Latest Updates
-
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్!
మనిషి మరణాన్ని జయించాలంటే ఏం చేయాలో చెప్పిన శాస్త్రవేత్త.. 120 సంవత్సరాలు గ్యారెంటీ!
ప్రతి మనిషి ఎదో ఒక రోజు చనిపోతాడన్న విషయం తెలిసిందే. సమయం సందర్భం వచ్చినప్పుడు ప్రతి ఒక్కరూ కాల గర్భంలో కలిసిపోవాల్సిందే. అయితే మనిషి ఎలా చనిపోతున్నారు? మనిషి మరణాన్ని ఎదురించలేడా అనే విషయాలపై శాస్త్రవేత్తలు పరిశోధనలు జరుపుతున్నా రహస్యం మాత్రం ఇప్పటి వరకు వీడలేదు. అయితే ఈ విషయంపై నోబెల్ బహుమతి గ్రహీత మరియు రాయల్ సొసైటీ మాజీ అధ్యక్షుడు వెంకీ రామకృష్ణన్.. 'ది సైన్స్ ఆఫ్ ఏజింగ్' సెషన్‌లో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆ వ్యాఖ్యలు ఏంటి? మనిషి మరణాన్ని ఓడించగలడా అనే విషయాలను ఈ స్టోరీలో తెలుసుకుందాం.
మనిషి జీవితం ఎన్ని ఏళ్ళు అంటే..
ఇప్పటి వరకు మనిషి చనిపోవడం లేదా వృద్ధాప్యాన్ని ఎదుర్కొనే అంశంపై అనేక పరిశోధనలు జరగుతున్నాయి. మనుషుల జీవితకాలం సాధారణంగా 110-112 ఏళ్ల మధ్య ఉంటుందని, కొన్నేళ్లుగా శతాధిక వయస్సు గల వ్యక్తుల సంఖ్య కూడా పెరుగుతోంది అని రామకృష్ణన్ చెప్పారు. శతాధిక వయస్సు అంటే 100 ఏళ్లు లేదా అంతకంటే ఎక్కువ కాలం జీవించడం. ప్రస్తుతం, లక్షల మంది 80 ఏళ్ల వయస్సు చేరుకుని ఉన్నారని, వారిలో చాలా మంది మరింత కాలం జీవించే అవకాశం ఉందన్నారు.

యాంటీ ఏజింగ్ పరిశోధనలపై భారీ పెట్టుబడులు
110 ఏళ్లకు మించి జీవించే వ్యక్తుల సంఖ్య పెరుగడం లేదని, ఇది శాస్త్రవేత్తలకు ఒక సవాలుగా మారిందని, జీవశాస్త్రంలో ఇది సహజ ప్రక్రియ అని రామకృష్ణన్ చెప్పారు. అయితే, ఆరోగ్యంగా వృద్ధాప్యాన్ని జయించడానికి కొన్ని మార్గాలను అనుసరించాలని కూడా సూచించారు. ప్రస్తుతం, జెనెటిక్ మార్పులు.. మనుషుల జీవనశైలి, వృద్ధాప్యంపై ప్రభావం చూపిస్తున్నాయన్నారు. గడిచిన దశాబ్దంలో వృద్ధాప్యంపై 3 లక్షలపైగా పరిశోధన పత్రాలు వెలువడగా, యాంటీ ఏజింగ్ పరిశోధనల కోసం 700 పైగా సంస్థలు భారీ పెట్టుబడులు పెట్టినట్లు ఆయన తెలిపారు.
ఆరోగ్యకరమైన జీవనశైలి చిట్కాలు
అయితే, శాస్త్రపరిశోధనల కంటే ఆరోగ్యకరమైన జీవనశైలి పాటించడం ఎక్కువ ప్రభావం చూపిస్తుందని, కొన్ని చిట్కాలను పంచుకున్నారు. ప్రతి వ్యక్తీ స్నేహితులను కలిగి ఉండాలని, ఇతరులతో కలసి, బంధాలతో జీవించాలన్నారు. ఒంటరిగా ఉండడం, ఒంటరిగా ఫీలవడం వలన వారి ఆయుస్సు తగ్గిపోతుందని పేర్కొన్నారు. ఏదో ఒక లక్ష్యం ఉంచుకుని దాన్ని సాధించడానికి కృషి చేసే వారు, నిర్లక్ష్యంగా ఉన్న వారి కంటే ఎక్కువ కాలం జీవిస్తారని ఆయన చెప్పారు. ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం, పూర్తి నిద్రపోవడం, ప్రతిరోజూ వ్యాయామం చేయడం వంటి వాటివల్ల ఎక్కువకాలం జీవించగలుగుతామని పేర్కొన్నారు.



Click it and Unblock the Notifications