Latest Updates
-
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.! -
నీచ భంగ రాజయోగం: కర్కాటకంలోకి కుజ సంచారంతో ఈ రాశుల వారికి దరిద్రం వదిలిపోతుంది.! -
అమ్మ జన్మనిస్తే, గురువు జీవితాన్ని ఇస్తాడు.. టీచర్స్ డే స్పెషల్ వాట్సాప్ స్టేటస్, బెస్ట్ విషెస్ ఇవే!
బట్టతలతో నెలకు రూ. 50 వేలు..కుర్రాళ్లు ఆలోచించుకోండి
కాదేదీ కవితకు అనర్హం అన్నట్లుగా..కాదేదీ డబ్బు సంపాదనకు అనర్హం అన్నట్లుగా ప్రస్తుత పరిస్థితి మారిపోయింది. ఈ రోజుల్లో చాలామందిని వేధిస్తున్న చాలా పెద్ద సమస్య బట్టతల. మారిన లైఫ్ స్టైయిల్, ఆహారపు అలవాట్ల కారణంగా చాలామందికి చిన్నతనంలోనే బట్టతల వచ్చేస్తుంది. పెళ్లయ్యేసరికి చాలామందికి బట్టతల వస్తుంది. దీంతో కొందరు విగ్గులు, మరికొందరు హెయిర్ ట్రాన్స్ ఫ్లాంటేషన్ అని లక్షల రూపాయలు ఖర్చు పెడుతున్నారు.
అయితే తనకు బట్టతల వచ్చిందని బాధపడని ఓ వ్యక్తి మాత్రం దానిని క్యాష్ చేసుకొని వార్తల్లో నిలిచాడు. అతడే కేరళకు చెందిన ట్రావెల్ వ్లాగర్ షఫీక్ హసీం. తన బట్టతల మీద మళ్లీ వెంట్రుకలు మొలిపించే ప్రయత్నం చేయకుండా..దానిని బిల్ బోర్డ్ గా మార్చేశాడు. తన బట్ట తలను అద్భుతమైన బ్రాండింగ్ స్టంట్ గా ఉపయోగించి నెలకు రూ.50 వేలు సంపాదిస్తున్నాడు షఫీక్ హసీం.

కేరళలోని అలప్పుజా జిల్లాకు చెందిన 36 ఏళ్ల షఫీక్..కేరళ,సౌదీ అరేబియాలో పోగ్రామ్ ప్రొడ్యూసర్,డిజిటల్ కంటెంట్ క్రియేటర్ గా చేశాడు. '70 mm vlogs' పేరుతో ఓ యూట్యూబ్ ఛానెల్ రన్ చేస్తున్నాడు. షఫీక్ కి కాలేజీ వయస్సులోనే నెత్తిన జుట్టు అంతా ఊడిపోయి బట్టతల వచ్చేసింది. ఫ్రెండ్స్ అందరూ ఎగతాళి చేసినా మొదట్లో షఫీక్ దానిని పెద్దగా పట్టించుకునేవాడు కాదు. అయితే చాలామంది బాడీ షేమింగ్ చేయడంతో ఇక హెయిర్ ట్రాన్స్ ఫ్లాంట్ చేయించాల్సిందే అని రెడీ అయ్యాడు. అయితే చివర్లో మనసులో ఓ ఆలోచన వచ్చింది. బట్టతల అనేది సహజం..ఇందులో ఎలాంటి సిగ్గుపడాల్సిన అంశం లేదు..కాబట్టి నా బట్టతలను నేను ఎలా క్యాష్ చేసుకోగలను అని ఆలోచించడంతో ఓ అద్భుతమైన ఐడియా తట్టింది. తెలివితేటలు ఎక్కువ ఉన్నోళ్లకే బట్టతల వస్తుందని ఊరికే అనరుగా. వెంటనే సోషల్ మీడియాలో తన ఆలోచనను పోస్ట్ చేశాడు.
ఆ ఐడియా ఏంటంటే..తాను యూట్యూబ్ వీడియోలు చేసే సమయంలో తన బట్టతలపై కంపెనీలు తమ ప్రకటనలను టాటూ రూపంలో ఇవ్వవచ్చు. షఫీక్ సోషల్ మీడియా పోస్టు ఇటు మీడియా, అటు కార్పొరేట్ కంపెనీలను ఆకర్షించింది. కి భారీ రెస్పాన్స్ వచ్చింది. వెంటనే కొచ్చికి చెందిన ఓ హెయిర్ అండ్ స్కిన్ క్లినిక్ షఫీక్ ని కాంటాక్ట్ అయ్యింది. అతడితో ఓ ఒప్పందం కుదుర్చుకుంది. ఆ ఒప్పందం ప్రకారం ఆ కంపెనీ యాడ్ ని తన బట్టతలపై టాటూ క్లియర్ గా కనిపించేలా వేయించుకొని మూడు నెలల్లో కనీసం 3 మూడు వీడియోలు చేస్తాడు. తన బట్టతలపై ఉన్న యాడ్ ఆ వీడియో చూసేవాళ్లను ఆకర్షిస్తుంది..కెమికల్స్ తో తన బట్టతలపై తాత్కాలిక టాటూని ఈజీగా తొలగించవచ్చు..కానీ ఐడియా మాత్రం ఎప్పటికీ ఉంటుంది అని షఫీక్ చెబుతున్నాడు.
భారతదేశంలో,ప్రపంచంలోనే బట్టతలను ప్రకటనల కోసం అద్దెకు ఇచ్చిన మొదటి వ్యక్తి తానేనని తాను నమ్ముతున్నానని, ఇది వైరల్ అవడం కోసం చేసిన పని కాదని..బట్టతలపై సమాజంలో ఉన్న అభిప్రాయాన్ని మార్చడానికి, నమ్మకం ఉంటే బట్టతలను కూడా తమ బలంగా మార్చుకోవచ్చు అని చూపించే ప్రయత్నమేనని ఓ ఇంటర్వ్యూలో షఫీక్ తెలిపారు. ఇంకా పెద్ద పెద్ద కంపెనీల నుంచి తనకు ప్రకటనల ఆఫర్ వస్తుందని ఆశిస్తున్నట్లు షఫీక్ తెలిపాడు.



Click it and Unblock the Notifications