Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
Guinness Record : టైపింగ్‌లో చిరుత.. హైదరాబాదీ గిన్నిస్ రికార్డ్..
గిన్నిస్ రికార్డు కొట్టాలంటే సాధారణ విషయం కాదు. కానీ చాలా మంది ప్రతీ రోజూ ఎన్నో గిన్నిస్ రికార్డులను కొల్లగొడుతూనే ఉన్నారు. ఇలా రికార్డులు సాధించడం కేవలం కొంత మందికే సాధ్యం అవుతుంది. వాళ్లు మనలా మన మధ్య ఉన్న మామూలు, సాధారణ మనుషులే కానీ వారు సాధించిన విజయాలు, కొల్లగొట్టిన రికార్డ్స్ చూస్తే మనం నోరు వెల్లబెట్టుకోవాల్సిందే. గిన్నిస్ రికార్డ్స్ సాధించడంలో మన తెలుగునేలకు చెందిన వాళ్లూ చాలా మందే ఉన్నారు. తాజాగా మన మరో హైదరాబాదీ గిన్నిస్ రికార్డును బ్రేక్ చేశాడు. అతనెవరు, ఏ రికార్డ్ బ్రేక్ చేశాడో తెలుసుకుందాం.
షేక్ అష్రఫ్ గిన్నిస్ రికార్డ్
ఇప్పటి వరకు టైపింగ్‌లో చాలా మంది రకరకాలుగా రికార్డులు బ్రేక్ చేశారు. కొందరు ఆల్ఫబెట్లను అత్యంత తక్కువ సమయంలో టైప్ చేసి రికార్డు సృష్టించారు. అలాంటే మరో రికార్డునే హైదరాబాద్ కు చెందిన షేక్ అశ్రఫ్ బ్రేక్ చేశారు. మనలో చాల మందికి ఇంగ్లీష్ టైపింగ్ వచ్చే వుంటుంది. ఏ నుంచి జెడ్ వరకు టైప్ చేయాలంటే మనకి సుమారుగా 10 సెకెన్లు పడుతుంది. చాలా మందికి అంతకంటే ఎక్కువ టైం పడుతుంది. అలాంటి ఏ టు జెడ్ వెనక నుంచి టైప్ అతి తక్కువ సమయంలో టైప్ చేసి రికార్డు సృష్టించాడు మన హైదరబాద్‌కు చెందిన షేక్ అష్రఫ్. జెడ్ నుంచి ఏ కు వేగంగా టైప్ చేయడానికి తక్కువలో తక్కువగా 2.88 సెకన్లను తీసుకొని రికార్డును బ్రేక్ చేశాడు.
సోషల్ మీడియాలో వైరల్
కళ్లు మూసి తెరిచే లోపు జెడ్ నుంచి ఏ వరకు టైప్ చేసేసాడు మన హీరో షేక్ అశ్రఫ్. గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ చెందిన ఇన్స్‌టాగ్రామ్ అధికారిక అకౌంట్లో అష్రఫ్ టైప్ చేసిన వీడియోను మనం చూడవచ్చు. చిటికెలో టైప్ చేసి మనందిరికీ చుక్కలు చూపించాడు. ప్రస్తతుం షేక్ అష్రఫ్ టైప్ చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇప్పటికే ఈ వీడియో 11 లక్షల వ్యూస్‌ను దాటి ఇంకా ట్రెండింగ్‌లో కొనసాగుతోంది.

"ఫాస్టెస్ట్ టైం టు టైప్ ద ఆల్ఫబెట్ బ్యాక్‌వర్డ్స్ : 2.88 సెకండ్స్"
షేక్ అష్రఫ్ తెలంగాణ రాష్ట్ర హైకోర్టులో న్యాయవాదిగా ప్రాక్టీస్ చేస్తున్నాడు. ఎప్పటి నుంచే టైపింగ్ నైపుణ్యం ఉన్న అష్రఫ్ తన టైపింగ్ స్పీడు పెంచుకొని రికార్డు బ్రేక్ చేయడానికి రంగంలోకి దిగాడు. గిన్నిస్ రికార్డు సంస్థకు దీనికి సంబంధించిన పరీక్షను ఫిబ్రవరీ 5న హాజరయ్యారు. అదే రోజు జెడ్ నుంచి ఏ అక్షరం వరకు 2.88 సెకన్లలో టైప్ చేసి టైపింగ్ టెస్ట్ సమర్పించారు. అష్రఫ్ టైపింగ్ స్పీడ్, టైపింగ్ టైమ్, ఆక్యురసీ, అన్నింటినీ పరిశీలించిన గిన్నిస్ రికార్డు తాజాగా ఆయనకు "ఫాస్టెస్ట్ టైం టు టైప్ ద ఆల్ఫబెట్ బ్యాక్‌వర్డ్స్ : 2.88 సెకండ్స్" అనే టైటిల్‌ను బహూకరంచింది.
గతంలోనే టైపింగ్ రికార్డ్
అయితనే షేక్ అశ్రఫ్‌కు ఇది మొదటి గిన్నిస్ రికార్డు కాదు. ఇంతకు ముందు కూడా ఇలాంటి ఒక రికార్డును బ్రేక్ చేశాడు. 2017లో ఏ నుంచి జెడ్ వరకు 3.37 సెకన్లలో టైప్ చేసి రికార్డు సెట్ చేశాడు. తన రికార్డును మల్లీ తనే బ్రేక్ చేసుకున్నాడు. ఈ సారి ముందు నుంచి కన్నా వెనక నుంచి ఇంగ్లీస్ ఆల్ఫబెట్లను టైప్ చేసి అందరినీ షాక్‌లో ముంచెత్తాడు మన హైదరాబాదీ.



Click it and Unblock the Notifications