Latest Updates
-
క్రిస్పీ సొరకాయ ఫింగర్స్..ఏం టేస్ట్ రా బాబు తింటుంటే అలా పోతూ ఉంటాయ్..ఈజీగా చేసుకోండిలా.. -
Shocking: మెట్రో రైలులో సీటు కోసం గొడవ..ఒకరు మృతి..అసలేం జరిగిందంటే..? -
హార్ట్ ఎటాక్ ముప్పును ముందుగానే పసిగట్టే కాలి బీపీ టెస్ట్.. ఎలా చేయాలంటే? -
నవరాత్రి స్పెషల్: ఉపవాసంలో తక్షణ శక్తినిచ్చే మఖానా లడ్డూ..ఈజీగా చేసుకోండిలా.. -
నవరాత్రుల్లో రెండుసార్లు గజకేసరి యోగం..ఈ 4 రాశుల వారికి లక్ష్మీదేవి కటాక్షం, తిరుగులేని ధనలాభం! -
భారతదేశంలో బంగారం పారే నదులు ఇవే.. మీకు తెలుసా? -
నవరాత్రులు 3వ రోజు స్పెషల్..అన్నపూర్ణా దేవి నైవేద్యంగా కమ్మని కొబ్బరి పాయసం..ఇలా చేసుకోండి -
కీళ్ల నొప్పులతో బాధపడుతున్నారా? యూరిక్ యాసిడ్ తగ్గాలంటే ఈ 3 ఫుడ్స్ తినకూడదు! -
అక్టోబర్ 12 నుంచి శుక్ర మౌఢ్యమి.. ఈ 5 రాశుల వారు చాలా జాగ్రత్తగా ఉండాలి! -
క్రిస్పీ చీజ్ పనీర్ సమోసా..సాయంత్రం వేళ పర్ఫెక్ట్ స్నాక్..ఇలా చేసుకోండి..
IIFA ఉత్సవ్ అవార్డ్స్ 2024 : బాహుబలి, భీమ్లా నాయక్ కాదు, రానా దగ్గుబాటి గొప్ప ప్రతిభావంతుడు అని మీకు తెలుసా
IIFAUtsavam2024 : రానా దగ్గుబాటి బహుముఖ ప్రతిభావంతుడిగా తన ఖ్యాతిని పదిలపరుచుకుంటూ, అనేక ప్రతిష్టాత్మకమైన ప్రసంశలు పొందుతూనే ఉన్నాడు. ప్రముఖ నిర్మాత డాక్టర్ డి. రామానాయుడు మనుమడిగా, ప్రముఖ నిర్మాత సురేష్ బాబు కుమారుడిగా, ప్రముఖ హీరో విక్టరీ వెంకటేష్ అన్న కుమారుడిడు అని కాకుండా రానా దగ్గుబాటి ఆయన కంటూ ప్రత్యేకమైన ఇమేజ్ సొంతం చేసుకున్నాడు.
బలమైన సినీ పరిశ్రమ బ్యాక్ గ్రౌండ్ నుంచి వచ్చిన రానా దగ్గుబాటి అతి తక్కువ కాలంలోనే విలక్షణ నటుడిగా ఆయనకంటూ ప్రత్యేకతమైన గుర్తింపు తెచ్చుకున్నాడు. హీరోగానే కాకుండా బహుబలి-1, బాహుబలి-2, భీమ్లా నాయక్ లాంటి సినిమాలతో తనలో మంచి నటుడు ఉన్నాడని నిరూపించుకున్నారు. రానా దగ్గుబాటి ఆయన పరిధిలో నటిస్తూనే ఆకట్టుకునే నటనతో అనేకమంది ప్రముఖుల దగ్గర ప్రశంసలు పొందారు.

ఇప్పటికే రానా దగ్గుబాటి నటుడిగా అనేక విశిష్ట అవార్డులను సొంతం చేసుకున్నారు.
68వ ఫిలింఫేర్ అవార్డ్స్ సౌత్ (తెలుగు) 2023లో రానా దగ్గుబాటి భీమ్లా నాయక్ లో తన అద్భుతమైన నటనకు గానూ సపోర్టింగ్ రోల్ (పురుషుడు)లో ఉత్తమ నటుడిగా అవార్డు సొంతం చేసుకున్నాడు. శక్తివంతమైన, చిరస్మరణీయమైన పాత్రలు పోషిస్తూ నటుడిగా ఆయన చూపిస్తున్న ప్రతిభను ఆ సామర్థ్యాన్ని హైలైట్ చేస్తుంది.
రానా దగ్గుబాటి యొక్క ప్రతిభ నేటి సాంప్రదాయ సినిమాలకు మించి విస్తరించింది. స్ట్రీమింగ్ అకాడమీ అవార్డ్స్‌లో రానా దగ్గుబాటి ఆయన విజయానికి నిదర్శనం. రానా దగ్గుబాటి వెబ్ సిరీస్ 'రానా నాయుడు'లో తన పాత్రకు ఉత్తమ నటుడు అవార్డు (సిరీస్ పురుషుడు హిందీ) అందుకున్నాడు. ఈ అవార్డు ఓటీటీ స్పేస్‌లో రానా దగ్గుబాటి విజయవంతమైన అరంగేట్రం. రామానాయుడుతో తన నటనకు ఇండియా టెలివిజన్ స్ట్రీమింగ్‌లో ఉత్తమ నటుడిగా రానా దగ్గుబాట ఎంపికయ్యాడు.

తన విజయాలను ప్రతిబింబిస్తూ రానా దగ్గుబాటి ఇలా వ్యాఖ్యానించాడు, నెట్‌ఫ్లిక్స్‌లో నా తొలి సిరీస్ రానా నాయుడులో నా పాత్రకు ఈ అవార్డును అందుకోవడం చాలా సంతోషంగా ఉందని అన్నారు. ప్రతి కొత్త ప్రాజెక్ట్, వెంచర్ ప్రభావవంతమైన, అర్ధవంతమైన పనిని రూపొందించడానికి నా ప్రయాణంలో ఒక అడుగు ముందుకు వేస్తుందని అన్నారు. ఎంటర్‌టైనర్‌గా, కథకుడిగా నేను హద్దులు దాటి ప్రేక్షకులకు బాగా నచ్చే కథలను అందించడానికి అంకితభావంతో ఉన్నానని రానా దగ్గుబాటి అంటున్నారు.
ఎంటర్‌టైన్‌మెంట్‌లో రంగంలో కొత్త ప్రమాణాలను నెలకొల్పడానికి ప్రతి అవార్డు నాకు శక్తినిస్తుందని రానా దగ్గుబాటి వివరించారు.
షో హోస్ట్‌గా రానా దగ్గుబాటి ప్రజాదరణ రోజురోజుకు పెరుగుతూనే ఉంది. ఈ సెప్టెంబర్‌లో అబుదాబిలో ప్రతిష్టాత్మకమైన IIFA ఉత్సవ్ అవార్డ్స్ 2024ని రానా దగ్గుబాటి హోస్ట్ చేయబోతున్నాడు. రానా దగ్గుబాటి తన ప్రతిభతో ప్రపంచంలో ఆయన గుర్తింపును, తెలుగు సినీ పరిశ్రమను మరింత హైలైట్ చేస్తుంది.
తన నటనా విజయాలతో పాటు రానా దగ్గుబాటి ఆయన తాత, నాన్న అడుగుజాడాల్లో చిత్రనిర్మాతగా అర్ధవంతమైన సినిమాలు నిర్మించడానికి ఓ ఫ్లాట్ ఫామ్ నిర్మించుకున్నారు
విలక్షణ నటుడు, హీరో దగ్గుబాటి రానా ఇపపటికే C/O కంచరపాలెం, గార్గి, చార్లీ 777, పరేషాన్, కృష్ణ అండ్ హిస్ లీల వంటి కల్ట్ క్లాసిక్‌లతో సహా విజయవంతమైన చిత్రాలను నిర్మించి మంచి నిర్మాతగా గుర్తింపు తెచ్చుకున్నారు. రాణా దగ్గుబాటి సమర్పణలో 35-చిన్న కథ కాదు అనే సినిమా ఆగస్ట్ 15వ తేదీన విడుదల కానుంది. ఇది రానా అభిమానులకు మరో ఆకర్షణీయమైన అనుభవాన్ని అందిస్తుంది.
అంతేకాకుండా రానా సరికొత్త టాక్ షో త్వరలో అమెజాన్ ప్రైమ్‌లో ప్రీమియర్‌ని ప్రదర్శించడానికి సిద్దంగా ఉంది.



Click it and Unblock the Notifications
