Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
బంపరాఫర్.. కేవలం రూ.1299కే ఫ్లైట్ టిక్కెట్..విదేశాలకు కూడా!..ఎలా బుక్ చేసుకోవాలంటే..
విమాన ప్రయాణం చేయాలని చాలామందికి కోరిక ఉంటుంది కానీ టిక్కెట్ ధర ఎక్కువలే అని వెనకడుగు వేస్తుంటారు. అయితే అప్పుడప్పుడు విమానయాన కంపెనీలు ఆఫర్లు ప్రకటిస్తుంటారు. ఆ సమయంలో అతిక్కువ ధరలోనే ఫ్లైట్ టిక్కెట్ ను బుక్ చేసుకోవచ్చు. అలాంటి పమయం ఇప్పుుడ వచ్చింది. మీ కలలను నిజం చేయడానికి ప్రముఖ విమానయాన సంస్థ ఇండిగో ఒక సువర్ణావకాశాన్ని అందిస్తోంది. ప్రయాణికులను ఆకర్షించేందుకు గ్రాండ్ రన్ వే ఫెస్ట్ పేరుతో ఒక భారీ ఆఫర్ ప్రకటించింది. ఈ ఆఫర్ లో భాగంగా, దేశీయ, అంతర్జాతీయ విమాన టిక్కెట్లను ఊహించని తక్కువ ధరలకే సొంతం చేసుకోవచ్చు. దేశీయ విమాన టిక్కెట్లు రూ.1,299 నుండి ప్రారంభమవుతాయి. అంతర్జాతీయ ప్రయాణానికి అంతర్జాతీయ టిక్కెట్లు రూ.4,599 నుండి ప్రారంభమవుతాయి.
బుకింగ్ వివరాలను తెలుసుకోండి
ఇండిగో గ్రౌండ్ రన్ వే ఫెస్ట్ ఆఫర్ ఇప్పటికే ప్రారంభమైంది. కంపెనీ ఈ ఆఫర్ ను సెప్టెంబర్ 15న ప్రారంభించగా.. సెప్టెంబర్ 21 వరకు కొనసాగుతుంది.
వెబ్ సైట్: ఇండిగో అధికారిక వెబ్‌సైట్ goindigo.inని సందర్శించి బుక్ చేసుకోవచ్చు.
మొబైల్ యాప్: మీ స్మార్ట్ ఫోన్ లోని ఇండిగో మొబైల్ యాప్ ద్వారా సులభంగా టిక్కెట్లు బుక్ చేయవచ్చు.
వాట్సాప్: టిక్కెట్లను బుక్ చేసుకోవడానికి ఇండిగో ఇప్పుడు వాట్సాప్ సేవలను కూడా అందిస్తోంది. +91 7065145858 నంబర్‌కు వాట్సాప్ చేయడం ద్వారా కూడా బుకింగ్ పూర్తిచేయవచ్చు.
ఈ ఆఫర్‌లో బుక్ చేసుకున్న టిక్కెట్లపై వచ్చే ఏడాది జనవరి 7 నుండి మార్చి 31, 2025 మధ్య ప్రయాణించవచ్చు. ముఖ్యంగా, హోలీ, నవరాత్రి, రామ నవమి వంటి ముఖ్యమైన పండుగల సమయంలో కూడా ఈ ఆఫర్ వర్తిస్తుంది. కాబట్టి, ముందస్తుగా మీ ప్రయాణాలను ప్లాన్ చేసుకుని, తక్కువ ధరలకే టిక్కెట్లు పొందండి.

ప్రయాణ తేదీలు?
గ్రాండ్ రన్ వే ఫెస్ట్ కోసం టిక్కెట్లు బుక్ చేసుకునే కస్టమర్లు జనవరి, మార్చి మధ్య ప్రయాణానికి అర్హులు. ఈ ఆఫర్ కింద టిక్కెట్లు జనవరి 7 మరియు మార్చి 31 మధ్య చెల్లుబాటు అవుతాయి. హోలీ, నవరాత్రి, రామ నవమి సమయంలో ఈ ఆఫర్ ను పొందవచ్చు.
టికెట్ ధర ఇలా ఉంటుంది
ఎయిర్ లైన్ అధికారిక వెబ్ సైట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం.. ఈ ఆఫర్ ఎకానమీ క్లాస్‌లో దేశీయ విమానాలకు వన్ వే అన్నీ కలిసిన ఛార్జీలను రూ.1,299కి తీసుకురాగలదు. వన్ వే అన్నీ కలిసిన బిజినెస్ క్లాస్ టిక్కెట్లు రూ.9,999 నుండి ప్రారంభమవుతాయి.
వీరికి డబుల్ డిస్కౌంట్ లభిస్తుంది
ఇండిగో రన్‌వే ఫెస్ట్ ఆఫర్ తర్వాత కూడా బ్లూ చిప్ సభ్యులకు రెండు డిస్కౌంట్లు లభిస్తాయి. ఈ సభ్యులు 10శాతం తగ్గింపుతో పాటు, 10శాతం తగ్గింపుతో రన్ వే ఫెస్ట్ టిక్కెట్లను బుక్ చేసుకోగలరు. కూపన్ కోడ్ ను ఎంపిక చేసిన దేశీయ, అంతర్జాతీయ విమానాలకు కూడా వర్తింపజేయవచ్చు. బ్లూ 3 కేటగిరీలోని వారికి 5శాతం తగ్గింపు, బ్లూ 2 సభ్యులకు 8శాతం తగ్గింపు,బ్లూ 1 సభ్యులకు 10శాతం తగ్గింపు లభిస్తుంది.



Click it and Unblock the Notifications