Latest Updates
-
మనిషికి పంది కిడ్నీ.. ఏకంగా 271 రోజులు.. వైద్య చరిత్రలో మహాద్భుతం! -
సేమియాతో ఎప్పుడూ పాయసమేనా? ఈసారి ఇలా బర్ఫీ చేసి చూడండి! -
గ్రహాల యువరాజు ఎంట్రీ.. సెప్టెంబర్ 7 నుంచి ఈ ఐదు రాశుల జాతకం మారనుంది! -
రాత్రి చపాతీలు మిగిలిపోయాయా? పారేయకుండా ఇలా కట్లెట్స్ చేయండి..రుచి చూస్తే అస్సలు వదలరు! -
అరటిపండుపై చిటికెడు యాలకుల పొడి చల్లి తింటే ఎన్ని లాభాలో తెలుసా? -
మాంసం కంటే 4 రెట్లు ఎక్కువ బలం..శరీరానికి ఉక్కు లాంటి బలాన్నిచ్చే పచ్చికొబ్బరి లడ్డూ చేసుకోండిలా.. -
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.?
దుప్పటి తెగ వాసన వస్తుందా?.. ఈ చిన్న చిట్కాలు పాటిస్తే ఇకపై వాసనే ఉండదు!
పడుకునేటప్పుడు చాలా మందికి దుప్పటి కప్పుకొని పడుకునే అలవాటు ఉంటుంది. దుప్పటి లేకపోతే వారికి నిద్రకూడా పట్టదు. అయితే దుప్పట్లను అలానే వాడుతూ ఉండడం వలన అవి వాసన వస్తుంటాయి. దీని కారణంగా వాటిని వాడాలంటేనే చాలా మందికి చిరాకు, కోపం వస్తుంటాయి. వీటిని కడుగుదామన్నా అంతగా అనుకూలమైన వాతావరణం ఉండకపోవడం, కడగడం కూడా కష్టంగా మారడంతో అవి అలానే ఉంటాయి. అయితే ఈ స్టోరీలో దుప్పట్లు వాసన రాకుండా ఉండాలంటే ఏం చేయాలి? ఎలాంటి టిప్స్ పాటించాలి అనేది ఈ స్టోరీలో తెలుసుకుందాం.
దుప్పట్లు వాసన రాకుండా ఉండాలంటే పాటించాల్సిన టిప్స్
దుప్పటి మీద వాసన రాకుండా ఉండేందుకు ఒక మంచి పరిష్కారం కొబ్బరి నూనె. కొబ్బరి నూనెను దుప్పట్లపై తేలికగా రాసి, ఎండలో పెట్టడం వలన వాసన మాయమవుతుంది. లావెండర్ నూనె కూడా దుర్వాసనను తొలగించడంలో ఉపయోగకరంగా ఉంటుంది. ఈ నూనెను ఉపయోగించి, వాసనను పూర్తిగా తొలగించవచ్చు.

బేకింగ్ సోడా
దుప్పట్లపై నుంచి వాసనను పోగొట్టడానికి మరొక పరిష్కారం బేకింగ్ సోడా. ముందుగా దుప్పట్లపై దుమ్ము దులపించి, ఆపై బేకింగ్ సోడాను దుప్పటిపై వేయడం వలన దుర్వాసన తొలగిపోతుంది. కొన్ని గంటల తర్వాత శుభ్రం చేస్తే ఈ సమస్య పూర్తిగా పరిష్కరించుకోవచ్చు.
కర్పూరం కూడా ఈ సమస్యకు మంచి పరిష్కారం. కర్పూరాన్ని చిన్న ముక్కలుగా కట్ చేసి, కాగితం మీద ఉంచి దుప్పటి లేదా దాని కవర్‌లో పెట్టి మధ్యాహ్నం వరకు ఉంచండి. తరువాత దుప్పటిని ఎండలో కొంత సేపు ఆరబెట్టండి. అంతే వాసన పోతుంది. దుప్పటి తడి వాసన వస్తే, వారానికి రెండు లేదా మూడు సార్లు దాన్ని ఎండలో ఆరబెట్టండి. ఇది దుప్పటి తేమను తొలగించి, వాసనను పూర్తిగా తొలగించేస్తుంది.



Click it and Unblock the Notifications
