Latest Updates
-
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.! -
నీచ భంగ రాజయోగం: కర్కాటకంలోకి కుజ సంచారంతో ఈ రాశుల వారికి దరిద్రం వదిలిపోతుంది.! -
అమ్మ జన్మనిస్తే, గురువు జీవితాన్ని ఇస్తాడు.. టీచర్స్ డే స్పెషల్ వాట్సాప్ స్టేటస్, బెస్ట్ విషెస్ ఇవే!
బంపరాఫర్ :తక్కువ ధరలో బ్యాంకాక్ ట్రిప్ ..క్రిస్మస్ స్పెషల్ టూర్ ప్యాకేజీ ప్రకటించిన IRCTC
మరికొద్ది రోజుల్లో క్రిస్మస్ పండుగ వచ్చేస్తోంది. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా క్రిస్మస్ సంబరాలు మెదలయ్యాయి.అయితే క్రిస్మస్ సెలవుల్లో ఫ్యామిలీతో లేదా ఫ్రెండ్స్ తో ఎక్కడైనా టూర్ కి వెళ్లాలని ఫ్లాన్ చేస్తున్నారా? అయితే మీకో గుడ్ న్యూస్. ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (IRCTC) మీకోసం అద్భుతమైన టూర్ ప్యాకేజీని ప్రకటించింది. అత్యంత తక్కువ ఖర్చుతో ఫారిన్ టూర్ కి ఛాన్స్ కల్పిస్తోంది ఐఆర్ సీటీసీ. అయితే ఐఆర్ సీటీసీఏ దేశానికి టూర్ ప్యాకేజీ ప్రకటించింది,ధర ఎంత,ఏమేం చూడవచ్చు వంటి విషయాలన ఇప్పుడు చూద్దాం.
టూర్ ప్యాకేజీ వివరాలివే
క్రిస్మస్ స్పెషల్ థాయ్‌లాండ్ విత్ ఫోర్ స్టార్ అకామడషన్(christmas speial thailand with four star accommodation) పేరుతో IRCTC ఓ ప్రత్యేక టూర్ ప్యాకేజీని అందుబాటులోకి తీసుకొచ్చింది. ప్యాకేజీలో భాగంగా 6 పగళ్లు, 5 రాత్రులు థాయిలాండ్ అందాలను చూడవచ్చు. రాజధాని బ్యాంకాక్‌తో పాటు పర్యాటక ప్రదేశం పట్టాయా అందాలను చూడవచ్చు. బ్యాంకాక్‌లోని అడ్వెంచర్ సఫారీ వరల్డ్, మెరైన్ పార్క్‌లను సందర్శించవచ్చు. పట్టాయలోని కోరల్ ద్వీపాన్ని,ఫ్లోటింగ్ మార్కెట్‌ను సందర్శించే అవకాశం లభిస్తుంది. ఈ టూర్ ప్యాకేజీ డిసెంబర్ 22 నుండి డిసెంబర్ 27 వరకు కొనసాగుతుంది.

ఈ టూర్ ప్యాకేజీ ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నో నుంచి ప్రారంభం అవుతుంది. పర్యాటకులు డిసెంబర్ 22 రాత్రి 11:05 గంటలకు లక్నో నుంచి విమానంలో థాయిలాండ్ వెళ్తారు. టూర్ మొత్తం బ్రేక్ ఫాస్ట్,లంచ్, డిన్నర్,బస అన్నింటిని IRCTC చూసుకుంటుంది. దీనికోసం మీరు ఎలాంటి ఛార్జీ చెల్లించనక్కర్లేదు. డిసెంబరు 27న రాత్రి 8:10 గంటలకు బ్యాంకాక్ నుండి లక్నోకు తిరిగి వస్తారు.
ప్యాకజీ ధర ఎంత
IRCTC థాయిలాండ్ టూర్ ప్యాకేజీ కింద మొత్తం 35 సీట్లు ఉన్నాయి. ఒక్కరు మాత్రమే వెళ్లానుకుంటే రూ.74,200 చెల్లించాలి. ఇద్దరు వ్యక్తులతో వెళితే ఒక్కొక్కరికి రూ.63,500 ఉంటుంది. అలాగే ముగ్గురు వ్యక్తులు ఉంటే ఒక్కో వ్యక్తికి రూ.62,900 చెల్లించాల్సి ఉంటుంది. ఇది కాకుండా 5 నుండి 11 సంవత్సరాల లోపు పిల్లలు ఉంటే ఒక్కరికి రూ.57,500.. 2 నుండి 11 సంవత్సరాల మధ్య పిల్లలు ఉంటే..బెడ్ అవసరం లేకపోతే అప్పుడు రూ. 52,900 ఉంటుంది.



Click it and Unblock the Notifications