Latest Updates
-
ఇడ్లీ, దోసల్లోకి అదిరిపోయే కాంబినేషన్..పుల్లపుల్లని, కారంకారమైన జామకాయ చట్నీ..ఎలా చేసుకోవాలంటే.. -
ఎండలో ఉంటున్నా.. ట్యాబ్లెట్లు వాడుతున్నా విటమిన్-D పెరగట్లేదా? అసలు కారణం ఇదే! -
అమ్మమ్మల నాటి అమృతం.. వేసవిలో ఒంటికి చలువ చేసే తరవాని చారు -
కొంతమంది ప్రతిసారీ రాంగ్ పర్సన్ కే ఎందుకు ఎట్రాక్ట్ అవుతుంటారో తెలుసా? -
పైన మీగడ, లోపల కమ్మటి రుచి.. ఇంట్లోనే పక్కా ధాబా స్టైల్ మలై లస్సీ..ఎలా చేసుకోవాలంటే -
అచ్చం బేకరీ రుచితో కొబ్బరి బర్ఫీ.. తక్కువ సమయం, అదిరిపోయే టేస్ట్! -
కరివేపాకుతో ఈ 5 ఆహారాలు కలిపి తింటే.. మీ ఎముకలు ఉక్కులా మారుతాయి! -
వేడివేడి అన్నం, కాస్త నెయ్యి, గోంగూర కారం..ఆహా ఏమి రుచి! -
ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నారా? ముందు మహిళలు సరిదిద్దుకోవాల్సిన అతిపెద్ద సమస్య ఇదే! -
స్పైసీ మటన్ లివర్ ఫ్రై..ఈ సీక్రెట్ మసాలాతో చేస్తే ప్లేట్ ఖాళీ చేస్తారు!
మీ ఫోన్‌లో ఈ సెట్టింగ్స్ ఆన్ చేస్తే.. మొబైల్ పోయినా రెండు నిమిషాల్లో కనుగోనొచ్చు!
ప్రస్తుతం మన దేశంలో మొబైల్ లేని ఇల్లు లేదని చెప్పడం అతిశయోక్తి కాదు. ప్రతి ఇంట్లోనూ రెండేసి మొబైల్స్ ఉంటున్నాయి. పదో తరగతి పాస్ అయిన పిల్లాడు కూడా మొబైల్ లేనిదే కాలేజీకి వెళ్ళను అని చెప్పే స్థితి నెలకొంది. మన జీవితంలో అత్యంత ముఖ్యమైన, అత్యంత అవసరమైన సాధనంగా మొబైల్ ఫోన్ మారిపోయింది. పిల్లల నుంచి పెద్దల వరకూ, ప్రతి ఒక్కరూ దానిని వివిధ ప్రయోజనాల కోసం వినియోగిస్తూ ఉంటారు. సోషల్ మీడియా, సంభాషణలు, బ్యాంకింగ్, పనుల నిర్వహణ ఇలాంటి చాలా అవసరాలకు మొబైల్ కీలక పాత్ర పోషిస్తుంది.
అయితే మొబైల్ ఎంత ముఖ్యమైనదిగా మారిందో, వాటిని దొంగిలించే వ్యక్తులు కూడా చాలా మంది తయారయ్యారు. ఆ మొబైల్ పోయినప్పుడు ఆందోళన చెందే వ్యక్తులు చాలా మంది అయిపోయారు. దొంగలించబడిన మొబైల్ మనకు ఎక్కడ కీడు చేస్తుందో, ఎక్కడ మనకు ఇబ్బందులను కల్గజేస్తుందో అని కంగారు పడిపోతుంటాము. అయితే కొన్ని సాధారణ సెట్టింగ్స్ ఆన్ చేసుకోవడం వలన మొబైల్ దొంగలించబడ్డ కూడా సులభంగా వాటిని దొరకబట్టొచ్చు. అలాగే వాటి నుంచి ఎదురయ్యే సమస్యలను ఎదుర్కోవచ్చు. ఆ సెట్టింగ్స్ ఏంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం.

1. ఫోన్ స్విచ్ ఆఫ్ చేయకుండా ఉండటానికి
మీ ఫోన్‌ను ఎవరికైనా దొంగిలించినట్లయితే, మీరు ముందు ఆ ఫోన్‌ను స్విచ్ ఆఫ్ చేయాలని ప్రయత్నిస్తారు. కానీ మీరు దీన్ని నివారించాలనుకుంటే, ఫోన్‌లోని కొన్ని ప్రత్యేక సెట్టింగ్స్‌ని మార్చుకోవచ్చు. ఈ సెట్టింగ్ను అమలు చేసినపుడు, ఫోన్‌ను స్విచ్ ఆఫ్ చేయడం సులభం కాదు. ఇందుకోసం ముందుగా..
"Settings" లోకి వెళ్లి,
"More Security and Privacy" పై క్లిక్ చేయండి.
ఆపై "Required Password to Power Off" పై క్లిక్ చేసి, అక్కడ "Power Off Button" ను "On" చేసుకోండి.
ఈ విధంగా, ఎవరైనా మీ ఫోన్‌ను స్విచ్ ఆఫ్ చేయాలంటే, ముందుగా పాస్‌వర్డ్ అడగబడుతుంది.
2. ఫ్లైట్ మోడ్‌ను లాక్ చేయడం
మీ ఫోన్‌ను స్విచ్ ఆఫ్ చేయకపోయినా, దొంగలు ఫ్లైట్ మోడ్‌లో పెట్టి మీ డేటాను పొందకుండా మీ ఫోన్ ఎక్కడుందో తెలియనివ్వకుండా చేయగలరు. ఈ సమస్యను నివారించడానికి, మీరు Control Center Lock సెట్టింగ్‌ని మార్చవచ్చు.
ఇది చేయడానికి:
"Settings" లోకి వెళ్లి
"Notification Status Bar" పై క్లిక్ చేయండి.
అక్కడ "Lock Screen Notification" ను సెలెక్ట్ చేసి,
"Swipe Down Unlock Screen to View Notification Bar" ను ఆఫ్ చేయండి.
ఈ విధంగా, ఫ్లైట్ మోడ్‌ను లాక్ చేసి, దొంగల నుంచి తప్పించుకోవచ్చు.
3. ఫోన్‌ను తిరిగి కనుగొనడం
మీ ఫోన్ దొంగలించబడ్డా లేదా మీరు ఎక్కడైనా మర్చిపోయినా.. మీరు దాన్ని త్వరగా కనుగొనడం కోసం Find My Device ఫీచర్‌ను వినియోగించవచ్చు. మీరు ఈ ఫీచర్‌ను ఎప్పుడు ఆన్ చేస్తే, మీ ఫోన్‌ను ఎక్కడైనా ఉంచినా, దాన్ని ట్రాక్ చేయడం సులభం అవుతుంది.
ఇది చేయడానికి:
"Settings" లోకి వెళ్లి,
"Find My Device" ఆన్ చేయండి.
ఆపై "Find Your Offline Device" పై క్లిక్ చేసి,
"Without Network" ను సెలెక్ట్ చేసి, ఫీచర్‌ను ఆన్ చేయండి.
ఈ సెట్టింగ్ ద్వారా, మీరు సిమ్ తీసేసినా, ఫోన్ లొకేషన్‌ను ట్రాక్ చేయగలుగుతారు.
4. విభిన్న రకాల మరొక సెట్టింగ్స్
మీ ఫోన్‌ను మరింత సురక్షితంగా ఉంచుకోవడానికి, మీరు ఈ క్రింది జాగ్రత్తలు కూడా తీసుకోవచ్చు:
ఫోన్‌లో పాస్‌వర్డ్ లేదా ఫింగర్ ప్రింట్ లేదా ఫేస్‌లాక్ వంటి భద్రతా పద్ధతులను ఉపయోగించండి.
ఆటో-లాక్ మరియు స్క్రీన్ టైమ్ అవుట్ సెట్టింగ్స్‌ని వినియోగించండి, తద్వారా మీ ఫోన్‌ను ఇతరులు ఉపయోగించడం కుదరదు. డేటా బాకప్ చేసి, మొబైల్ కాపీ తీసుకోవడం కూడా ముఖ్యం.
5. ఇతర సెక్యూరిటీ సలహాలు
జియో-ఫెన్సింగ్: మీరు ఫోన్‌ను ఇతరులకు ఇవ్వాలనుకుంటే, దానికి జియో-ఫెన్సింగ్ ని యాక్టివేట్ చేసి, ఎక్కడ ఉన్నారో ట్రాక్ చేసుకోవచ్చు. అలాగే మీ ఫోన్‌లో కొన్ని థర్డ్ పార్టీ ట్రాకింగ్ యాప్స్‌ను ఇన్‌స్టాల్ చేసుకొని ఫోన్లను ట్రాక్ చేసుకోవచ్చు.



Click it and Unblock the Notifications











