Latest Updates
-
భరణం కట్టలేక లోన్ ఈఎంఐల సాకు చెబుతున్నారా? సుప్రీంకోర్టు షాకింగ్ తీర్పు ఇదే! -
సీతా నవమి 2026: దంపతులు ఈ పూజ చేస్తే వైవాహిక జీవితంలో అద్భుతమైన మార్పులు! -
వడగాల్పుల ఎండలు మండిపోతున్నాయా? మీ కుటుంబాన్ని కాపాడుకోవడానికి ఈ జాగ్రత్తలు తప్పనిసరి! -
NEET UG 2026: అడ్మిట్ కార్డ్ వచ్చేస్తోంది.. పరీక్షలో విజయం సాధించాలంటే చాణక్యుడు చెప్పిన ఈ సూత్రాలు పాటించండి! -
నేటి గ్రహాల సంచారం: సూర్య-చంద్రుల కలయికతో ఈ రాశుల వారికి అదృష్టం పండబోతోంది! -
పుష్య నక్షత్రం, అమృత కాలం కలయిక.. ఈ రాశుల వారికి ఇక తిరుగులేదు! -
స్టవ్ తో పనేలేదు,ఎండ ఉంటే చాలు..వాడిపోయిన నిమ్మకాయలతో అదిరిపోయే ఊరగాయ..పెరుగన్నం,పప్పులోకి కేక -
రాజస్థానీ స్పెషల్ గులాబ్ జామున్ కర్రీ..గిన్నెలు లేపాల్సిందే! -
ఎండలు మండిపోతున్నాయి! వడదెబ్బ తగలకుండా ఉండాలంటే ఈ సైన్స్ ఆధారిత హైడ్రేషన్ ప్లాన్ మీకోసం -
మోహినీ ఏకాదశి వ్రతం చేస్తున్నారా? మీరు తెలియక చేసే ఈ చిన్న తప్పులే ఫలితాన్ని దూరం చేస్తున్నాయా?
Google Search 2024: 2024లో గూగుల్ లో ఇండియన్స్ ఎక్కువగా వెతికింది ఇవే
కొత్త ఏడాదికి మరికొన్ని రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయి. ఎన్నో అంచనాలు, ప్రాణాళికలతో కొత్త ఏడాది 2025ను ప్రారంభించడానికి అందరూ ఇప్పటినుంచే ఫ్లాన్స్ వేస్తున్నారు. అయితే 2024 ప్రపంచ చరిత్రలో మర్చిపోలేని ఏడాదిగా మిగిలిపోతుందనడంలో ఎలాంటి సందేహం అక్కర్లేదు. దీనికి కారణం ప్రపంచవ్యాప్తంగా జరిగిన పరిణామాలే. ఎక్కడ చూసినా యుద్ధాలు, మరణాలు, కొన్ని దేశాల్లో రాజకీయ అనిశ్చితి, దేశ ప్రధానులు,అధ్యక్షులు సైతం పారిపోవాల్సిన పరిస్థితి ఇలా చెప్పుకుంటూ పోతే ఈ ఏడాది మానవాళికి దారుణంగానే గడిచిందనే చెప్పవచ్చు.
ఏడాది ముగింపు సమయంలో చాలామంది ఈ ఏడాది గూగుల్ లో ఎక్కువగా దేనికోసం సెర్చ్ చేశారు అని తెలుసుకోవాలని ఆరాటపడుతుంటారు. కాబట్టి 2024 జనవరి నుంచి డిసెంబర్ వరకు భారతీయులు గూగుల్ లో ఎక్కువగా దేనికోసం వెతికారో ఆ లిస్ట్ ను గూగుల్ కంపెనీ తాజాగా విడుదల చేసింది. 2024లో భారత్ లో మోస్ట్ సెర్చ్డ్ కీవర్డ్స్ ఏవో ఇప్పుడు చూద్దాం.

2024లో గూగుల్ లో భారతీయులు ఎక్కువగా వెతికింది వీటినే
గూగుల్ రిలీజ్ చేసిన లిస్ట్ లో ఫస్ట్ ప్లేస్, సెకండ్ ప్లేస్ లో క్రికెట్ ఉంది. భారతీయులు గూగుల్ లో ఎక్కువగా వెతికిన మొదటి పదం ఇండియన్ ప్రీమియర్ లీగ్(IPL)కాగా,రెండో పదం టీ 20 వరల్డ్ కప్(T20 Worldcup),తర్వాత స్థానంలో భారతీయ జనతా పార్టీ,2024 ఎన్నికల ఫలితాలు ఉన్నాయి. టాప్ 5 ప్లేస్ లో 2024 ఒలింపిక్స్ ఉంది.
ఐపీఎల్ 2024
ఈ ఏడాది మార్చి 22 నుండి మే 26 వరకు ఇండియన్ ప్రీమియర్ లీగ్(IPL)టోర్నమెంట్ జరిగింది.మనదేశంలోని 13 రాష్ట్రాల్లో టోర్నోలో భాగంగా మొత్తంగా 74 మ్యాచ్ లు జరిగాయి. ఈ టోర్నమెంట్ లో ఫైనల్ మ్యాచ్ లో హైదరాబాద్ సన్ రైజర్స్ పై 8 వికెట్ల తేడాతో కోల్ కతా నైట్ రైడర్స్ విజయం సాధించింది.
T20 వరల్డ్ కప్ 2024
అమెరికా,వెస్ట్ ఇండీస్ దేశాల్లో ఈ ఏడాది జూన్ 1 నుంచి జూన్ 29 వరకు ఐసీసీ మెన్స్ టీ 20 వరల్డ్ కప్ టోర్నమెంట్ జరిగింది. ఈ టోర్నమెంట్ లో మొత్తం 20 దేశాల నుంచి జట్టులు పాల్గొనగా కప్ ని భారత్ గెల్చుకుంది. ఫైనల్ మ్చాచ్ లో దక్షిణాఫ్రికాను ఓడించి భారత్ టీ 20 వరల్డ్ కప్ గెల్చుకుంది.
భారతీయ జనాతా పార్టీ
ప్రస్తుతం మనదేశంలో అనేక రాష్ట్రాల్లో అధికారంలో ఉంది బీజేపీ. అంతేకాకుండా ఎక్కడ ఎన్నికలు జరిగినా అక్కడ విజయదుంధుభి మోగిస్తూ దూసుకెళ్లింది. ఈ ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ప్రభుత్వ ఏర్పాటుకి తగినంత మెజార్టీని సాధించకపోయినప్పటికీ మిత్రపక్షాలతో కలిసి వరుసగా మూడోసారి కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ముఖ్యంగా జూన్2-8 తేదీల మధ్యలో 'Bharatiya Janata party'కీవర్డ్ గూగుల్ లో భారత్ లో ఎక్కువగా సెర్చ్ చేయబడింది. దీనికి కారణం ఆ సమయంలో పార్లమెంట్ ఎన్నికల ఫలితాలతో పాటు ఏపీ ఎన్నికల ఫలితాలు కూడా ఉండటమే.
2024 ఎన్నికల ఫలితాలు
ఈ ఏడాదిలో పార్లమెంట్ ఎన్నికలతో పాటు ఆంధ్రప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్, హర్యానా, మహారాష్ట్ర, జార్ఖండ్, జమ్మూకశ్మీర్ సహా పలు రాష్ట్రాల్లో అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరిగాయి. ఈ ఫలితాల కోసం ఆశక్తిగా ఎదురుచూసే క్రమంలో ప్రజలు 2024 election results అనే కీవర్డ్ ని గూగుల్ లో ఎక్కువగా వెతికారు మనోళ్లు.
ఒలింపిక్స్ 2024
ఈ ఏడాది జులై 26 నుంచి ఆగస్టు 11 వరకు ఫ్రాన్స్ రాజధాని పారిస్ లో ఒలింపిక్స్ గేమ్స్ జరిగాయి. భారత్ 1 రజతం, 5 కాంస్యాలతో కలిపి మెత్తం 6 మెడల్స్ ని గెల్చుకుంది.



Click it and Unblock the Notifications