Latest Updates
-
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.! -
నీచ భంగ రాజయోగం: కర్కాటకంలోకి కుజ సంచారంతో ఈ రాశుల వారికి దరిద్రం వదిలిపోతుంది.! -
అమ్మ జన్మనిస్తే, గురువు జీవితాన్ని ఇస్తాడు.. టీచర్స్ డే స్పెషల్ వాట్సాప్ స్టేటస్, బెస్ట్ విషెస్ ఇవే!
టీవీ దగ్గర ఈ వస్తువులు పెడుతున్నారా? ప్రమాదం కొనితెచ్చుకున్నట్లే!
టీవీ అనేది మన ఇంట్లో ఒక ఫ్యామిలీ మెంబర్ లాంటిది. ఉదయమంతా ఆఫీసులు, స్కూల్స్, ఇతర పనుల మీద బయటకు వెళ్లి సాయంత్రం ఇంటికి చేరగానే టీవీ ఆన్ చేస్తాం.. కుటుంబమంతా దాని చుట్టూ చేరి కబుర్లు చెప్పుకుంటూ, నచ్చిన కార్యక్రమాలు చూస్తూ సేద తీరుతాం.
కానీ టీవీ స్టాండ్ దగ్గర అనేక పెడుతుంటాం. అయితే వేలకు వేలు పెట్టి కొన్న మీ టీవీ పదికాలాలపాటు పనిచేయాలంటే దాని దగ్గర పొరపాటున కూడా ఉంచకూడని కొన్ని వస్తువుల గురించి ఇక్కడ చూడండి.

నీరు లేదా ద్రవ పదార్థాలు
చాలామంది టీవీ స్టాండ్ పై అలంకరణ కోసం ప్లవర్ వాజ్ లేదా వాటర్ బాటిళ్లు పెడుతుంటారు. ఇది అత్యంత ప్రమాదకరం. టీవీ స్క్రీన్, దాని వెనుక ఉండే ఎలక్ట్రానిక్ సర్క్యూట్ చాలా సున్నితంగా ఉంటాయి.
అనుకోకుండా చేయి తగిలి కొద్దిగా నీరు దానిపై పడినా చాలు అది లోపలికి చేరి టీవీకి ప్రాణం లాంటి మదర్ బోర్డ్ ను కాల్చేస్తుంది. ఆ తర్వాత రిపేర్ ఖర్చు వేలల్లో ఉంటుంది.
ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలు
మనం సాధారణంగా టీవీ పక్కనే మొబైల్ ఛార్జర్ పెట్టడం, సెట్ టాప్ బాక్స్ ను దానికి ఆనించడం, లేదా పెద్ద స్పీకర్లను దగ్గరగా ఉంచడం చేస్తుంటాం. ఈ ఎలక్ట్రానిక్ గాడ్జెట్ల నుండి నిరంతరం విద్యుదయస్కాంత వేవ్స్ వెలువడుతుంటాయి.
ఈ తరంగాలు టీవీ సిగ్నల్స్‌తో జోక్యం చేసుకుని దాని పనితీరును దెబ్బతీస్తాయి. ముఖ్యంగా సున్నితమైన LED లేదా LCD ప్యానెల్ పై చెడు ప్రభావం చూపి, దాని జీవితకాలాన్ని తగ్గిస్తాయి.
ఎయిర్ ఫ్రెషనర్లు, పెర్ఫ్యూమ్ లు
గది సువాసనగా ఉండాలని టీవీ దగ్గర ఎయిర్ ఫ్రెషనర్ స్ప్రే చేయడం లేదా పెర్ఫ్యూమ్ బాటిళ్లను ఉంచడం మరో పెద్ద పొరపాటు. ఈ స్ప్రేలలో ఉండే రసాయన తుంపరలు కంటికి కనిపించకుండా టీవీ స్క్రీన్ పై, గాలి బయటకు వెళ్లే రంధ్రాలలోనూ పేరుకుపోతాయి.
రానురాను ఈ రసాయనాలు స్క్రీన్ పై ఒకరకమైన మబ్బు ఏర్పరచి, టీవీలోని రంగులను పాడుచేస్తాయి. దీంతో పిక్చర్ క్వాలిటీ తగ్గిపోతుంది.
దీపాలు, కొవ్వొత్తులు
పండగల సమయంలో ఇంటిని అలంకరించేటప్పుడు చాలామంది టీవీ యూనిట్ పై దీపాలు, కొవ్వొత్తులు వెలిగిస్తారు. ఇది అత్యంత ప్రమాదకరం.
వాటి నుండి వెలువడే వేడికి టీవీ స్క్రీన్ పై కంటికి కనిపించని సూక్ష్మమైన క్రాక్స్ ఏర్పడవచ్చు. ఒకవేళ ఉష్ణోగ్రత మరీ ఎక్కువైతే టీవీ ప్లాస్టిక్ బాడీ కరిగిపోయే లేదా అగ్ని ప్రమాదం జరిగే అవకాశం కూడా ఉంది.
అయస్కాంత వస్తువులు
స్పీకర్లలో ఉండే పెద్ద అయస్కాంతాలు లేదా మరేదైనా అయస్కాంత వస్తువును టీవీకి దగ్గరగా ఉంచితే అది స్క్రీన్ పనితీరును శాశ్వతంగా దెబ్బతీస్తుంది.
అయస్కాంత క్షేత్రం టీవీ స్క్రీన్ పై చిత్రాన్ని ఏర్పరిచే చిన్నచిన్న చుక్కలైన పిక్సెల్స్ ను నాశనం చేస్తుంది. ఫలితంగా ఆ ప్రాంతంలో రంగులు సరిగ్గా కనిపించకపోవడం, స్క్రీన్ పై శాశ్వతమైన మరకలు ఏర్పడటం జరుగుతుంది.



Click it and Unblock the Notifications