Latest Updates
-
బంగాళదుంపలు, గుడ్లు ఉడకబెట్టేటప్పుడు ఈ తప్పు చేస్తున్నారా? పర్ఫెక్ట్ గా ఉడికే ట్రిక్ చెప్పిన చెఫ్! -
కాలేయ ఆరోగ్యం కోసం చాణక్యుడు చెప్పిన ఈ రహస్యాలు పాటిస్తున్నారా? -
బరువు తగ్గడానికి బ్రహ్మాస్త్రం.. పరగడుపున అవిసె గింజల నీళ్లు తాగితే పొట్ట మాయం! -
ఫైవ్ స్టార్ రెస్టారెంట్ రుచితో.. ఇంట్లోనే సులభంగా క్రీమీ కోకోనట్ చికెన్ కర్రీ..ఎలా చేసుకోవాలంటే.. -
వడగాల్పుల వేళ జాగ్రత్త! ఎండల నుంచి ప్రాణాలు కాపాడుకోవడం ఎలా? -
అక్షయ తృతీయ రోజున ఈ సమయాల్లో పూజ చేస్తే అదృష్టం మీదే! -
వృషభం, సింహం, ధనుస్సు రాశుల వారికి ఈ వారం రాజయోగం.. మీ జాతకం ఎలా ఉందంటే? - 19 నుండి 25 ఏప్రిల్ 2026 వరకు -
వృషభం, సింహం, ధనస్సు రాశుల వారికి రాజయోగం.. ఆ ఒక్క విషయంలో జాగ్రత్త! - ఆదివారం, 19 ఏప్రిల్ 2026 -
తల్లిదండ్రులూ అలెర్ట్..ఏడాదిలోపు పిల్లలకు పొరపాటున కూడా ఇవి తినిపించొద్దు! -
పెళ్లి గురించి ఎవరూ చెప్పని 5 పచ్చి నిజాలు..ఇవి తెలుసుకోకపోతే కష్టమే!
చెరుకు రసం ఎక్కువగా తాగితే డీహైడ్రేషన్..! ఐసీఎమ్మార్ హెచ్చరిక..!
ఐసీఎమ్‌ఆర్ కొత్తగా ప్రవేశపెట్టిన నిబంధనలు మనల్ని ఆరోగ్యం పట్ల అలెర్ట్ చేస్తున్నాయ్. ఈ ఎండాకాలంలో బయట ఎక్కడపడితే అక్కడ చెరుకు రసం జ్యూస్‌లు, పళ్ల రసాలు, ఇతర రస్నా, ఫలూడాకు చెందన షాపులు, సెంటర్లు చాలా వుంటాయ్. వీటి పట్ల అప్రమత్తం చెందాల్సిన అవసరం ఎంతైనా వుంది.
ఎండలు తీవ్రంగా మండిపోతున్నప్పుడు మనం బయట దొరికే కోల్డ్ కాఫీలు, చెరుకు రసం, ఫ్రూట్ జ్యూసులను తాగుతుంటాం. అయితే వీటిని ఎక్కువగా తీసుకోవద్దని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రిసర్చ్ చెబుతోంది. ఎండాకాలంలో చెరుకురసంలో చెక్కర స్థాయి అధికంగా వుండడం వల్ల అది ఆరోగ్యానికి ప్రమాదం కాబట్టి చెరుకురసాన్ని తాగడం తగ్గించివేయాలని ఐసీఎమ్మార్ హెచ్చరిస్తుంది.
దాహం వేస్తే నీళ్లకు బదులుగా కూల్ డ్రింక్స్ తాగడాన్ని ఆపివేయాలి. కూల్ డ్రింక్స్‌కి బదులుగా బటర్ మిల్క్, నిమ్మరసం, ఫ్రూట్ జ్యూస్, కొబ్బరి నీళ్లను తాగమని సూచిస్తున్నారు.

చెరుకు సరంలో ఎక్కువగా వుండే న్యాచురల్ షుగర్ అనేక అనారోగ్యాలకు కారణమయ్యే చాన్స్ వుందని పరిశోధకులు చెబుతున్నారు.
డీహైడ్రేషన్
చెరుకు రసం ద్వారా చెక్కరను శరీరంలోపల తీసుకోవడం వల్ల ఆ చెక్కరని గ్లూకోస్‌గా మార్చుకునే క్రమంలో ఎక్కవ నీరు అవసరం పడుతుంది. దీని వల్ల శరీరం డీహైడ్రేట్ అయ్యే అవకాశం వుందని వైద్యులు చెబుతున్నారు. ఎండాకాలంలో ఈ సమస్య మరింత పెరుగుతుందని అంటున్నారు.
రక్తంలో చెక్కర స్థాయి పెరుగుతుంది
చెరుకు రసం ద్వారా చెక్కరను శరీరంలోపలికి తీసుకోగానే రక్తంలో గ్లూకోజ్ స్థాయి అమాంతంగా పెరుగుతుంది. దీని వల్ల ఇన్సులిన్, డయాబెటీస్ సమస్య తలెత్తే అవకాశముంది.
చెరుకు రసంలో క్యాలరీలు ఎక్కువగా వుంటాయ్. దీని వల్ల బరువు పెరగడమే కాకుండా డయాబెటీస్ సమస్య, గుండె సమస్యలు వస్తాయ్.
నీళ్లకు బదులుగా కూల్ డ్రింకులు తాగితే అందులో చెక్కస్థాయిలో ఎక్కువగా వుంటాయని దీని వల్ల క్యాలరీలు పెరిగి బరువు పెరిగే అవకాశం వుందని వైద్యులు చెబుతున్నారు. రంగు రావడానికి కలర్లను యాడ్ చేస్తాారు, ఎక్కువ రోజులు నిలువ వుండడానికి కెమికల్స్‌ను కలుపుతారు. దీని వల్ల అనారోగ్య సమస్యలు పెరిగే అవకాశముందని పరిశోధకులు చెబుతున్నారు. కూల్ డ్రింక్స్‌లో కెఫిన్, యాసిడ్ పదార్ధాలు కూడా వుండడం డీహైడ్రేషన్‌కు దారి తీస్తుంది.
టీ కాఫీ తాగే విషయంలో చాలా జాగ్రత్తలు తసుకోవాల ఐసీఎమ్మార్ చేబుతోంది.
కాఫీలు, టీలు విపరీరంగా తాగకుండా పరిమితంగా తాగాలి. ఉదయం, మధ్యాహ్నం మాత్రమే కాఫీ తాగాలి. ఇక మళ్లీ ఎక్కువ సార్లు తాగకూడదు.
కాఫీ, టీలకు ప్రత్యామ్నాయంగా హెర్బల్ టీ, గ్రీన్ టీ, చామంతి టీ, దాల్చిన చెక్క టీ ఇలా హెర్బల్స్, స్పైసెస్‌తో తయారు చేసే టీ తాగేందుకు ప్రయత్నించాలి.
రోజుకు కనీసం 8 నుంచి 10 గ్లాసుల నీళ్లను తాగాలి. ఒకేసారి తాగకుండా రోజు మొత్తం డివైడ్ చేసుకొని తాగాలి. ఉదయం లేవగానే రెండు నుంచి మూడు గ్లాసులు, మద్యాహ్నం తినే ముంది 1 గ్లాసు, తిన్న నాలుగు గంటల తరువాత 2 గ్లాసులు, సాయంత్రం 2 గ్లాసులు, మళ్లీ రాత్రి రెండు గ్లాసులు. ఇలా రోజు మొత్తం తాగేలా ప్రణాళిక వేసుకోవాలి.
పుచ్చపండు, బత్తాయి లాంటి పళ్లను ఎక్కువగా తినడం వల్ల శరీరం హైడ్రేట్ అవుతుంది. మద్య తాగవద్దు, తాగితే శరీరం డీహైడ్రేట్ అవుతుంది.



Click it and Unblock the Notifications











