Latest Updates
-
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.!
హైదరాబాద్ లో భారీ వర్షం..ఆరెంజ్ అలర్ట్ జారీ..మరో 5 రోజులు
తెలంగాణ రాజధాని హైదరాబాద్ లో గురువారం ఉదయం నుంచి భారీ వర్ష కురుస్తోంది. భారీ వర్షం కారణంగా లోతట్టు ప్రాంతాలు జలమయ్యమయ్యాయి. బుధవారం రాత్రి నుంచి మబ్బులు కమ్ముకొని చల్లబడిన వాతావరం ఇవాళ ఉదయం వర్షంతో మరింత చల్లబడింది. బంజారాహిల్స్, ఫిలింనగర్, గోల్కొండ, టోలీచౌకీ, షేక్ పేట,సికింద్రాబాద్, అల్వాల్, జూబ్లీహిల్స్ సహా పలు ఏరియాలో వర్షం పడుతోంది. భారీ వర్షం హైదరాబాద్ లో పడే ఛాన్స్ ఉన్నట్లు వాతావరణ శాఖ ఇప్పటికే అలర్ట్ జారీ చేసింది. లోతట్టు ప్రజల ప్రాంతాల ప్రజలు అలర్ట్ గా ఉండాలని సూచించింది.
అత్యవసరం అయితే తప్ప ఇళ్ల నుంచి బయటకు వెళ్లొద్దని వాతావరణశాఖ సూచించింది. భారీ వర్షం నేపథ్యంలో జీహెచ్ఎంసీ సిబ్బంది కూడా అప్రమత్తమయ్యారు. మరవైపు, పలు ఏరియాల్లో రోడ్లపై కూడా నీరు ప్రవహిస్తుండటంతో ట్రాఫిక్ కు అంతరాయం ఏర్పడింది. రోడ్లపై నిలిచిపోయిన నీళ్లను జీహెచ్ఎంసీ సిబ్బంది బయటకు తోడేస్తున్నారు. మ్యాన్ హోల్స్, నాలాల దగ్గర జాగ్రత్తగా వెళ్లాలని సూచించింది.

భారీ వర్షం కారణంగా..గత కొద్ది రోజుల నుంచి మండే ఎండలతో అల్లాడుతున్న హైదరాబాద్ వాసులకు స్పల్ప ఊరట లభించింది. కాగా,నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం కారణంగానే ఈ వర్షాలు పడుతున్నట్లు వాతావరణ శాఖ చెప్పింది. తెలంగాణ రాష్ట్రంలోని 12 జిల్లాల్లో రెడ్ అలర్ట్, మిగిలిన జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. పలుచోట్ల ఉరుములు,మెరుపులతో కూడిన వర్షం పడే ఛాన్స్ ఉందని వాతావరణశాఖ తెలిపింది.
పొరుగు రాష్ట్రం ఏపీలో కూడా తేలిక నుంచి మోస్తరు వర్షాలు పడతాయని..పలు చోట్ల ఉరుములు,మెరుపులతో కూడిన వర్షం పడే అవకాశమున్నట్లు తెలిపింది.



Click it and Unblock the Notifications