Latest Updates
-
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.!
మీ మెదడుకు వున్న రహస్య శక్తి గురించి తెలిస్తే ఆశ్చర్యపోతారు..!
మన మైండ్ ఏదనుకుంటే అది మనము చేయగలము. ఇది నిజంగా ఒక అద్భుతమే. మనుషులు అనుకుంటే అదే బాధలో వుండిపోవచ్చు, లేదంటే ఆ బాధలోంచి బయటకు రావచ్చు. మన మెదడులో దాగి వున్న ఒక రహస్య శక్తి గురించి మనము తెలుసుకుందాం. దాని పేరే ప్లాసిబో ఎఫెక్ట్
మనషి మెదడు చాలా శక్తివంతమైంది. స్పృహలో వున్నా స్పృహలో లేకపోయినా మనల్ని కంట్రోల్ చేసేది మన మైండ్. వైద్యవిభాగంలో ప్లెసిబో అనేది ఒక ఫేక్ ట్రీట్మెంట్‌గా చెబుతుంటారు. ఈ ఫేక్ ట్రీట్మెంట్‌లో వైద్యులు రోగానికి సంబంధింలేని ట్యాబ్లెట్లను రోగికి ఇస్తారు. ఆ ట్యాబ్లెట్ వేసుకోగానే రోగిని నయం అయిపోతుంది. ఇది రోగియే మానసికంగా తనకు తెలియకుండా నయం చేసుకుంటాడు.

దేనిమీదైనా నమ్మకం వుంటే అది మనకు బలాన్ని ఇస్తుంది. ఏదో ఒక ట్యాబ్లెట్ వేసుకుంటే మనకు రిలీఫ్ వుంటుంది అని ఒక నమ్మకం. మనుషుల్లో ఈ నమ్మకం మీదే కోట్ల రూపాయల వ్యాపారం జరుగుతూ వుంది. పేశెంట్‌కు జబ్బు తగ్గుతుందనే నమ్మకం వుంటే ట్రీట్మెంట్‌లో పాజిటివ్ ఎఫెక్ట్ కనిపిస్తుందని వైద్యులు చెబుతున్నారు. ప్లెసిబో మందులు రియల్ మందుల్లో బ్రెయిన్‌ను నమ్మిస్తాయ్.
అసలైన మందులు ఎలాంటి మార్పులు తీసుకొని వస్తాయో ప్లెసిబో మందులు కూడా అవే మార్పులు తీసుకువస్తాయని వైద్యులు కనుగ్గొని ఆశ్చర్యపోయారు. డిప్రెషన్‌కు గురైన వారిలో యాంటీ డిప్రెసెంట్ ట్యాబ్లెట్లు ఇవ్వకుండా మామూలు ట్యాబ్లెట్లు ఇస్తే డిప్రెషన్ తగ్గిన కేసులు చాలా వున్నాయ్.
కాస్లీ మందుల ద్వారా జబ్బు త్వరగా తగ్గుతుందని పేశెంట్ల నమ్మకం కూడా రోగం తగ్గడానికి ప్రధాన కారణంగా తెలుసుకున్నారు. ప్లెసిబో మందులు వాడినప్పుడు శరీరంలో ఎండార్ఫిన్ అనే హార్మోన్ విడుదలౌతుంది. ఇది పెయిన్ కిల్లర్ లాంటిది. బ్రెయిన్ లో ఎండార్ఫిన్ రిలీజ్ అయిన నొప్పి నుంచి ఉపశమనం లభిస్తుంది.

ఈ ప్లేసిబో ఎఫెక్ట్‌లో పేశెంట్‌కు మందు గురించి తెలియడం చాలా అవసరం. పేశెంట్‌కు నమ్మకం వుంటే రోగం త్వరగా నమయవుతుంది. మనం అనుకున్నది నిజం కాకపోయినా, మనం తరచూ అదే అనుకుంటూ వుంటే కొన్ని రోజుల తరువాత అదే నిజమౌతుంది. ప్రముఖ హోస్ట్ ఎప్రా విన్‌ఫ్రే కూడా ఇదే ఆలోచనను కలిగి వున్నారు. మనం అనుకున్నదే మన బ్రెయిన్ మనకు తయారు చేసి ఇస్తుందని అంటుంది.
అసలైన మందులు శరీరంపై ఎలా పనిచేస్తాయో, ప్లెసిబో మందులు కూడా అలాగే పనిచేయించేలా బ్రెయిన్ తయారు చేస్తుందని అంటున్నారు. ట్యాబ్లెట్ ఎర్రగా వుంటే ఎక్కువ ప్రభావం వుంటుందని కొందరు రోగులు అనుకుంటారు. ఇది కూడా ఒక రకమైన ప్లేసిబో ఎఫెక్ట్‌గా చెప్పుకోవచ్చు.
ఎక్కువ కాలం బ్రతుకుతాను అనుకునేవాళ్లు యావరేజ్ లైఫ్ కంటే కూడా ఎక్కువగా బ్రతుకుతున్నట్లు రుజువైంది. బ్రెయిన్ ని ప్రోగ్రామ్ చేయగలిగితే రోగాల బారి నుంచి కూడా మనల్ని మనం కాపాడుకోవచ్చు. పాజిటివ్ ఆలోచనలు చేయడం వల్ల అది మన బ్రెయిన్, మన శరీరంపైన మంచి ఇంపాక్ట్‌ను చూపిస్తుంది. లా ఆఫ్ అట్రాక్షన్ ప్లెసిబో ఎఫెక్ట్‌లో బాగా పనిచేస్తుందని చెప్పుకోవచ్చు.
ఏ సమస్య వచ్చినా మంచి జరుగుతుందని నమ్మితే కచ్ఛితంగా మంచే జరుగుతుంది. మన మెదడును బలంగా మర్చితే మనం కూడా బలంగా తయారౌతాం.



Click it and Unblock the Notifications