Latest Updates
-
తమిళుల ఆరోగ్య రహస్యం.. ప్రొటీన్, ఫైబర్ పుష్కలంగా ఉండే తంజావూర్ అడై.. ఒక్కటి తిన్నా చాలు.! -
లాభ దృష్టి యోగం: సెప్టెంబర్ 15 తర్వాత ఈ నాలుగు రాశుల ఇళ్లలో ధనలక్ష్మి తిష్ట! -
కొవిడ్ ఇచ్చిన కిక్.. డిగ్రీ పట్టా లేదు, వ్యాపారం కాదు.. కానీ 20 ఏళ్లకే నెలకు రూ. లక్షల్లో ఆదాయం.! -
పచ్చిమిర్చి ఊరగాయ ఇలా చేస్తే..ఒక్క ముద్ద తినేవాళ్లు నాలుగు ముద్దలు లాగించేస్తారు! -
కౌమార దశలో బాలికలు ఎదుర్కొంటున్న అతి పెద్ద సమస్య ఏంటో తెలుసా.? -
చికెన్ బిర్యానీ తిన్నా షుగర్, బరువు పెరగకుండా ఉండాలంటే ఇలా చేయండి! -
డా. మంతెన ఆరోగ్య చిట్కాలు.. అన్ని విటమిన్లనూ ఒకే కప్పులో అందించే ప్రకృతి రహస్యం ఇదే.! -
రాత్రి అన్నం మిగిలితే ఇలా ఊతప్పం చేయండి.. పిల్లలు, పెద్దలు లొట్టలేసుకుని తింటారు! -
చీర ఎత్తితే చీరేస్తారు: పంక్షన్లలోనే కాదు.. రైళ్లలోనూ హిజ్రాల బీభత్సం! -
ఉదయాన్నే ఒక కప్పు చాలు.. ఒంటి నొప్పులను తగ్గించి, పుష్టిగా బలాన్ని ఇచ్చే హెల్తీ బ్రేక్‌ఫాస్ట్.!
పైసా లేదని పెళ్లిళ్లు చేసుకోరు, కానీ పిల్లల్ని కంటారు.. ఈ వింత ఆచారం ఎక్కడో తెలుసా.?
లివింగ్ రిలేషన్‌పిష్(సహజీవనం).. ప్రస్తుత కాలంలో ఈ పదం గురించి తెలియని వారుండరు. పెళ్లి కాకుండానే యువతీయవకులు ఇష్టంగా ఒకే చోట కలిసి ఉంటారు. తమ రిలేషన్‌షిప్ వర్కౌట్ అయితే పిల్లల్ని కంటారు. లేదంటే ఎవరి దారి వారు చూసుకుంటారు. కానీ తమ గత జీవితం ఎలా ఉన్నా అర్థం చేసుకునే మనిషి దొరికితే సమాజంలో గుర్తింపు కోసం పెళ్లి అనేది తప్పనిసరిగా చేసుకుంటారు. ప్రపంచవ్యాప్తంగా ఈ పద్ధతి విస్తృతంగా ఉన్నా మన దేశానికి ఇప్పుడిప్పుడే విస్తరిస్తోంది. అయితే ఒక దేశంలోని ఒక నగరంలో మాత్రం ఇందుకు విరుద్ధం. అదేంటంటే..

మనీలాలో వింత ఆచారం
ఫిలిప్పైన్స్‌లో మనీలా(MANILA) సిటీలో ఒక వింత ఆచారం తెలుగు యూట్యూబ్ ఛానెల్ telugu yatri ద్వారా వెలుగులోకి వచ్చింది. ఈ వీడియో విపరీతంగా వైరల్ అవుతోంది. అదేంటంటే.. ఈ నగరంలో చాలా వరకు పెళ్లిళ్లు చేసుకోకుండానే పిల్లల్ని కంటున్నారు. నిండా పదహారేళ్లు లేని బాలిక కూడా ఓ బిడ్డకు తల్లయిన పరిస్థితులు చూడవచ్చు. కానీ వారు పెళ్లి చేసుకోకుండానే పిల్లల్ని కనడానికి ఇక్కడొక ఊహించని కారణం ఉంది.

సాధారణంగా పెళ్లి చేసుకోవాలంటే ఎంత ఖర్చవుతుందో తెలియనిది. మన తెలుగు రాష్ట్రాల్లో ఒక ఇంట్లో జరిగే పెళ్లి ఖర్చులే అందుకు ఉదాహరణ. ఆ ఖర్చుతో ఒక కుటుంబం లైఫ్ లాంగ్ బతకొచ్చు. వీరూ అదే ఆలోచించారేమో.. ఇంత ఖర్చు పెట్టి పెళ్లిళ్లు ఎందుకు చేసుకోవాలి, తమ దగ్గర డబ్బులు లేవని పెళ్లి చేసుకోకుండానే నచ్చిన వ్యక్తితో పిల్లల్ని కని కాపురం పెట్టేస్తున్నారు. ఈ విషయాన్ని స్వయంగా సదరు మహిళలే చెప్పడం.. వారి నిజాయతీకి నిదర్శనం..

డబ్బు లేకుంటే పెళ్లి చేసుకోవద్దా..
అయితే డబ్బులు లేనంత మాత్రాన పెళ్లి చేసుకోవద్దా అనే సందేహం మీకు రావచ్చు.. కానీ అక్కడి పరిస్థితులు చూస్తే వారు పాటించే విధానం సరైనదే అనిపిస్తుంది. ఎందుకంటే అలాంటి స్లమ్ ఏరియాను ఇంతవరకూ మీరు ఎక్కడా చూసి ఉండరు. మనీలా నగరంలోని టోండో(TONDO) ప్రాంతానికి మించిన స్లమ్ సిటీ ఆ దేశంలోనే లేదు. అలాంటి స్లమ్ సిటీని చూసిన తర్వాత మన తెలుగు రాష్ట్రాల్లో చాలా బెటర్ అని అనుకోకుండా ఉండలేరు.

మనిషి పట్టే సందుతో తలుపులు, చెక్కతో ఇళ్లు, ఒకే గదిలో కిచెన్, బెడ్‌రూమ్, బాత్‌రూమ్, దానిపైన మరొక ఫ్లోర్, ఇరుకు సందులు, ఆ సందుల్లోనే డ్రైనేజీ బీభత్సం, ఆ పక్కనే డంప్ యార్డ్, నది, బోటింగ్ ఇలా స్లమ్ అంటే ఇదా అనేలా ఆశ్చర్యానికి గురిచేస్తుంది. ఇంకా ఫిలిప్పైన్స్ జనాభాలో దాదాపు 30 శాతం పేద ప్రజలు ఇక్కడే ఉండగా.. అందులో 20 లక్షల మంది ఈ టోండో ప్రాంతంలోనే ఉండటం ఆశ్చర్యకరం.

జీవన విధానం
మరి ఇంత స్లమ్ ఏరియాలో వీరు ఎలా జీవిస్తారు, రోజులు ఎలా గడుస్తాయని అనుకోవచ్చు. వారి జీవన విధానానికి కావాల్సిన పనులు కూడా ఆ స్లమ్‌లోనే ఉన్నాయి. నగరం నుంచి తీసుకొచ్చిన బట్టలు లాండ్రీకి వేయడం, బైక్ రిపేర్ వర్క్స్, చికెన్ స్నాక్స్, కోళ్ల వ్యాపారం, చిన్న చిన్న దుకాణాలు ఇలా చాలానే ఉన్నాయి. వీటితోనే వారు రోజులు గడుపుతుంటారు.
విపరీతమైన వేడి
ఇక, వాతావరణం విషయానికొస్తే టోండో నగరంలో విపరీతంగా వేడి ఉంటుంది. అందుకే అక్కడ పురుషులు, చిన్న పిల్లలు ఎక్కువగా పైన షర్ట్ లేకుండానే తిరుగుతారు. ఇక పిల్లలకి కాలక్షేపం కోసం కంప్యూటర్ గేమ్‌లు, బాస్కెట్ కోర్టు వంటివి కూడా ఉన్నాయి. అంతేకాకుండా వైద్యం కోసం ప్రభుత్వ ఆస్పత్రులు ఉన్నాయి. అయితే ఇక్కడి పిల్లలు రోజు విడిచి రోజు స్కూల్‌కి వెళ్తుంటారు. ఎక్కువ మంది పిల్లలు ఉండటంతో సరిపడా సౌకర్యాలు లేక సగం మంది పిల్లలు ఒకరోజు, మిగతా సగం మరుసటి రోజు స్కూల్‌కి వెళ్తారని అక్కడి ప్రజలు చెబుతున్నారు. అయితే ఎంత దుర్భర జీవితం గడుపున్నా.. చిన్నారుల్లో, పెద్దల ముఖాల్లో ఎప్పుడు నవ్వులు చిందిస్తూ ఉండటం వారి ఆత్మస్థైర్యానికి నిదర్శనం.



Click it and Unblock the Notifications
