Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
ఇలాంటి వారి ఇంట్లో భోజనం చేస్తే పాపాలు చుట్టుకుంటాయి.. వాళ్లు ఎవరంటే?
చుట్టాలు, స్నేహితులు, పరిచయస్తులు లేని వ్యక్తి అంటూ ఉండడు. ఆయా వ్యక్తులతో ఎప్పుడో ఒకసారి కలిసి భోజనం చేయడం, వారి ఇంట్లో జరిగే శుభకార్యానికి వెళ్లి రావడం ప్రతి ఒక్కరూ చేస్తుంటారు. సమాజంలో నలుగురితో సఖ్యతగా బతకాలంటే ఇలాంటి చేయకతప్పదు. రాకపోకలు ఉంటేనే ఏ సంబంధం అయినా బలపడుతుంది. అయితే అలా వెళ్లిన ఇంట్లో భోజనం చేసే ముందు కొన్ని జాగ్రత్తలు పాటించాలని చెబుతున్నాయి శాస్త్రాలు. కొందరు వ్యక్తుల ఇంట్లో భోజనం చేయవద్దని గరుడ పురాణం చెబుతోంది. ఆయా వ్యక్తుల ఇళ్లలో వారు వడ్డించే భోజనం తినడం వల్ల లేనిపోని పాపాలు మూటగట్టుకోవాల్సి వస్తుందని గరుడ పురాణం హెచ్చరిస్తోంది.

ఆహారం అంటే మన సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీక. మన జీవన నడవడిక బట్టే తినే ఆహారం ఉంటుంది. మతం, కులం, ప్రాంతం ఆహారంపై ప్రభావాన్ని చూపిస్తాయి. ఆహారం పరబ్రహ్మ స్వరూపం అనే వ్యాఖ్య కూడా శాస్త్రాల నుంచి పుట్టిందే.
దొంగలు, నేరస్తుల ఇంట్లో:
దొంగలు, నేరాలకు పాల్పడిన వారి ఇంట్లో భోజనం చేయకూడదని గరుడ పురాణం చెబుతోంది. అక్రమాలు, అన్యాయాలు చేసిన వారి ఇంట్లో కూడా భుజించకూడదు. పాపాలు చేసిన వారి పాప ప్రభావం వారు వడ్డించే ఆహారంపై కూడా పడుతుంది. అలాంటి ఆహారం తినడం వల్ల మనమూ ఎంతో కొంత పాపం మూటగట్టుకోవాల్సి వస్తుంది. పాపాలు చేసుకుంటూ సంపాదించిన సొమ్ముతో తయారైన వంటకాలు కూడా పాప భోజనమే అని గరుడ పురాణం చెబుతోంది.
వ్యసనపరులు ఇంట్లో భోజనం:
మాదక ద్రవ్యాలకు, మద్యానికి, ధూమపానానికి, కామానికి బానిసలు అయిన వారికి వీలైనంత దూరంగా ఉండాలని శాస్త్రాలు చెబుతున్నాయి. అలాంటి వారి ఇంటికి కూడా వెళ్లకుండా జాగ్రత్త పడాలని హెచ్చరిస్తున్నాయి. వ్యసనపరుల ఇంటికి వెళ్లినా.. వాళ్లు పెట్టిన ఆహారాన్ని భుజింకకూడదని గుర్తుంచుకోవాలని గరుడ పురాణం చెబుతోంది. అలాంటి వారి నుంచి వచ్చే ప్రతికూల శక్తులు, అలాంటి వారు వడ్డించే భోజనం ద్వారా వచ్చే ప్రతికూలత వల్ల వారి చెడు మనకూ వస్తుందని గరుడ పురాణం చెబుతోంది
నపుంసకుల ఇంట్లో భోజనం:
నపుంసకులకు దానం చేయడం చాలా మంచిదని అంటారు. వారికి దానం చేయడాన్ని పవిత్రమైన కార్యంగా భావిస్తారు. అయితే వారికి పెట్టాలి కానీ వారి చేత తినకూడదనే నియమం ఉంది. నపుంసకులకు వీలైనంత మేర దానం చేయడానికి ప్రయత్నించాలని, కానీ వారి కష్టాన్ని అనుభవించకూడదని గరుడ పురాణం చెబుతోంది.
Disclaimer: ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా ఈ వ్యాసాన్ని రాయడం జరిగింది. కచ్చితత్వానికి, విశ్వసనీయతకు ఎలాంటి హామీ ఇవ్వడం లేదు. Boldsky Telugu ఈ వ్యాసానికి సంబంధించిన ఏ విషయాన్నీ నిర్ధారించడంలేదు. ఈ వ్యాసం ఉద్దేశం సమాచారం అందించడం మాత్రమే. ఏదైనా పాటించే ముందు సంబంధిత నిపుణుల సలహా తీసుకోగలరు.



Click it and Unblock the Notifications