Latest Updates
-
అమ్మ జన్మనిస్తే, గురువు జీవితాన్ని ఇస్తాడు.. టీచర్స్ డే స్పెషల్ వాట్సాప్ స్టేటస్, బెస్ట్ విషెస్ ఇవే! -
ఆ సమయంలోనే దంపతుల మధ్య ఎక్కువగా గొడవలు.. కారణాలేంటంటే.? -
ఈ పొడిని డైలీ అన్నం లేదా టిఫిన్‌లోకి తిన్నారంటే.. ఇక మందుల జోలికి వెళ్లాల్సిన పనిలేదు.! -
Teachers day recipe :ఉపాధ్యాయ దినోత్సవం స్పెషల్.. గురువుల కోసం కమ్మని పనీర్ పాయసం చేయండిలా.. -
ఉడకబెట్టాల్సిన పని లేదు.. చిక్కుడుకాయను కేటరింగ్ స్టైల్లో ఇలా చేస్తే ఫుల్‌గా లాగించేస్తారు.! -
తండ్రి తన ఆస్తి మొత్తం కొడుకుకి రాసిస్తే కూతురు పరిస్థితి ఏంటి? చట్టం ఏం చెబుతోంది? -
జెన్ జెడ్ తరానికి శ్రీకృష్ణుడి సందేశం.. గీత నుంచి నేటి యువత నేర్చుకోవాల్సిన కీలక పాఠాలివే.! -
కేవలం 15 నిమిషాల్లో.. పైకి కరకరలాడుతూ, లోపల సాఫ్ట్ గా ఉండే ఎగ్ పకోడి ఎలా చేసుకోవాలంటే.. -
కొత్తగా తల్లయిన వారికి అలర్ట్.. పిల్లలకు రెండేళ్ల వరకు ఇదొక్కటి అస్సలు ఇవ్వకూడదు.! -
ఉట్టికి, చిన్ని కృష్ణుడికి సంబంధమేంటి.. కృష్ణాష్టమికి ఉట్లు ఎందుకు కొడతారో తెలుసా.?
పేరెంట్స్ అమ్మాయిలకు ఇది తప్పనిసరిగా నేర్పించండి, గుడ్ టచ్, బ్యాడ్ టచ్ తేడా ఎలా నేర్పించాలంటే?
నేటి కాలంలో సమాజంలో అఘాయిత్యాలు భారీగా పెరిగిపోయాయి. చిన్న పిల్లల మీదే లైంగిక దాడులకు పాల్పడే కామాంధులు తయారయ్యారు. అందుకే అమ్మాయిలకు "గుడ్ టచ్" మరియు "బాడ్ టచ్" మధ్య తేడా నేర్పించడం చాలా ముఖ్యం. ఎందుకంటే ఇది వారి భద్రత, స్వీయ గౌరవం మరియు సున్నితమైన పరిస్థితులను అర్థం చేసుకోవడంలో సహాయపడుతుంది. చిన్న వయస్సులోనే ఈ విషయాలు తెలపడం వారి భద్రతకు అనుకూలంగా ఉంటుంది. అయితే చిన్న వయసులోనే వారికి గుడ్ టచ్, బ్యాడ్ టచ్‌కు తేడాను నేర్పించాలి అనేది ఈ స్టోరీలో తెలుసుకుందాం.
సరళంగా మరియు స్పష్టంగా వివరించండి
పిల్లలకు అర్థమయ్యే రీతిలో, సరళమైన భాషలో గుడ్ టచ్, బ్యాడ్ టచ్ గురించి వివరించండి. సంక్లిష్టమైన పదాలను ఉపయోగించకుండా, వారి వయసుకు తగిన పదజాలాన్ని ఉపయోగించండి. ఇలా చేయడం వలన మీరు దేని గురించి మాట్లాడుతున్నారో వారికి స్పష్టంగా అర్ధం అవుతుంది. అలాగే వారు ఒకవేళ ఎలాంటి సమస్యను ఎదుర్కొంటే మిమ్మల్ని చెప్పే అవకాశం ఉంటుంది.

శరీర ప్రైవేట్ భాగాల గురించి మాట్లాడండి
పిల్లలతో వారి శరీర భాగాలు మరియు ప్రైవేట్ భాగాల గురించి మాట్లాడటానికి సంకోచించకండి. ఇది వారికి సురక్షితమైన మరియు సురక్షితం కాని స్పర్శల మధ్య వ్యత్యాసాన్ని అర్థం చేసుకోవడానికి సహాయపడుతుంది. అలాగే ఇతరులు తమను ఎక్కడ టచ్ చేసినప్పుడు ఖండించాలనే ఒక అవగానను అందజేస్తుంది.
గుడ్ టచ్ ఉదాహరణలు ఇవ్వండి
తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు మరియు స్నేహితులు వంటి వ్యక్తులు ఇచ్చే కౌగిలింతలు మరియు ముద్దులు గుడ్ టచ్‌కు ఉదాహరణలని వివరించండి. దగ్గరి వ్యక్తులు ఏ విధంగా ప్రవర్తిస్తారు? ఏ విధమైన టచ్ చేస్తారు అనేది వారికి వివరించండి.
బ్యాడ్ టచ్ ఉదాహరణలు ఇవ్వండి
ఎవరైనా వారి ప్రైవేట్ భాగాలను తాకితే లేదా వారిని అసౌకర్యానికి గురిచేస్తే అది బ్యాడ్ టచ్ అని వివరించండి. కుటుంబ సభ్యులైనా, దగ్గరి బంధువులైనా వారి ప్రైవేట్ భాగాలను టచ్ చేస్తే కచ్చితంగా ఖండించాలని నేర్పించండి. అలాగే తల్లిదండ్రులకు దీని గురించి తెలపాలని వివరించండి.
"నో" చెప్పడం నేర్పించండి
ఎవరైనా వారిని అసౌకర్యానికి గురిచేస్తే లేదా వారి ప్రైవేట్ భాగాలను తాకితే "నో" అని చెప్పడానికి పిల్లలను ప్రోత్సహించండి. అలాగే ఎట్టి అపరిస్థితుల్లోనూ వారిని తాకడానికి అనుమతించకుండా ఉండాలని నేర్పించండి. వారు ఏదైనా పదార్థాలు ఇచ్చినా అవి తీసుకోకుండా ఉండేందుకు నో చెప్పడం మాత్రం కచ్చితంగా నేర్పించాలి.
నమ్మకమైన వ్యక్తితో మాట్లాడమని చెప్పండి
వారికి బ్యాడ్ టచ్ గురించి ఏదైనా అనుభవం ఉంటే, వారు నమ్మే వ్యక్తితో మాట్లాడాలని చెప్పండి. ఇది తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు లేదా ఇతర కుటుంబ సభ్యులు కావచ్చు. వారితో మాట్లాడి దీనికి సంబంధించిన వారిపై చర్యలు తీసుకోవాలని కోరండి.
ఓపెన్ కమ్యూనికేషన్ ప్రోత్సహించండి
పిల్లలతో ఎల్లప్పుడూ ఓపెన్ కమ్యూనికేషన్ కలిగి ఉండండి. వారు ఎలాంటి ప్రశ్నలు అడిగినా లేదా ఆందోళన వ్యక్తం చేసినా వినడానికి సిద్ధంగా ఉండండి. అలాగే వారి ప్రశ్నలకు సరైన, సూటి జవాబులు ఇవ్వడానికి ట్రై చేయండి. అలాగే వారి సమస్యను విని, దానికి సంబంధించిన పరిష్కార మార్గాలను వారికి వివరించడంతో పాటు మీరు పష్కరించండి.



Click it and Unblock the Notifications