Latest Updates
-
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.!
షూ విప్పాకా మీ కాళ్లు వాసన వస్తున్నాయా? కంపుకొట్టే వాసనను ఇలా తరిమికొట్టండి
షూ వేసుకోవడం స్టైలిష్‌గానే కాదూ చాలా కంఫర్ట్‌గా కూడా ఉంటుంది. అయితే ఈ షూ కొంత మందిలో కొన్ని సమస్యలను తెచ్చిపెడతాయి. అందులో దుర్వాసన రావడం కూడా ఒకటి. షూ అదే పనిగా వేసుకుంటే బ్యాడ్ స్మెల్ వస్తుంది. కొందరిలో చెమట ఎక్కువగా రావడం వల్ల అరికాళ్లలో చెమట వచ్చి అది దుర్గంధానికి దారితీస్తుంది.
షూ స్మెల్ పాదాలకు కూడా అంటుకుంటుంది. షూ నుంచి పాదాలు తీసివేసినా ఆ వాసన అలాగే ఉంటుంది. దీని వల్ల చాలా ఎంబరాసింగ్ గా ఉంటుంది. ఈ వాసన చుట్టు పక్కల కూడా వ్యాపించి చాలా ఇబ్బందికరంగా మారుతుంది. మీకూ కూడా ఇలాంటి సమస్య వస్తే, వేసుకున్న షూ నుంచి విపరీతమైన దుర్వాసన వస్తుంటే.. కొన్ని చిట్కాలతో ఆ సమస్యను తరిమికొట్టవచ్చు.

- ఒక బకెట్ లో సగం వరకు నీళ్లు తీసుకోవాలి. ఆ తర్వాత వాటిలో బేకిగ్ సోడా వేసి బాగా కలపాలి. ఈ నీటిలో పాదాలను పది నిమిషాల పాటు ఉంచుకోవాలి. కాళ్లను బయటకు తీసి కాటన్ గుడ్డతో అరికాళ్లు, కాలి వేళ్లను బాగా తుడవాలి. ఇలా రోజూ చేస్తే బేకింగ్ సోడాలో ఉండే యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాల వల్ల పాదాల దుర్వాసన తగ్గుతుంది.
- ఇలా రోజూ చేయలేను అనుకునే వాళ్లు బకెట్ సగం వరకు గోరు వెచ్చని నీళ్లు తీసుకొని.. వాటిలో కాస్త బేకింగ్ సోడా కలపాలి. అలాగే ఒక నిమ్మకాయను కట్ చేసుకొని దాన్నిరసాన్ని వేయాలి. పది నిమిషాల పాటు కాళ్లను అందులో ఉంచి బయటకు తీశాకా.. కాటన్ గుడ్డతో మంచిగా తుడవాలి. ఇలా వారానికి రెండు సార్లు చేసినా చాలా ఫలితం ఉంటుంది. అయితే పొడవుగా ఉండే బకెట్లను వాడడం కంటే కూడా వెడల్పుగా ఉండే బకెట్ లను వాడడం మరింత మంచిది.
- ఒక బకెట్ లో పాదాలు మునిగే వరకు గోరువెచ్చటి నీళ్లు తీసుకోవాలి. ఏదైనా మంచి నూనెను ఎంచుకోవాలి. దాన్ని ఓ ఐదారు చుక్కలు నీళ్లలో వేయాలి. అలాగే ఒక కప్పు ఎప్సమ్ సాల్ట్ మిక్స్ చేసి అందులో మీ పాదాలను ఉంచాలి. పొడి పాదాలను నివారించడానికి వారానికి రెండు సార్లు ఇలా చేస్తే కాళ్లు బాగవుతాయి. వాసన కూడా పూర్తిగా దూరం అవుతుంది.
- పాదాల దుర్వాసన పోగొట్టడానికి ఒక బకెట్ గోరు వెచ్చని నీటిలో ఒక కప్పు ఎప్సమ్ సాల్ట్ మిక్స్ చేసి అందులో మీ పాదాలను ఉంచాలి. పొడి పాదాలను నివారించడానికి ఈ చిట్కాలను వారానికి రెండుసార్లు చేయాల్సి ఉంటుంది.
- ఒక బకెట్ గోరు వెచ్చని నీటిలో అరకప్పు వెనిగర్ వేసి అందులో 15 నిమిషాల పాటు మీ పాదాలను ఉంచాలి. ఇలా వారాకి రెండు నుంచి మూడు సార్లు చేస్తే సమస్య నుంచి బయట పడవచ్చు. మీరు పాదాల దుర్వాసన సమస్యతో బాధ పడుతుంటే రోజుకు కనీసం రెండు సార్లు మీ పాదాలను సబ్బుతో శుభ్రం చేసుకోవాలి. దీంతో సమస్య తగ్గుతుంది.
- ప్రతిరోజూ విధిగా సాక్సులు మార్చాలి. ఉతకకుండా మరోసారి అస్సలే వాడకూడదు. అలాగే సాక్లు కాస్త తడిగా ఉండే వాటిని మళ్లీ ఉపయోగించకండి. శ్వాసక్రియ బూట్లు ఉపయోగించండి. ఎక్కువ కాలం బూట్లు ధరించకూడదు.
Disclaimer: ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా ఈ వ్యాసాన్ని రాయడం జరిగింది. కచ్చితత్వానికి, విశ్వసనీయతకు ఎలాంటి హామీ ఇవ్వడం లేదు. Boldsky Telugu ఈ వ్యాసానికి సంబంధించిన ఏ విషయాన్నీ నిర్ధారించడంలేదు. ఈ వ్యాసం ఉద్దేశం సమాచారం అందించడం మాత్రమే. ఏదైనా పాటించే ముందు సంబంధిత నిపుణుల సలహా తీసుకోగలరు.



Click it and Unblock the Notifications