Latest Updates
-
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.!
మీపై చేతబడి చేశారని ఎలా తెలుసుకోవాలి? లక్షణాలు ఇలానే ఉంటాయి!
మన దేశంలో మూఢనమ్మకాలకు ప్రధాన పెద్దపీట వేస్తారు. ఎన్ని నమ్మకాలున్నా మూఢ నమ్మకాన్ని మాత్రం వదలకు. ఆ మూఢ నమ్మకాన్ని నమ్ముకొని రోజూ మన దేశంలో వందల కొద్దీ మంది చనిపోతున్నారు కూడా. ఆ మూఢ నమ్మకాలలో ముఖ్యమైనది ఏదైనా ఉందంటే అది చేతబడి అని చెప్పొచ్చు. చేతబడి కారణంగా కొన్ని జీవితాలు నాశనమైపోయాయని చెబుతుంటారు. ఆ నమ్మకంతోనే కొందరిని కొట్టారు కూడా. అయితే ఒక మనిషిపై చేతబడి చేశారని ఎలా తెలుసుకోవాలి? చేతబడి చేస్తే ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయనేది ఈ స్టోరీలో తెలుసుకుందాం.
చేతబడి చేశారని భావించే వారిలో కనిపించే కొన్ని లక్షణాలు:
ఆరోగ్య సమస్యలు
చేతబడి చేసిన వ్యక్తులకు ముఖ్యంగా అనారోగ్య సమస్యలు వస్తాయి. తరచుగా అనారోగ్యం బారిన పడుతుంటారు. నిద్రలేమి, మానసిక అస్వస్థత, పలు శారీరక సమస్యలు వంటివి ప్రధానంగా ఇబ్బంది పెడుతుంటాయి.

అదృష్టం లేకపోవడం
చేతబడి చేసిన వ్యక్తుల్లో ముఖ్యంగా అదృష్టం లేకపోవడం అనేది కలవర పెడుతుంది. ఎలాంటి పనులు చేపట్టినా అదృష్టం లేకుండా పోతుంది. ప్రతి పనిలో నష్టాలు ఎదుర్కొంటారు. కుటుంబంలో కలహాలు తరచుగా వస్తాయి. అనుకోని సంఘటనలు మనిషిని కుదిపేస్తాయి.
భయం
చేతబడి చేసిన వ్యక్తుల్లో అనవసర భయం ఎక్కువగా కనిపిస్తుంది. అనవసరమైన సంఘటనలకు కోపానికి గురవుతారు. ఎక్కువగా వీరికి అపశకునాలు ఎదురవుతాయి. ఏ పని చేయాలని చూసినా ఆ పనిలో నష్టాన్ని ఎదుర్కొంటామని భయం కలుగుతుంది. ఒంటరిగా వెళ్లాలంటే భయపడతారు.
మానసిక అస్థిరత
చేతబడి చేసిన వ్యక్తుల్లో ఎక్కువగా మూడ్ స్వింగ్స్ కనిపిస్తాయి. ఆ వ్యక్తుల మనోభావాలు తరచుగా మారుతుంటాయి. ప్రతి పనిలో కోపం, నిరాశతో కలిగి ఉంటారు. ఎలాంటి పనులు చేపట్టినా కోపానికి గురవుతారు. భాగస్వామిపై ఎక్కువగా కోపానికి వస్తారు. అలాగే కోపంలో ఏం చేస్తారో కూడా తెలియని పరిస్థితుల్లో ఉండిపోతారు.
వీటికి అనేక కారణాలు కూడా ఉండొచ్చు
మానసిక ఒత్తిడికి ఇతర సమస్యలకు కూడా అనేక కారణాలు ఉండొచ్చు. మానసిక ఒత్తిడికి కుటుంబ సమస్యలు, ఆర్ధిక ఇబ్బందులు కూడా ఒక కారణం అని చెప్పుకోవచ్చు. అలాగే అనేక వ్యాధుల కారణంగా కూడా అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. దీంతోపాటు మతపరమైన నమ్మకాలు కూడా కొంత మందిని ఆ ఊబిలోకి నెట్టే అవకాశం ఉంటుంది.
గుడ్డిగా నమ్మకండి..
చేతబడి చేశారని చెప్పడానికి అనారోగ్య సమస్యలు, ఒత్తిడి అనేది కారణంగా చెప్పడం కూడా సబబు కాదనే వాదనలు ఉన్నాయి. మీకు ఈ సమస్యలు ఉన్నట్లు తేలితే కచ్చితంగా ఇంకోసారి వాటిని పరిశీలించుకోండి. గుడ్డిగా దేనిని నమ్మకండి. పరిశీలించినప్పటికీ అలానే ఉంటే.. అప్పుడు ఏదైనా నిర్ణయం తీసుకోండి.



Click it and Unblock the Notifications