Latest Updates
-
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.!
ఆ దేశంలో శృంగారం పోటీలు.. పాల్గొనేందుకు వీరు మాత్రమే అర్హులు!
ఈ ప్రపంచంలో ఎన్నో రకాల పోటీలు ఉన్నాయి. పరుగు పందెం నుంచి షార్ట్‌పుట్ వరకు చాలా క్రీడలకు పోటీలు నిర్వహిస్తారు. ఈ పోటీలకు ఒలింపిక్స్ వంటి గొప్ప గొప్ప క్రీడా సంబరాలను సైతం నిర్వహిస్తూ ఉంటారు. అయితే శృంగారానికి కూడా పోటీలు ఉన్నాయని మీకు తెలుసా? శృంగారంపై అవగాహన పెంచేందుకు సమాజంలో అఘాయిత్యాలను తగ్గించాలనే ఉద్దేశ్యంతో ఈ పోటీలను స్వీడన్ దేశం నిర్వహిస్తుంది. ఇతర క్రీడల మాదిరిగానే ఈ పోటీలకు ఛాంపియన్షిప్ కూడా నిర్వహిస్తున్నారు.
అయితే ఈ పోటీలను ఎలా వీక్షించాలి, ఈ పోటీలో పాల్గొనాలంటే ఎలాంటి అర్హతలు ఉండాలి, స్వీడన్ దేశం ఈ పోటీల నుంచి ఏం ఆశిస్తుంది అనేది ఈ స్టోరీలో మనం తెలుసుకుందాం..
ఎవరు నిర్వహిస్తారంటే..
స్వీడన్ దేశ ప్రభుత్వం దీనికి ఒక సంస్థను కూడా ఏర్పాటు చేసింది. స్వీడన్ ఫెడరేషన్ ఆఫ్ శృంగారం అనే సంస్థ ఈ పోటీలను నిర్వహించనుంది. ఏడాదికి ఒకసారి ఈ పోటీలను నిర్వహించే విధంగా ఈ సంస్థ రూపకల్పన చేస్తోంది. ఈ మేరకు గతేడాది ఓసారి పోటీలను కూడా నిర్వహించింది.

జడ్జీలు, ప్రేక్షకుల సమక్షంలో ఈ పోటీలను నిర్వహిస్తారు. ఈ పోటీలో పాల్గొనే వ్యక్తులు జడ్జీలను కంటే ప్రేక్షకులనే ముందుగా మెప్పించాల్సి ఉంటుంది. ఈ పోటీల్లో గెలుపోటములు నిర్ణయించేందుకు ముగ్గురు జడ్జీలు ఉంటారు. ప్రేక్షకులతో పాటు ముగ్గురు జడ్జీల నిర్ణయంతో ఎవరైతే విజయం సాధిస్తారో వారే విజేత.
విజేతలను ఎలా నిర్ణయిస్తారంటే..
ఈ పోటీల్లో విజేతలను వివిధ అంశాలను పరిగణలోకి తీసుకొని నిర్ణయాయిస్తారు. పోటీల్లో పాల్గొనే దంపతుల మధ్య సాన్నిహిత్యం, శృంగారంపై అవగాహన, ఓర్పు, సహనం వంటి అంశాలను పరిగణలోకి తీసుకొని మార్కులు కేటాయిస్తారు. ఈ పోటీలు 16 రకాలుగా ఉండనున్నాయి. శృంగారంలో వివిధ ఘట్టాలపై ఈ పోటీలను నిర్వహిస్తారు.
బోనస్ పాయింట్లు కూడా..
ఈ పోటీల్లో పాల్గొనే వారికి బోనస్ పాయింట్లు కూడా ఉంటాయి. అయితే ఎవరికైతే కామసూత్రపై అవగాహన ఉంటుందో వారికే ఈ పాయింట్లు వర్తిస్తాయి. శృంగారం, మొహం, కామం వంటి అంశాలపై అవగాహన ఉంటేనే ఈ బోనస్ పాయింట్లను కేటాయిస్తారు. ఆ పాయింట్లు విజేతలను నిర్ణయించేటప్పుడు ఉపయోగపడతాయి.
ఎవరు ఓట్లు వేస్తారు..
బిగ్‌బాస్ మాదిరిగానే ఇందులో ప్రేక్షకులు ఓట్లు వేయాల్సి ఉంటుంది. ఈ పోటీల్లో అన్ని రంగాల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన జంటలకు ప్రేక్షకులు 70% ఓట్లు వేస్తారు. మిగతా 30% ఓట్లను ముగ్గురు జడ్జీలు కలిసి పూర్తి చేస్తారు. మొత్తానికి ఎవరికైతే ఎక్కువ మార్కులు వస్తాయో ఆ జంటని ఛాంపియన్‌గా ప్రకటిస్తారు. ఈ పోటీల్లో రోజుకు కనీసం ఆరు గంటల పాటు పాల్గొనాల్సి ఉంటుంది. వివిధ రకాల మ్యాచ్‌లు 45 నిమిషాల నుంచి 60 నిమిషాల వరకు జరగనుంది.
ఎవరు పాల్గొనొచ్చంటే..
యెరోపియన్ శృంగారం పోటీలు పేరిట ఈ ఛాంపియన్షిప్ పోటీలను స్వీడన్ నిర్వహిస్తోంది. ఈ పోటీల్లో ఐరోపా దేశాలకు చెందిన వారు ఎవరైనా పాల్గొనవచ్చు. వారు మాత్రమే ఈ పోటీలకు అర్హులు. గతేడాది నిర్వహించిన పోటీల్లో సుమారు 20కి పైగా దేశాల పోటీదారులు పాల్గొన్నట్లు ఆ పోటీలు నిర్వహించే సంస్థ ప్రకటించింది. మరి ఈ ఏడాది ఈ పోటీలు ఎప్పుడు నిర్వహించనున్నారు, ఎలాంటి షరతులు ఉండనున్నాయనేది త్వరలోనే తెలిసే అవకాశం ఉంది.
గమనిక: ఈ కథనంలో మేము పొందుపరిచిన విషయాలు కచ్చితమైనవని మేము నిర్ధారించలేదు. ఇంటర్నెట్‌లో మాకు దొరికిన సమాచారం ఆధారంగా అవి అందించబడినది.



Click it and Unblock the Notifications