Latest Updates
-
దాబా స్టైల్ బట్టర్ చికెన్ సీక్రెట్ రెసిపి..రుచి చూస్తే ఒక్కసారితో ఆగరు -
బ్లడ్ ఇన్ఫెక్షన్ అంటే ఏంటి? ఎందుకు వస్తుంది? -
గోంగూర చికెన్ పచ్చడి ఇలా చేశారంటే..దాసోహం అవ్వాల్సిందే -
నాలికకు కిక్కిచ్చే చేప వెల్లుల్లి కారం..ఇలా చేశారంటే స్వర్గానికి బెత్తెడే దూరం! -
సమంత సీక్రెట్ ఇదే..రోజూ ఉదయం అలా చేస్తే లైఫ్ జిల్ జిల్ జిగా జిగా.. -
షుగర్, బీపీకి చెక్ పెట్టే కొర్రల కిచిడీ..వారంలో 2 రోజులు తింటే బరువు తగ్గడమే కాకుండా రోజంతా సూపర్ ఎనర్జీ! -
చికెన్, మటన్ బిర్యానీలను మరిపించే స్పైసీ టమాటా బిర్యానీ..కుక్కర్ లో ఈజీగా చేసేయండిలా.. -
తులసి తీర్థం మహిమ? చనిపోయిన మహిళ బతికింది! -
రెస్టారెంట్ రుచిని మించేలా ఇంట్లోనే బిసిబేలే బాత్.. సులభంగా ఎలా చేయాలంటే? -
కరివేపాకు vs వేప ఆకు..పోషకాలు, ఆరోగ్య ప్రయోజనాల్లో ఏది బెస్ట్ అంటే..!
భారతదేశంలోనే నార్వే అందాలు.. ఈ రెండు ప్రాంతాలను చూస్తే ఫిదా అవ్వాల్సిందే!
భారతదేశం ఒక అద్భుతమైన దేశం అని మనం కాదు ప్రపంచం అంతా అంటోంది. ఇక్కడ రకరకాల మతాలు, భిన్న బాషలు, భిన్న సంప్రదాయాలు ఉన్నా..అందరూ కలిసిమెలిసి జీవించడం ఇక్కడి ప్రత్యేకత. మంచుతో కప్పబడిన ఎత్తైన కొండల దగ్గర నుంచి దట్టమైన అడవులు, బీచ్ లు, ప్రశాంతమైన బ్యాక్ వాటర్స్, పురాతన నగరాలు, అత్యంత ప్రాచీన కట్టడాలు, పెద్ద ఎడారులు ఇలా మనదేశంలోని ఒక్కో రాష్ట్రంలో ఒక్కో ప్రత్యేకతో అద్భుతైన పర్యాటక ప్రదేశాలు మనదేశంలో అనేకం ఉన్నాయి.
చాలామంది మనదేశంలోని కొన్ని ప్లేసులను ప్రపంచంలోని మిగతా దేశాల్లో ఉన్న ఫేమస్ ప్లేసులతో పోల్చుతుండటం మనం చూస్తుంటాం. మనదేశంలోని ఆ ఫ్లేస్ స్విట్జర్లాండ్ లా ఉంటుంది..ఆ ప్రాంతం న్యూజిలాండ్ లా ఉంటుంది అని పోల్చుతుండటం మనం తరచూ చూస్తుంటారు.

నార్వే దేశం ఎంత అందమైనదో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మనదేశంలో రెండు ప్రాంతాలను నార్వే దేశంలోని ఫేమస్ ఫ్జోర్డ్స్(fjords), అక్కడి సుందరమైన ప్రకృతి దృశ్యాలతో పోల్చుతుంటారు చాలామంది పర్యాటకులు. అందులో ఒకటి అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోని దిబాంగ్ వ్యాలీ, మరొకటి హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోని నార్కండ ప్రాంతం.
దిబాంగ్ వ్యాలీ, నార్కండ గురించిన ఆసక్తికర విషయాలు
-దిబాంగ్ వ్యాలీ మనదేశంలో అత్యల్ప జనసాంద్రత కలిగి ఉంది. ఇక్కడ చదరపు కిలోమీటరకు ఒకరి కంటే తక్కువ మంది నివసిస్తున్నారు. 2011 జనాభా లెక్కల ప్రకారం ఇది అత్యంత ఏకాంత ప్రాంతాలలో ఒకటిగా నిలిచింది.
-దిబాంగ్ వ్యాలీలో.. మేక జింక అని పిలువబడే అంతరించిపోతున్న పెద్ద క్షీరదాలు కనబడతాయి.
-దిబాంగ్ వ్యాలీ ఔషధ మొక్కలకు నిలయం, వాటిలో అత్యంత విలువైన కాప్టిస్ టీటా.. సాంప్రదాయకంగా జ్వరం, వివిధ వ్యాధులకు ఉపయోగించే చేదు మూలిక.
-దిబాంగ్ వ్యాలీ యోంగ్యాప్ లా వంటి ఎత్తైన పర్వత మార్గాల ద్వారా చారిత్రాత్మకంగా ఈ ప్రాంతాన్ని టిబెట్ తో అనుసంధానించిన పురాతన మార్గానికి సమీపంలో ఉంది.
-దిబాంగ్ వ్యాలీలో అనేక వాటర్ ఫాల్స్ ఉన్నాయి.
-ఇక హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోని నార్కండ సమీపంలోని ప్రఖ్యాత స్టోక్స్ ఫామ్ ప్రాంతంలో ఆపిల్ సాగు ఉంది. 20వ శతాబ్దం ప్రారంభంలో ఇక్కడ స్థిరపడిన అమెరికన్ అయిన సామ్యూల్ ఎవాన్స్ స్టోక్స్ ఆధునిక ఆపిల్ రకాన్ని ప్రవేశపెట్టి స్థానిక ఆర్థిక వ్యవస్థను మార్చాడు.
-నార్కండ వ్యూహాత్మకంగా చారిత్రాత్మక హిందూస్తాన్-టిబెట్ రోడ్ (NH-5) పై ఉంది, ఇది భారతదేశం, టిబెట్ మధ్య వాణిజ్యానికి కీలకమైన పురాతన వాణిజ్య మార్గం.
-నార్కండ ప్రాంతం సట్లెజ్ నది, బియాస్ నది పరీవాహక ప్రాంతాల మధ్య ప్రధాన పరీవాహక ప్రాంతానికి సమీపంలో ఉంది, ఇది ప్రాంతీయ నీటి ప్రవాహాన్నిహిమనదీయ కరిగే పారుదలని ప్రభావితం చేస్తుంది.



Click it and Unblock the Notifications
