Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
అప్పులు, కలహాలు, మనశ్శాంతి లేకపోవడం.. ఇంట్లోని నెగటివ్ ఎనర్జీనే కారణం - ఇలా తన్నితరిమేయండి!
మీ ఇంట్లో ప్రతిరోజూ ఏదో ఒక సమస్య ఏర్పడుతుందా. డబ్బులోటు, అప్పులు, కలహాలు, మనశ్శాంతి లేకపోవడం.. తరచుగా భయం అనిపించడం జరుగుతోందా. అయితే మీ ఇంట్లో నెగటివ్ ఎనర్జీ ఉందని అర్ధం. మీరు ఏం చేసినా, ఏం చేయాలనుకున్నా ఇబ్బందులు రావడం, ఏదో తెలియని శక్తి మిమ్మల్ని వెనక్కి పట్టి లాగడం వంటివి తరచుగా జరుగుతుంటే మాత్రం నెగిటివ్ ఎనర్జీనే వెంటనే తొలగించే ప్రయత్నం చేయాలి.
నెగిటివ్ ఎనర్జీ పోతేనే పాజిటివ్ ఎనర్జీ
నెగిటివ్ ఎనర్జీని తరిమేస్తే తప్ప పాజిటివ్ ఎనర్జీ ఇంట్లోకి రాదు. దాన్ని తరిమి దీన్ని ఇంట్లోకి తీసుకు రావాలంటే మేము ఇప్పుడు చెప్పబోయే పనులు చేయండి. ఆ పనులు ఏంటీ అనుకుంటున్నారా.. ఏం లేదండి అందరూ చేయగలిగే చిన్న చిన్న పనులే. అవేంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.

గుడ్డలో సముద్రపు ఉప్పు వేసి కట్టిపెట్టాలి:
మీ ఇంట్లో విండ్ చైమ్స్ ని వేలాడదీయండి. అవి గాలికి కదిలినప్పుడల్లా వచ్చే శబ్ద తరంగాలు మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీని బయటకు తరిమివేస్తాయి. అలాగే ఇంటి మూలల్లో ఉప్పు చల్లితే అది ఇంట్లోని దుష్టశక్తిని బయటకు తోసేస్తుంది. అలాగే చిటికెడంత సముద్రం ఉప్పును తీసుకొని ఇంటి ద్వారం వద్ద ఒక గుడ్డలో కట్టిపెట్టడం లేదా డోర్ మ్యాట్ కింద కానీ పెడితే దుష్టశక్తి లోపలికి రాదు.
సరైన గాలి, వెలుతూరు ఉండేలా చూడాలి:
ఇంట్లో సరైన వెలుతూరు ఉండేలా చూసుకోవాలి. అలాగే వెలుతూరు ప్రసరించే కర్టెన్స్ ఉపయోగించడం మరింత మంచిది. ఏ గదిలో అయితే గాలి, వెలుతూరు పుష్కలంగా ఉంటుందో.. ఆ గదిలోకి దుష్ట శక్తులు ప్రవేశించలేవట. మీ ఇంట్లోని ఫర్నిచర్ ను అప్పుడప్పుడూ రీఅరేంజింగ్ చేస్తూ ఉండాలి. హోమ్ ఇంటీరియర్స్ కూడా ఎప్పుడూ ఒకేలా కాకుండా అప్పుడప్పుడూ మారుస్తూ ఉంచాలి. అలాగే విరిగిపోయిన హస్తకళా వస్తువులు ఇంట్లో ఉంటే వాటిని అక్కడి నుంచి తొలగించండి. ఎందుకంటే వాటికి పాజిటివ్ ఎనర్జీని తొక్కిపెట్టే ఎనర్జీ ఉంటుందట.
అగరుబత్తీలు కాల్చడం వల్ల కూడా పాజిటివ్ ఎనర్జీ:
ఇంట్లోకి బయట నుంచి గాలి, వెలుతురూ ప్రసరించేలా సరైన వెంటిలేషన్ ఉండాలి. ఏ గదిలోనూ చీకి లేకుండా చూసుకోవాలి. మూసి ఉంచిన కిటికీలను తరచుగా తెరుస్తూ ఉండాలి. వాటి ద్వారా మీ ఇంట్లోకి ప్రసరించే ఎయిర్ పాజిటివ్ శక్తిని పెంచేలా చేస్తుంది. అలాగే అగరుబత్తీలు కాల్చడం వల్ల వచ్చే సువాసను మీ ఇంట్లో పాజిటివ్ ఎనర్జీని పెంచుతుంది. రూమ్ ఫ్రెషనర్స్ కూడా పాజిటివ్ ఎనర్జీ పెరిగేలా చేస్తాయట.
బట్టలు ఎక్కడ పడితే అక్కడ వేయకూడదు:
ఇంట్లో బట్టలను ఎక్కడ పడితే అక్కడ చిందరవందరగా పడేసే అలవాటు మంచిది కాదు. అలా చేయడం వల్ల ఏర్పడే చికాకు నెగిటివ్ ఎనర్జీకి కారణం అవుతుంది. అందుకే ఇంట్లోని దుస్తులను ఒక పద్ధతిలో సర్దుకోవాలి. అది మిమ్మల్ని మానసికంగా ప్రశాంతంగా ఉంచడంతో పాటు పాజిటివ్ ఎనర్జీని పెంచేందుకు ఉపయోగపడుతుంది.
Disclaimer: ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా ఈ వ్యాసాన్ని రాయడం జరిగింది. కచ్చితత్వానికి, విశ్వసనీయతకు ఎలాంటి హామీ ఇవ్వడం లేదు. Boldsky Telugu ఈ వ్యాసానికి సంబంధించిన ఏ విషయాన్నీ నిర్ధారించడంలేదు. ఈ వ్యాసం ఉద్దేశం సమాచారం అందించడం మాత్రమే. ఏదైనా పాటించే ముందు సంబంధిత నిపుణుల సలహా తీసుకోగలరు.



Click it and Unblock the Notifications