Latest Updates
-
అన్నీ ఇచ్చాక కూడా ప్రేమ మారిపోయిందా? దానికి కారణం మీరు కాదు -
మహిళల్లో పెరుగుతున్న బ్రెస్ట్ క్యాన్సర్.. ఈ 4 ఫ్రూట్స్‌తో ప్రమాదాన్ని అరికట్టొచ్చా.? -
జూన్ 5, 2026: గ్రహాల కటాక్షంతో ఈ రాశుల వారికి అదృష్టం, ధనయోగం ఖాయం! -
ఎలాంటి విషాన్నైనా మింగేస్తుంది.. ఆరోగ్యానికి సంజీవని నేరేడు పండ్ల ప్రయోజనాలు తెలుసా.! -
రొటీన్ కాఫీకి గుడ్ బై చెప్పండి.. ఈ టేస్టీ అండ్ హెల్తీ బనానా కాఫీ ట్రై చేయండి! -
జూన్ 5న సర్వార్థ సిద్ధి యోగం.. ఈ పనులు చేస్తే మీ కెరీర్, బిజినెస్ లో తిరుగుండదు! -
మహా శివరాత్రి నాలుగు ప్రహారాల పూజ వెనుక ఉన్న అసలు అర్థం తెలుసా? చాలామందికి తెలియని శివ రహస్యాలు ఇవే! -
జూన్ 5 గ్రహాల గమనం: ఈ రాశుల వారికి కెరీర్, ఆర్థికంగా ఊహించని అదృష్టం.. మీ రాశి ఉందా? -
వృషభం, సింహం, కుంభ రాశుల వారికి లక్ష్మీ కటాక్షం.. ఈరోజు మీ అదృష్టం ఎలా ఉంది? - శుక్రవారం, 05 జూన్ 2026 -
బ్రేకప్ అయినా జ్ఞాపకాలతో తీరని వేదన.. మాజీ లవర్‌ను మరిచిపోవడం ఎలా.?
ఈ పాట వింటే ఎవరైనా కచ్చితంగా ఆత్మహత్య చేసుకుంటారు.. ఆ పాట ఏంటంటే?
మనం మన జీవితంలో వినోదానికి ఎంతో ప్రాధాన్యత ఇస్తాం. ఏ ఒక్క పాట హిట్ అయినా.. ఆ పాటను లూప్‌లో వినేస్తుంటాం. కొంచెం సంతోషంగా ఉన్నా, కొంచెం బాధలో ఉన్న పాటలు పెట్టుకొని వినుకుంటూ ఆ సంతోషాన్ని సెలెబ్రేట్ చేసుకుంటాం. అదే బాధలో ఉంటే పాటలు విని ఆ బాధను మర్చిపోతుంటాం. కొన్ని మధురమైన సంగీతం మన మనసును ఉత్సాహపరిస్తే, కొన్ని సంగీతాలు మనలో డిప్రెషన్‌ని నింపేస్తాయి.
అలాంటిదే ఒక పాట ఉంది. ఆ పాట విని సుమారు 100 మందికి పైగా ఆత్మహత్య చేసుకున్నారు. ఇంతకీ ఆ పాట ఏంటి? ఆ పాట విని ఎందుకు అంతమంది ఆత్మహత్య చేసుకున్నారనేది ఈరోజు ఈ స్టోరీలో తెలుసుకుందాం.

ఆ పాట ఏమిటంటే?
అంతటి దారుణమైన ఆ పాట పేరు గ్లూమీ సండే. హౌ స్టఫ్ వర్క్ అనే వెబ్‌సైట్ ప్రకారం ఈ పాటను అత్యంత దారుణమైనదిగా గుర్తించారు. ప్రపంచంలో అత్యంత దిగాలుగా ఉండే ఈ పాటను 1933లో Rezso Seress, Laszio javor అనే వ్యక్తులు రచించారు. 1933లో ఈ పాటను రచిస్తే 1935 వరకు ఇది వినడానికి అందుబాటులో ఉండేది. ఈ పాటను రికార్డు చేయడం కూడా అత్యంత కష్టతరంగా రికార్డు చేశారు.
ఈ పాటను విని 1935లో ఓ చెప్పులు కుట్టే వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. అనంతరం అతను అతని సూసైడ్ నోట్‌లో గ్లూమి సండే పాటలోని పంక్తులను రాశి.. తాను ఆత్మహత్య చేసుకోవడానికి ఇదే కారణమని పేర్కొన్నాడు. అంతేకాకుండా ఈ పాట విని ఇద్దరు వ్యక్తులు తమను తాము కాల్చుకొని చనిపోయారు. అలాగే ఓ మహిళ బావిలో దూకి ఆత్మహత్య చేసుకుంది. అయితే వీరందరూ తమ సూసైడ్ నోట్‌లో గ్లూమి సండే అని రాసి చనిపోయారు.
ఇన్ని సంఘటనల తరువాత ఈ పాటను వినడానికి నిషేధించారు. అప్పటి నుంచి ఇది అందుబాటులో లేదు. ఇంతటి దారుణమైన పాటను రచించిన Rezso Seress 1968లో ఆత్మహత్య చేసుకొని చనిపోయాడు.
ఇంతలా ఈ పాటలో ఏముందంటే?
హౌ స్టఫ్ వర్క్ అనేది ఒక సైన్స్ వెబ్‌సైట్. ఈ వెబ్‌సైట్ ఈ పాటపై రెసెర్చ్ చేసినప్పుడు ఈ పాట ప్రభావం శాస్త్రీయంగా ఉందని కనిపించింది. ఇది ఒక హంగేరియన్ పాట అని వెల్లడించింది. ఈ పాట విడుదలైన సమయంలో ఆ దేశంలోని ప్రజలు తీవ్రమైన డిప్రెషన్‌లో ఉన్నారు. తినడానికి తిని కూడా లేదు. డబ్బులు లేక, ఉద్యోగాలు పోవడంతో తీవ్ర నిరాశలో ఉండేవారు.
అలాంటి సమయంలో ఈ పాట విడుదలవడం.. ఆ పాటలోని లిరిక్స్ తమ జీవితాలకు తగ్గట్టు ఉండడంతో చాలా మంది పాటను విని ఆత్మహత్య చేసుకున్నారని ఆ వెబ్‌సైట్ పేర్కొంది. కానీ, సాధారణంగా హంగేరియాలో ఆత్మహత్యలు అనేవి ఎక్కువగానే ఉంటాయి. అది కూడా ఒక కారణంతోనే అక్కడి ప్రజలు ఆత్మహత్య చేసుకుకొని ఉంటారని ఆ వెబ్‌సైట్ వెల్లడించింది. ఏది ఏమైనప్పటికీ ఈ పాటను ఒక దారుణమైన పాటగా గుర్తించడంతో పాటు సంగీత ప్రపంచంలో విషాదమైన గీతంగా మారిపోయింది.
గమనిక: ఈ కథనంలో మేము పొందుపరిచిన అంశాలు.. ఇంటర్నెట్‌లో మాకు దొరికిన సమాచారం, పలు అధ్యయనాల ఆధారంగా అందించబడింది. వీటిని విశ్వసించడం, విశ్వసించకపోవడం పూర్తిగా మీ బాధ్యత.



Click it and Unblock the Notifications