీ మీరు దీని ద్వారా వేల రూపాయలు సంపాదించవచ్చు. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులకు దీని గురించి చెప్పి ప్రమోట్ చేయవచ్చు. వారికి ఫోటోలు తయారు చేసి ఇవ్వడానికి డబ్బులు వసూలు చేయవచ్చు. ఒక్కో ఫోటోకి మీరు రూ.100 తీసుకున్నా మీకు లాభమే ఉంటుంది.
సోషల్ మీడియాలో మీ కంటెంట్‌ను ప్రమోట్ చేయండి
మీరు మీ స్టోరీలో గిబ్లీ స్టైల్ ఫోటోను షేర్ చేసి, మీకు కూడా ఇలాంటి ఫోటో కావాలంటే ఒక్కో ఫోటోకి ఇంత ఛార్జ్ చేస్తాను అని రాయవచ్చు. అంతే మీ స్టోరీకి రిప్లైలు రావడం మొదలవుతాయి. మీరు నాలుగు రోజుల్లో కనీసం 40 ఫోటోలు జనరేట్ చేసినా మీకు రూ.4000 ఆదాయం వస్తుంది.



Click it and Unblock the Notifications