Latest Updates
-
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.! -
నీచ భంగ రాజయోగం: కర్కాటకంలోకి కుజ సంచారంతో ఈ రాశుల వారికి దరిద్రం వదిలిపోతుంది.!
Trending : అతని జాబ్ అప్లికేషన్ చూసి కంపెనీ ఫౌండర్ షాక్..
ప్రస్తుతం ఉద్యోగాలు అంత సులవుగా దొరకడం లేదు. దొరకినా ఎక్కువ కాలంపాటు ఉండడం లేవు. హైర్ చేసుకున్నట్టే చేసుకొని వెంటనే ఫైర్ చేస్తున్నారు. ఉద్యోగం వచ్చిందనే సంతోషం ఉన్న కొన్ని రోజులకే చాలా కారణాల వల్ల తొలగించేస్తున్నారు. వీటిలో ఉద్యోగుల నైపుణ్య లోపం కూడా కారణం కావచ్చు. అయితే తాజాగా ఓ జాబ్ ఓ ఐటీ కంపెనీలో జాబ్ వేకెన్సీలను ప్రకటించారు. అందులో జాబ్ కోసం దరఖాస్తు చేసుకున్న వ్యక్తి ఆ కంపెనీ యజమానే షాక్‌కు గురయ్యేలా చేశాడు. ఎవరా ఉద్యోగి, జాబ్ అప్లికేషన్లో ఏమి రాసాడు, ఏ కంపెనీ.. ఈ ప్రశ్నలన్నింటికీ ఇప్పుడు సమాధానం తెలుసుకుందాం.
వింగిఫై సాఫ్ట్‌వేర్ కంపెనీ
వింగిఫై అనే సాఫ్ట్‌వేర్ కంపెనీలో ఉద్యోగ ఖాలీలు పడ్డప్పుడు దానికి చాాలా మంది నుంచి అప్లికేషన్లు వచ్చాయ్. ఆ కంపెనీ యజమాని పేరు పరాస్ చోప్రా. ఉద్యోగ దరఖాస్తులో సదరు నిరుద్యోగి ఇలా తన బయోడేటాను రాస్తూ..."మీ కోసం నేను ఒక ఆఫర్‌ను ప్రకటిస్తున్నాను.. నేను మీకు 500 డాలర్లను(రూ.41,000) చెెల్లిస్తాను, నాకు ఉద్యోగం కల్పించండి. నేను కష్టపడి పనిచేసి నన్ను నేను ప్రూవ్ చేసుకుంటాను. మిమ్మల్ని మెప్పిస్తాననే నమ్మకం కూడా ఉంది. ఒక వేల నా పని మీకు నచ్చకపోతే నన్ను ఉద్యోగంలోంచి తొలగించి ఆ డబ్బును మీ దగ్గరే పెట్టుకోండి" అని జాబ్ అప్లికేషన్‌లో అలా రాశాడు.

వింగిఫై యజమాని పరాస్ చోప్రా
ఈ అప్లికేషన్‌ను ఆ వింగిఫై కంపెనీ యజమాని పరాస్ చోప్రాను ఆకర్షించింది. ఆయన ఈ విషయాన్ని నెటిజెన్లతో సోషల్‌మీడియా వేదిక ఎక్స్‌లో పంచుకున్నారు. "ఇది ఆకర్షించడానికి బాగా ఉపయోగపడిందని సదరు నిరుద్యోగుడిని కంపెనీ యజమాని మెచ్చుకున్నారు. అతను ఇచ్చిన ఆఫర్ తీసుకోను కానీ అతను ఓ మంచి ప్రయత్నం చేశాడని అన్నారు. పరాస్ చోప్రా పెట్టిన పోస్టుకు కొన్ని నిమిషాల్లోనే వేల వ్యూస్ సొంతం చేసుకున్నాయ్.
నెటిజన్ల స్పందన
దీనిపై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. లంచానికి దీనిని పెద్ద వ్యత్యాసం లేదని కూడా విమర్శిస్తున్నారు. ఇలాగే అవకాశాలు ఇస్తే అది పెద్ద అక్రమ జాబ్ ర్యాకెట్‌గా తయారయ్యే అవకాశం ఉందని స్పందించారు. మరొకరు.. మాట్లాడుతూ.. ఆ ఆఫర్‌ను తీసుకొంటే కంపెనీకి రూ.41,000ల లాభం వచ్చేదని మరొకరు అన్నారు. మొత్తంగా ఈ నిరుద్యోగి నెటిజన్లను ఆకర్షించగలిగాడు.



Click it and Unblock the Notifications