Latest Updates
-
షుగర్, బీపీకి చెక్ పెట్టే కొర్రల కిచిడీ..వారంలో 2 రోజులు తింటే బరువు తగ్గడమే కాకుండా రోజంతా సూపర్ ఎనర్జీ! -
చికెన్, మటన్ బిర్యానీలను మరిపించే స్పైసీ టమాటా బిర్యానీ..కుక్కర్ లో ఈజీగా చేసేయండిలా.. -
తులసి తీర్థం మహిమ? చనిపోయిన మహిళ బతికింది! -
రెస్టారెంట్ రుచిని మించేలా ఇంట్లోనే బిసిబేలే బాత్.. సులభంగా ఎలా చేయాలంటే? -
కరివేపాకు vs వేప ఆకు..పోషకాలు, ఆరోగ్య ప్రయోజనాల్లో ఏది బెస్ట్ అంటే..! -
నవరాత్రి స్పెషల్: రుచితో పాటు ఆరోగ్యం.. జీర్ణశక్తిని పెంచే అద్భుతమైన తమలపాకు కేసరి ప్రసాదం -
నోరూరించే ఆమ్లెట్ పులుసు.. పుల్లపుల్లగా, కారంకారంగా రుచి అదరహో! -
దీపావళికి ముందే ధ్వజ యోగం.. ఈ 4 రాశుల జాతకులు కోటీశ్వరులు కావడం ఖాయమా? -
నల్ల పాలు తాగుతున్న తెలుగు హీరోయిన్..ప్రయోజనాలేంటో,ఎలా చేసుకోవాలో తెలుసా? -
మటన్ సాంబార్ వండేటప్పుడు ఈ మసాలా పడితే ఆ రుచే వేరు..రాగి సంగటి, చపాతీ,అన్నంలోకి కేక
Indonesia Volcano Eruption: ఇండోనేషియాలో బద్దలైన అగ్నిపర్వతం, బూడిదతో ఎలాంటి ఆరోగ్య సమస్యలు వస్తాయో తెలుసా?
అగ్నిపర్వతం బద్ధలు అయితే అందులో నుండి అనేక రకాల వాయువులు వెలువడతాయి. శిలాజాలు, ఖనిజాలు లావా ద్వారా బయటకు వస్తాయి. వాయువులు, రేణువుల, బూడిద కొన్ని కిలోమీటర్ల వరకు వ్యాపిస్తాయి. ఈ దుమ్ము పీల్చినా, బూడిద శరీరంలోకి వెళ్లినా,
Indonesia Volcano Eruption: ఇటీవల భారీ భూకంపంతో అతలాకుతలం అయిన ఇండోనేషియాను మరో ప్రకృతి విపత్తు కబళించింది. మౌంట్ సెమేరు(Mount Semeru) అగ్నిపర్వతం బద్ధలైంది. ఒకటిన్నర కిలోమీటర్ల ఎత్తు వరకు లావా,బూడిద, పొగలు కమ్ముకున్నాయి. మౌంట్ సెమేరు చుట్టుపక్కల 19 కిలోమీటర్ల పరిధిలో బూడిద వ్యాపించింది.

అగ్నిపర్వతం బద్ధలు అయితే అందులో నుండి అనేక రకాల వాయువులు వెలువడతాయి. శిలాజాలు, ఖనిజాలు లావా ద్వారా బయటకు వస్తాయి. వాయువులు, రేణువుల, బూడిద కొన్ని కిలోమీటర్ల వరకు వ్యాపిస్తాయి. ఈ దుమ్ము పీల్చినా, బూడిద శరీరంలోకి వెళ్లినా, చర్మంపై పడినా అనేక రకాల ఆరోగ్య సమస్యలు వస్తాయి.
అగ్నిపర్వత బూడిదతో ఆరోగ్య సమస్యలు:
అగ్నిపర్వత బూడిదలో రాళ్లు, ఖనిజాలు, అగ్నిపర్వత గాజు ఉంటాయి. కట్టెను కాల్చితే వచ్చే బూడిద కంటే అగ్నిపర్వతం నుండి వచ్చే బూడిద కఠినంగా ఉంటుంది. అంటే కట్టే నుండి వచ్చే బూడిదలో నీటిలో కరుగుతుంది. అగ్నిపర్వతం నుండి వచ్చే బూడిదలో నీటిలో కరగదు. ఇది ఇసుక రేణువుల్లా ఉంటుంది. అయితే అగ్నిపర్వత బూడిదలోనూ మరీ మెత్తని బూడిద కూడా ఉంటుంది.
అగ్నిపర్వతం నుండి చాలా బలంగా లావా విస్ఫోటనం చెందుతుంది. దీని కొన్ని కిలోమీటర్ల ఎత్తువరకు వెళ్తుంది. అలాగే దీని వల్ల ఏర్పడిన బూడిద, పొగ మేఘాలు పదుల కిలోమీటర్ల వరకు ఏర్పడతాయి. అగ్నిపర్వత బూడిదలోని చిన్న కణాలు గాలి ద్వారా వేలాది కిలోమీటర్ల వరకు వ్యాపిస్తాయి. 2008 చిలీలోని బద్ధలైన అగ్నిపర్వతం బూడిద వెయ్యి కిలోమీటర్ల దూరంలోని అర్జెంటీనాకు ఎగిసి, అట్లాంటిక్, పసిఫిక్ తీరాలకు చేరుకున్నట్లు పరిశోధకులు గుర్తించారు.
అగ్నిపర్వతం బూడిదలో చాలా రకాల వాయువులు ఉంటాయి.
* బొగ్గుపులుసు వాయువు
* సల్ఫేట్లు(సల్ఫర్ డయాక్సైడ్)
* హైడ్రోక్లోరిక్ ఆమ్లం
* హైడ్రోఫ్లోరిక్ ఆమ్లం
మానవ ఆరోగ్యంపై ప్రభావాలు:
అగ్నిపర్వతం నుండి వెలువడిన బూడిద పీలిస్తే అనేక రకాల ఆరోగ్య సమస్యలు వస్తాయి. హానికరమన ఏరోసోల్స్, విషపూరిత వాయువుల కారణంగా ఏర్పడిన బూడిదను పీల్చడం వల్ల ఊపిరితిత్తుల్లో సమస్యలు వస్తాయి. శ్వాసకోశ సమస్యలు, కంటి సమస్యలు, చర్మ సమస్యలు తలెత్తుతాయి.
1. శ్వాసకోశ సమస్యలు
* ముక్కు కారడం
* గొంతు నొప్పి
* దగ్గు
* ఊపిరి ఆడకపోవడం
* బ్రోన్కైటస్
2. కంటి సమస్యలు
* దురద
* రక్తస్రావం
* కార్నియల్ సమస్యలు, స్క్రాచెస్
* కండ్లకలక
* కన్నీళ్లు
అగ్నిపర్వతం బూడిదను పీల్చడం వల్ల సిలికోసిస్ వ్యాధి రావొచ్చు. సిలికోసిస్ అనేది ఊపిరితిత్తులకు సంబంధించిన వ్యాధి. ఊపిరితిత్తుల్లో, శ్వాస మార్గాల్లో సిలికా పేరుకుపోతే ఈ సిలికోసిస్ సమస్య వస్తుంది. దీని వల్ల శ్వాస తీసుకోవడం ఇబ్బందిగా ఉంటుంది. సరైన చికిత్స చేయకపోతే ప్రాణాలు కూడా పోవచ్చు.
సిలికోసిస్ వ్యాధికి కారణం అయ్యే ఖనిజ క్వార్జ్స్, క్రిస్టోబలైట్, ట్రైడైమైట్ అగ్నిపర్వత బూడిదలోనూ ఉంటాయి.
అగ్నిపర్వతాల నుండి వెలువడిన బూడిద చెరువులు, నదులు, కాల్వలు, సముద్రాల నీటిని కలుషితం చేస్తాయి. ఈ నీటిని తాగిన వారిలో ఆరోగ్య సమస్యలు వస్తాయి.
అగ్నిపర్వత బూడిద నుండి రక్షణ ఎలా:
* రక్షిత దుస్తులు, గాగుల్స్, డస్ట్ మాస్కులు ధరించాలి.
* ఇంట్లోకి బూడిద రాకుండా కిటికీలు, తలుపులు బిగించుకోవాలి.
* అగ్నిపర్వత ప్రభావిత ప్రాంతం నుండి దూరంగా వెళ్లడం ఉత్తమం.
* ఒకవేళ ఇంట్లో, ఇంటి పరిసరాల్లో బూడిద పేరుకుపోతే దానిపై నీళ్లు స్ప్రే చేసి తడి చేయాలి. ఇలా చేయడం వల్ల బూడిద గాలికి పైకి లేవకుండా అక్కడే ఉంటుంది. అప్పుడు శుభ్రం చేయడం సులభం అవుతుంది.
* అగ్ని ప్రమాదాలు సంభవించిన ప్రాంతాల్లో రోడ్డుపైకి వెళ్లకపోవడం మంచిది. అంతటా బూడిద పేరుకుపోవడం వల్ల ఎదుట ఎవరు ఉన్నారో కూడా తెలియని విధంగా బూడిద కమ్మేస్తుంది. దీని వల్ల ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉన్నాయి.



Click it and Unblock the Notifications
