Latest Updates
-
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.! -
నీచ భంగ రాజయోగం: కర్కాటకంలోకి కుజ సంచారంతో ఈ రాశుల వారికి దరిద్రం వదిలిపోతుంది.! -
అమ్మ జన్మనిస్తే, గురువు జీవితాన్ని ఇస్తాడు.. టీచర్స్ డే స్పెషల్ వాట్సాప్ స్టేటస్, బెస్ట్ విషెస్ ఇవే!
ప్రపంచ వంటకాల జాబితాలో భారత్‌కు 5వ స్థానం, హైదరాబాదీ బిర్యానీకి ఎన్నో స్థానమో తెలుసా?
ప్రపంచంలోని అత్యుత్తమ వంటకాల జాబితాలో ఇటాలియన్ వంటకాలు అగ్రస్థానంలో నిలిచాయి. తర్వాత గ్రీక్ వంటకాలు రెండో స్థానంలో, స్పానిష్ వంటకాలు 3వ ప్లేస్‌లో, జపనీస్ వంటకాలు 4వ స్థానం దక్కించుకున్నాయి
2022 సంవత్సరంలో ప్రపంచంలోని అత్యుత్తమ వంటకాల జాబితాలో భారత్ 5వ స్థానంలో నిలిచింది. ఇటలీ మొదటి స్థానంలో ఉంది. ప్రేక్షకుల ఓట్లు, రేటింగ్ ఆధారంగా టేస్ట్ అట్లాస్ ఈ జాబితా తయారు చేసింది. ఇందులో భారత్‌కు 4.54 పాయింట్లు వచ్చాయి. గరం మసాలా, నెయ్యి, మలై, బటర్ గార్లిక్ నాన్, కీమా సహా మరో 460 వంటకాలను భారతదేశంలోని అత్యుత్తమ రేటింగ్ పొందిన ఆహారాలుగా టేస్ట్ అట్లాస్ సంస్థ పేర్కొంది.

ప్రపంచంలోని అత్యుత్తమ వంటకాల జాబితాలో ఇటాలియన్ వంటకాలు అగ్రస్థానంలో నిలిచాయి. తర్వాత గ్రీక్ వంటకాలు రెండో స్థానంలో, స్పానిష్ వంటకాలు 3వ ప్లేస్‌లో, జపనీస్ వంటకాలు 4వ స్థానం దక్కించుకున్నాయి
ఆశ్చర్యకరంగా ఈ జాబితాలో చైనీస్ వంటకాలు 11వ స్థానంలో నిలవగా, థాయ్‌లాండ్ ౩౦వ స్థానంలో నిలిచినట్లు టేస్ట్ అట్లాస్ జాబితా పేర్కొంది.
ప్రపంచంలోని అత్యుత్తమ సాంప్రదాయ వంటకాలల్లో భారత్‌కు చెందిన షాహీ పనీర్ టాప్ 50 ర్యాంకింగ్‌లో 28వ స్థానం సాధించింది. ఈ జాబితాలో భారతీయ వంటకం ఇదొక్కటే కావడం గమనార్హం.
షాహీ పనీర్‌కు 4.66 రేటింగ్:
దేశ రాజధాని దిల్లీలోని కేక్ డా హోటల్‌కు చెందిన షాహీ పనీర్‌కు టేస్ట్ అట్లాస్‌లో ప్రపంచంలోని అత్యుత్తమ వంటకాల్లో 5కి 4.66 స్టార్లను అందుకుంది. మొఘల్ వంటకాల నుండి వచ్చిన వంటకమే ఈ షాహీ పనీర్. దీనిని పనీర్, ఉల్లిపాయలు, బాదం పేస్టు, టొమాటో, క్రీమ్ సాస్‌తో తయారు చేస్తారు. షాహీ పనీర్ నాన్, రోటీ, పూరీ వంటి రొట్టెలు తినడానికి చాలా మంది ఇష్టపడతారు.

హైదరాబాదీ బిర్యానీకి 71వ స్థానం:
దిల్లీలోని గులాటీకి చెందిన బటర్ చికెన్ 4.56 రేటింగ్‌లతో 53వ స్థానంలో నిలిచింది. లక్నో కోర్మా ప్రపంచంలోని అత్యుత్తమ 100 సాంప్రదాయ వంటకాల్లో 55వ ర్యాంక్ సాధించింది. గోవాలని వెనైట్‌కు చెందిన విందాలూ గ్లోబల్ లిస్ట్‌లో 71 స్థానాన్ని కైవసం చేసుకోగా, హైదరాబాదీ బిర్యానీకి ఈ జాబితాలో 71వ ర్యాంక్ వచ్చింది.

భారతీయ వంటకాలకు ఉత్తమ రెస్టారెంట్‌లు:
(image: Whatshot)
టేస్ట్ అట్లాస్ ర్యాంకింగ్ ప్రకారం భారతీయ వంటకాలు ప్రయత్నించడానికి ఉత్తమ సాంప్రదాయ రెస్టారెంట్లు ఏంటంటే..
1. శ్రీ థాకర్ భోజనాలయ్ - ముంబై
2. కరవల్లి - బెంగళూరు
3. బుఖారా - దిల్లీ
4. దమ్ పుఖ్త్ - దిల్లీ
5. కొమొరిన్ - గురుగ్రామ్
6. గిరిమంజాస్ - మంగళూరు
7. కినారా ధాబా విలేజ్ - వాక్సాయ్
8. అన్న లక్ష్మీ - చెన్నై
9. మావల్లి టిఫిన్ రూమ్స్ - బెంగళూరు

ప్రపంచంలోని ఉత్తమ వంటకాలు:
(image:PanlasangPinoy)
టేస్ట్ అట్లాస్ జాబితా 2022 ప్రకారం ప్రపంచంలోని టాప్ 5 ఉత్తమ సాంప్రదాయ వంటకాలు
1. కరే - జపాన్
2. పికాన్హా - బ్రెజిల్
3. అమీజోస్ ఏ బుల్హావో పాటో - పోర్చుగల్
4. టాంగ్‌బావో - చైనా
5. గుయోటీ - చైనా

నెటిజన్లు స్పందన ఎలా ఉందంటే..
టేస్ట్ అట్లాస్ విడుదల చేసిన ఈ జాబితాపై నెటిజన్లు నుండి మిశ్రమ స్పందన లభిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా బాగా ప్రాచుర్యం పొందిన చైనీస్ వంటకాలకు 11వ స్థానం ఎలా వచ్చిందంటూ ట్విట్టర్‌లో చాలా మంది ప్రశ్నిస్తున్నారు.
అమెరికా -8, ఫ్రాన్స్ -9 వ స్థానంలో నిలవడంపైనా ప్రశ్నలు లేవనెత్తుతున్నారు. అనేక థాయ్ వంటకాలు బాగా ప్రాచుర్యం పొందినప్పటికీ, థాయ్‌లాండ్ 30వ స్థానంలో ఎందుకు నిలిచిందో చెప్పాలని ప్రశ్నిస్తున్నారు.



Click it and Unblock the Notifications