Latest Updates
-
రాజస్థాన్ ఫేమస్ కార్న్ ఢోక్లా..బరువు తగ్గాలనుకునేవాళ్లకి ఇది బెస్ట్! -
గుడ్డు పచ్చసొన తింటే కొలెస్ట్రాల్ పెరిగి హార్ట్ ఎటాక్ వస్తుందా? డాక్టర్ విక్రాంత్ సింగ్ ఏమంటున్నారంటే.. -
ఈ ఒక్క పొడి ఉంటే చాలు..జీవితంలో హాస్పిటల్ కి వెళ్లాల్సిన పనే ఉండదు..అన్నం, టిఫిన్స్ లోకి సూపర్ -
అబ్బాయి వర్జిన్ కాదని పెళ్లి రద్దు చేసుకున్న యువతి..అసలు నువ్వు వర్జినేనా అంటూ.. -
100 ఏళ్లు బతికించే హెల్తీ బ్రేక్ ఫాస్ట్..రోజుకి ఒక గిన్నె తింటే బరువు ఇట్టే తగ్గిపోతారు..ఎలా చేసుకోవాలంటే.. -
హోటల్ స్టైల్ ఇడ్లీ కారం పొడి..బ్రేక్ ఫాస్ట్ లోకి చట్నీ కూడా వద్దంటారు..ఇంట్లోనే ఇలా చేసుకోండి.. -
కిడ్నీలు పాడవడానికి ముందు కనిపించే ముఖ్యమైన లక్షణాలు ఇవే -
ఇడ్లీ,దోశ,చపాతీల్లోకి కేక పుట్టించే చికెన్ నిర్వాణ..బ్యాచిలర్స్ కూడా ఈజీగా చేసుకోవచ్చు -
పెద్ద ఎర్రిపప్ప అయ్యావ్ మావా: ప్రియురాలి కోసం మొత్తం అమ్మేసి 1900 కి.మీ ప్రయాణించి వెళ్తే..అసలు అమ్మాయే కాదట! -
దసరా స్పెషల్ నైవేద్యం చక్కెర పొంగలి..సంప్రదాయ పద్ధతిలో ఇలా చేస్తే ఇళ్లంతా డివోషనల్ వైబ్
మీరు కూడా చిటికెలో గిబ్లి స్టైల్ ఫోటోలు చేసుకోవచ్చు.. సింపుల్ ప్రాసెస్ ఏంటంటే?
సోషల్ మీడియాలో ఎప్పుడు ఏది వైరల్ అవుతుందో చెప్పలేం. ఉన్నట్టుండి కొన్ని వీడియోలు, కొన్ని ట్రెండ్స్ వైరల్ అవుతూ ఉంటాయి. అలానే ఇప్పుడు ఇన్స్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్బుక్, X వంటి సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో గిబ్లి స్టైల్(Ghibli-Style) ఆర్ట్ ఫోటోలు వైరల్ అవుతున్నాయి. ఇదొక ట్రెండ్ మాదిరిగా మారిపోయింది ఇప్పుడు. ఈ ట్రెండ్‌పై సోషల్ మీడియా మొత్తం అమితమైన ఆసక్తిని కనబరుస్తోంది. ఆ స్టైల్‌ను ఫోటోలు సృష్టించి, సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. గమ్మత్తైన విషయం ఏంటంటే.. ఆ ఫోటోలకు భారీ ఎత్తున మంచి స్పందన లభిస్తుంది. అయితే ఈ స్టోరీలో గిబ్లి స్టైల్ ఫోటోలు ఎలా సృష్టించాలి? ChatGPT ద్వారా మీరు ఈ ఫోటోలను ఎలా క్రియేట్ చేసుకోవచ్చు, దీనికి ఏ ప్రాంప్ట్ వినియోగించాలి అనేది తెలుసుకుందాం.
గిబ్లి స్టైల్ ఫోటోలు: గిబ్లి స్టైల్ ఫోటోలు అనగా, మీరు మీ రియల్ ఫోటోలను అనిమే (Anime) రూపంలో మార్చుకోవడమే. జపాన్‌లోని ప్రముఖ అనిమేషన్ స్టూడియో గిబ్లి నుంచి ఈ స్టైల్ పుట్టింది. అనిమే అభిమానులే కాకుండా, చాలా మంది ఈ ఫీచర్‌ను ఎంతో ఇష్టపడుతున్నారు. వారి ఫోటోలను ChatGPT ద్వారా గిబ్లి స్టైల్ ఫోటోలుగా మార్చుకుని, వాటిని సోషల్ మీడియాలో పంచుకుంటున్నారు.

ఫీచర్ వివరాలు: ఈ గిబ్లి స్టైల్ ఫీచర్ మార్చి 26వ తేదీ నుండి ప్రపంచవ్యాప్తంగా అందుబాటులోకి వచ్చింది. మొదట ఈ ఫీచర్ OpenAI ChatGPT ప్లస్ మరియు ప్రో సబ్స్క్రైబర్లకే అందుబాటులో ఉండగా, ఇప్పుడు ChatGPT ఫ్రీ యూజర్లకు కూడా ఈ ఫీచర్ ఉపయోగించుకునే అవకాశం లభించింది. అలాగే కొంతమంది xAI, Grok చాట్బాట్లు లేదా జెమినీ AI వంటి ఇతర సాధనాలను ఉపయోగించి గిబ్లి స్టైల్ ఫోటోలు తయారుచేస్తున్నారు. అయితే, OpenAI ChatGPT మోడల్స్ ఈ టూల్స్‌ను బీట్ చేయగలుగుతున్నాయి.
గిబ్లి స్టైల్ ఫోటోలు ఎలా క్రియేట్ చేయాలి:
ముందుగా ChatGPT వెబ్సైట్ లేదా యాప్‌ని ఓపెన్ చేయండి.
ఇప్పుడు మీకు నచ్చిన ఫోటోను ఎంచుకోండి.
ChatGPT పేజీ యొక్క ఎడమవైపు ఉన్న '+' ఐకాన్ పై క్లిక్ చేయండి.
ఎంచుకున్న ఫోటోను అప్లోడ్ చేసి, "Ghiblify" చేయమని లేదా "Turn this image into Studio Ghibli style" అని అడగండి.
కొన్ని సెకన్లలో, ChatGPT మీ ఫోటోను గిబ్లి స్టైల్లో మార్చి ఇవ్వవచ్చు. మీరు ఈ ఫోటోను డౌన్లోడ్ చేసుకోవచ్చు.
గిబ్లి స్టైల్ వీడియో: మీరు ఫోటోలను గిబ్లి స్టైల్ వీడియోగా మార్చాలనుకుంటే, మీరు 10 ఫోటోలతో ఫ్రేమ్-వారీగా వీడియో సృష్టించవచ్చు. Python ను ఉపయోగించి, మీరు ఈ ఫోటోలను 5 FPS MP4 రూపంలో కంపైల్ చేయవచ్చు.
అదనపు సూచనలు:
మీరు మరింత ప్రత్యేకమైన గిబ్లి స్టైల్ చిత్రాలను తయారుచేయాలనుకుంటే, ప్రత్యేకమైన ప్రాంప్ట్‌లను ప్రయత్నించవచ్చు. xAI, Grok చాట్‌బాట్ వంటి ఇతర AI టూల్స్ ను ఉపయోగించి కూడా ఈ స్టైల్లో చిత్రాలను రూపొందించవచ్చు.
మీకు కావలసిన రూపాన్ని పొందడానికి ఫోటో ఎడిటింగ్ సాఫ్ట్‌వేర్‌ను ఉపయోగించి ఈ చిత్రాలను మెరుగుపరచవచ్చు. ఈ గిబ్లి స్టైల్ ఫోటోలు మరియు వీడియోలు మీకు ఎంతో రంజకంగా అనిపించడానికి, మరియు మీరు ఈ ట్రెండ్‌ను అనుసరించేందుకు ఈ చిట్కాలు ఉపయోగపడతాయి.



Click it and Unblock the Notifications
