Latest Updates
-
ఉడకబెట్టాల్సిన పని లేదు.. చిక్కుడుకాయను కేటరింగ్ స్టైల్లో ఇలా చేస్తే ఫుల్‌గా లాగించేస్తారు.! -
తండ్రి తన ఆస్తి మొత్తం కొడుకుకి రాసిస్తే కూతురు పరిస్థితి ఏంటి? చట్టం ఏం చెబుతోంది? -
జెన్ జెడ్ తరానికి శ్రీకృష్ణుడి సందేశం.. గీత నుంచి నేటి యువత నేర్చుకోవాల్సిన కీలక పాఠాలివే.! -
కేవలం 15 నిమిషాల్లో.. పైకి కరకరలాడుతూ, లోపల సాఫ్ట్ గా ఉండే ఎగ్ పకోడి ఎలా చేసుకోవాలంటే.. -
కొత్తగా తల్లయిన వారికి అలర్ట్.. పిల్లలకు రెండేళ్ల వరకు ఇదొక్కటి అస్సలు ఇవ్వకూడదు.! -
ఉట్టికి, చిన్ని కృష్ణుడికి సంబంధమేంటి.. కృష్ణాష్టమికి ఉట్లు ఎందుకు కొడతారో తెలుసా.? -
గుడిలో పెట్టే ప్రసాదం రుచితో.. ఈ జన్మాష్టమికి ఇంట్లోనే కమ్మని పంచామృతం చేసుకోండిలా.. -
చుక్క నూనె లేకుండా లంచ్ బాక్స్‌లోకి ఈజీగా చేసెయొచ్చు.. రక్తహీనతని సైతం తరిమికొట్టేస్తుంది.! -
Powerful Krishna Mantras: కృష్ణాష్టమి నాడు ఈ మంత్రాలు జపిస్తే.. మీ కోరికలన్నీ ఇట్టే నెరవేరుతాయి! -
యదా యదా హి ధర్మస్య.. శ్రీకృష్ణుడి స్ఫూర్తితో మీ బంధుమిత్రులకు జన్మాష్టమి శుభాకాంక్షలు చెప్పండిలా!
Allu Arjun arrest: అల్లు అర్జున్ అరెస్ట్.. ఎన్ని సంవత్సరాల జైలు శిక్ష అంటే?
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అరెస్ట్ అయ్యారు. ఆయనను చిక్కడపల్లి పోలీసులు అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. అల్లు అర్జున్ నటించిన పుష్ప-2 మూవీ ప్రీమియర్స్ సందర్భంగా అల్లు అర్జున్ సంధ్య థియేటర్‌కు వెళ్ళినప్పుడు జరిగిన తొక్కిసలాటలో ఓ మహిళ మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ ఘటన నేపథ్యంలో ఇప్పటికే అల్లు అర్జున్‌పై కేసు నమోదైంది.
తాజాగా ఆయనను పోలీసులు అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. అయితే అల్లు అర్జున్ అరెస్ట్‌కు కారణం ఏంటి? ఆయన అరెస్టుకు ముఖ్యమైన కారణాలు ఏమైనా ఉన్నాయా? అనే విషయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

అల్లు అర్జున్ అరెస్టుకు అసలైన కారణం
అల్లు అర్జున్ నటించిన పుష్ప-2 మూవీ ఈనెల 5వ తేదీన విడుదలైన విషయం తెలిసిందే. అయితే ఈనెల 4వ తేదీన ఈ మూవీకి సంబంధించిన ప్రీమియర్స్ వేశారు. హైదరాబాద్‌లోని సంధ్య థియేటర్‌లో ఈ మూవీ ప్రీమియర్స్ వేయగా.. ఆ ప్రీమియర్ షోకు అల్లు అర్జున్ హాజరయ్యారు. దీంతో తమ అభిమాన నటుడితో సినిమా చూసేందుకు చాలా మంది థియేటర్‌కు వెళ్లడంతో అక్కడ తొక్కిసలాట జరిగింది.
ఈ తొక్కిసలాటలో రేవతి అనే మహిళ అక్కడికక్కడే మృతి చెందగా.. ఆమె కుమారుడు తీవ్రంగా గాయపడ్డాడు. ప్రస్తుతం అతడికి ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటన నేపథ్యంలో థియేటర్ ఓనర్, హీరో అల్లు అర్జున్, నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. తాజాగా ఈ ఘటన నేపథ్యంలో అల్లు అర్జున్‌ను పోలీసులు అరెస్ట్ చేసి జైలుకు తీసుకెళ్లారు.
ఆ వ్యక్తులే కారణం అని అంటున్న అభిమానులు
తమ అభిమాన నటుడు అరెస్ట్ అవడాన్ని అల్లు అర్జున్ అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. థియేటర్‌లో రష్ ఉంటుందని తెలిసీ ఆ ఫ్యామిలీ రావడం వారి తప్పు అని పేర్కొంటున్నారు. జాతరలో కూడా తొక్కిసలాటలు జరుగుతాయని అప్పుడు ఎవరి మీద కేసులు నమోదు చేస్తారని ప్రశ్నిస్తున్నారు. రాజకీయ నాయకుల మీటింగ్‌లో తొక్కిసలాట జరిగినప్పుడు రాజకీయ నాయకులు బాధ్యత తీసుకుంటున్నారా అని నిలదీస్తున్నారు.
అల్లు అర్జున్ ఎదుగులను ఓర్వలేకే కొందరు కావాలని ఈ పని చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. రాజకీయ కుట్రలో భాగంగానే అల్లు అర్జున్‌పై కక్ష తీర్చుకుంటున్నారని, కచ్చితంగా దీనికి సమాధానం చెప్తామని అంటున్నారు.
Big Breaking:-
— ℝℂ𝔹𝟙𝟠_🚩👑 (@Abhayti05059972) December 13, 2024
Hero #AlluArjun Arrested Video visuals #Pushpa2TheRule #AlluArjunArrest pic.twitter.com/BWYHg3KpTy
బెయిల్ వస్తుందా?
కాగా ఈ తొక్కిసలాట ఘటనలో ఇప్పటికే అల్లు అర్జున్ బెయిల్ కోసం హైకోర్టులో పిటిషన్ వేశారు. దీనిపై ఇప్పటికే విచారణ జరిపిన కోర్టు తదుపరి విచారణను వాయిదా వేసింది. ఇప్పుడు అల్లు అర్జున్ అరెస్ట్ అవడంతో ఆయనకు బెయిల్ వస్తుందా? కోర్టు ఏ విధంగా స్పందిస్తుంది అనేది వేచి చూడాలి. కాగా ఆయనపై పోలీసులు సెక్షన్ 105, 118(1), రెడ్ విత్ 3/5 BNS సెక్షన్ల కింద నాన్ బైలబుల్ కేసు నమోదు చేశారు. ఈ నేపథ్యంలో కేసు రుజువైతే అల్లు అర్జున్‌కు పదేళ్ల జైలు శిక్ష పడే అవకాశం ఉందట.



Click it and Unblock the Notifications