Latest Updates
-
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.!
ఈ వీకెండ్‌ను ఇలా ఎంజాయ్ చేయండి..!
ఈ బిజీ లైఫ్ లో మనకు ప్రతి వీకెండ్ ఒక పండగే. కొందరికి శనివారం, ఆదివారం రెండు రోజులు సెలవు ఉంటే మరి కొందరికి కేవలం ఆదివారం లేదా ఏదో ఒక రోజు సెలవు ఉంటుంది.
వారం మొత్తంలో మనం సంతోషంగా గడపాలనుకున్నది ఆ వీకెండ్ రోజే. ఆరోజు ఏమి చేయాలనే దానిపై రెండు మూడు రోజుల నుంచి మనం ప్లాన్ వేసుకుంటాం. వ్యాపారులు తమకు అనువైన రోజును వీకెండ్ గా చేసుకోవచ్చు కానీ ఉద్యోగులకు అలాంటి పరిస్థితి ఉండదు. వారు పనిచేస్తున్న సంస్థ ఏ రోజు వీకెండ్ ఇస్తే అదేరోజు వాళ్ళు సెలవు తీసుకోవడానికి వీలుంటుంది. కాబట్టి ప్రతి వీకెండ్ను మనం ఎంత సంతోషంగా గడపవచ్చు అనే విషయాలను మనం తెలుసుకుందాం.
వీకెండ్ను ఇలా ప్లాన్ చేసుకోండి..
వ్యాయామం
రోజు చేసే ఉద్యోగంలో బిజీగా ఉండడం వల్ల వ్యాయామం చేసుకునే వెసులుబాటు ప్రతిరోజు ఉండకపోవచ్చు. అందువల్ల వీకెండ్ రోజు శరీరం మొత్తానికి వ్యాయామం చేసి రీఫ్రెష్ అవ్వాలి. ఇలా చేస్తే ఆ వారం ఉన్న స్ట్రెస్ మొత్తం వ్యాయామంతో దిగిపోతుంది. ప్రతి ఒక్కరూ వ్యాయామం చేయడానికి పరిస్థితులు అనుకూలించవు. బలమైన సంకల్పం ఉంటే తప్ప ప్రతిరోజు వ్యాయామం చేయరు. కాబట్టి వారానికి ఒకరోజు గట్టిగా వ్యాయామం చేసిన మంచి ఫలితం ఉంటుంది.

మెడిటేషన్
మానసిక ప్రశాంతత కోసం మెడిటేషన్ చేయాలి. పని ఒత్తిడి వల్ల మెదడుపై తీవ్రమైన ప్రభావం కలిగి ఉంటుంది. ధ్యానం చేయడం వల్ల ఆ ఒత్తిడి నుంచి సులువుగా బయటకు వస్తారు.
సినిమా
ప్రస్తుతం అన్ని కొత్త సినిమాలు విడుదలైన రెండు వారాల తర్వాత ప్రైమ్ వీడియో, నెట్ఫ్లిక్స్, హాట్ స్టార్ లాంటి ఓటీటి ప్లాట్ఫామ్లలో ప్లే అవుతున్నాయి. ఆరోజు మీకు ఇష్టమైన వారిని ఇంటికి పిలిపించుకొని. అందరికీ మంచి భోజనం లేదా స్నాక్స్ వండి, అందరూ కలిసి తింటూ రోజు మొత్తం వారితో కలిసి సినిమా చూడండి. టీవీ చిన్నదే అయినప్పటికీ లైట్స్ అన్ని ఆఫ్ చేసే టీవీ ముందు కూర్చుని స్నాక్స్ తింటూ సినిమాలను ఎంజాయ్ చేస్తే అంతకన్నా మంచి ఎంటర్టైన్మెంట్ ఇంకేముంది అని అనిపిస్తుంది.
పుస్తకం చదవడం
పుస్తకాలు చదివే అలవాటు మీకు లేకపోతే. మీరు చదవాలనుకున్న ఒక పుస్తకాన్ని తెప్పించుకొని చదవడం మొదలు పెట్టండి. ఒక పుస్తకాన్ని ఒక రోజు మొత్తం పూర్తి చేయకుండా కొంతవరకైనా చదవండి. లేదంటే మీకు బోర్ అనిపించకపోతే మొత్తం పుస్తకాన్ని చదవడం పూర్తి చేయండి.
ఇంటిని తీర్చిదిద్దుకోవడం
రోజు ఉద్యోగంతో బిజీగా ఉండడంవల్ల ఇంట్లో వస్తువులన్నీ చిందరవందరగా పడి ఉంటాయి. వాటన్నింటినీ అందంగా ఇంట్లో సదురుకోవడం చేయాలి. ఇంటిని అందంగా మార్చుకోవడానికి వీకెండ్ కంటే మంచి సమయం ఇంకేమీ ఉంటుంది.
కుటుంబంతో సమయం గడపడం
కుటుంబానికి సమయం ఇవ్వడం చాలా అవసరం. మన జీవితంలో అమ్మ, నాన్న, భార్య, పిల్లలు ప్రముఖ పాత్రను పోషిస్తారు. మన జీవితంలో మనతో కలిసి బ్రతుకుతున్నది, మనకు అన్ని రకాలుగా సహకారంగా ఉంటున్నది మన కుటుంబ సభ్యులే. వారికి వీకెండ్‌లో సమయం ఇచ్చి వారితో సంతోషంగా వీకెండ్‌ను జరుపుకునే ఏర్పాట్లు చేసుకోవాలి. కుటుంబ సభ్యులందరూ కలిసి ఏదైనా స్వీట్, బిర్యానీ, క్రేజీ వంటకం చేసుకోవడం లాంటివి చేయాలి.



Click it and Unblock the Notifications