Latest Updates
-
స్త్రీల శరీరంలో అత్యంత సున్నితమైన భాగాలు.. ఇక్కడ తాకితే మీ రాత్రి రసవత్తరమే! -
కరకరలాడే చిట్టి మురుకులు..పెద్దలకే కాదు, పిల్లలకు కూడా భలే నచ్చేస్తాయి..ఈజీగా చేసుకోండిలా.. -
ఈ పిండితో చేసిన రోటీ, చపాతీలు తింటే షుగర్ లెవల్స్ పెరగవు, ఫ్యాటీ లివర్ దరిచేరదు! -
‘ప్రొబేషన్ ముగిసినా ఆఫర్ లెటర్ లేదు.. ఇలాంటి కాల్ వస్తుందని ఊహించలేదు’- యువతి వైరల్ వీడియో.! -
ఈ ఐదు ఇంటి చిట్కాలను ప్రయత్నించారంటే.. ఇక జుట్టుకి హెయిర్ డైలు పూయడం ఆపేస్తారు.! -
రిలేషన్షిప్లో మహిళలు నిజంగా ఏం కోరుకుంటారు.. టాప్ 5 సీక్రెట్స్ ఇవే.! -
నోరూరించే స్వచ్ఛమైన పాలకోవా.. కేవలం 3 పదార్థాలతో మీ ఇంట్లోనే ఎలా చేసుకోవాలంటే.. -
సంతానోత్పత్తికి అడ్డంకిగా ఫెలోపియన్ ట్యూబ్స్ బ్లాకేజీ.. మహిళల్లో ఈ సమస్యను ఎలా నివారించాలి.! -
ఎటు చూసినా కష్టాలేనా? ఈ పవర్ ఫుల్ మంత్రాలు చదివితే లైఫ్ ఛేంజ్! -
ప్రపంచ మెదడు దినోత్సవం.. బ్రెయిన్ హెల్త్‌కి, విటమిన్ బి1కి సంబంధం ఉందా.. ఈ లక్షణాలు కనిపిస్తే చాలా డేంజర్.!
ఈ 4 రాశుల్లో మీది కూడా ఉందా.. అయితే జులై చాలా ప్రమాదకర సమయం సుమీ, జాగ్రత్తగా ఉండండి!
ప్రతీ ఏటా, కొత్త మాసాల్లో గ్రహ స్థితి మారుతూ ఉంటుంది. దాన్ని బట్టి ఆయా రాశుల ప్రజలకు అనేక రకాల కష్టాలు, నష్టాలు, లాభాలు, సుఖ, సంతోషాలు ఏర్పడుతుంటాయి. ముఖ్యంగా నూతన నెలారంభం అంటే ప్రతీ రాశి చక్రాన్ని ఒక్కో గ్రహం ఒక్కో విధంగా ప్రభావితం చేస్తుంది.
గ్రహాలు, నక్షత్రాల మధ్య కొత్త మార్పిడి ఏర్పడుతుంది. అయితే ఈ విధంగా వచ్చే జులై నెల కొన్ని రాశుల వారికి అద్భుత మాసంగా నిలవబోతుంది. అలాగే మరికొన్ని రాశుల వారికి ప్రమాదకరమైన మాసంగా ఉండబోతుంది. అయితే ఈ మాసంలో ఏర్పడే గ్రహాల సంచారం వల్ల ఏయే రాశుల వారికి తీవ్ర ప్రమాదం ఏర్పడబోతుందో మనం ఇప్పుడు తెలుసుకుందాం.

1. మేష రాశి
మేష రాశి ప్రభువు కుజుడు. కుజుడు ఈ నెల మొత్తం సింహ రాశిలో ఉంటాడు. దీనివల్ల ఈ రాశి వల్ల తీవ్ర కోపాన్న వ్యక్తం చేస్తుంటారు. ప్రతీ చిన్న దానికి కోప పడడం వల్ల అనేక అవకాశాలను పాడు చేసుకుంటారు. వీటి వల్ల ఉద్యోగం, దాంపత్య జీవితంలో అనేక సమస్యలు ఏర్పడే అవకాశం ఉంది. బృహస్పతి, తిరోగమన శని అంగారకుడిపై రాహువు యొక్క అంశాలు పరిస్థితిని చాలా క్లిష్టతరం చేస్తాయి. దీనివల్ల కూడా మీరు అనేక సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది.
బుధవారం జూలై 13వ తేదీన సమస్యలు విపరీతంగా పెరుగుతాయి. ఇది మీ పోరాటాల తీవ్రతను పెంచుతుంది. జూలై 17వ తేదీన సూర్యుడు తన రాశిని మార్చుకొని.. తమ నాల్గవ గృహమైన జల రాశి అయిన కర్కాటక రాశిలోకి ప్రవేశించి, శుభప్రదమైన 'త్రికోణ-కేంద్ర రాజయోగం' మరియు 'బుధాదిత్య యోగాన్ని' సృష్టిస్తాడు. ఇది మీ ప్రయత్నాలకు సానుకూల ఫలితాలను ఇస్తుంది. అయితే అప్పటి వరకు మాత్రం మీరు సమస్యలు, ఇబ్బందులు ఎదుర్కోక తప్పదు. మేషరాశి పన్నెండవ ఇంటి అధిపతి అయిన బృహస్పతి మీ రాశిలో అనూహ్య గ్రహం రాహుతో ఉన్నందున మీరు జాగ్రత్తగా ఉండాలి. ఇది అనవసరమైన ఖర్చులకు దారి తీయవచ్చు. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి.
2. సింహ రాశి
జూలై సింహ రాశి వారికి మిశ్రమ నెలగా కనిపిస్తుంది. ముఖ్యంగా ఈ నెలలో మొదటి పది మరియు చివరి ఎనిమిది రోజుల్లో... మీరు ఏదైనా పని పూర్తి చేయాలనుకుంటే దానిని జులై 9వ తేదీ నాటికే పూర్తి చేయడానికి ప్రయత్నించండి. లేకపోతే మీ పని పూర్తి కాకపోవచ్చు. కొన్నిసార్లు మీ ప్రతిభ మిమ్మల్ని నిరాశకు గురిచేస్తోందని మీరు భావించవచ్చు. ఎట్టి పరిస్థితుల్లోనూ మీరు ఆత్మ విశ్వాసాన్ని కోల్పోకండి. ఇది తాత్కాలిక ఎదురు దెబ్బ మాత్రమే అని గుర్తుంచుకోండి. త్వరలోనే మీరు మీ ప్రతిభతో కోల్పోయిన అవకాశాలను తిరిగి పొందుతారు. నెలాఖరులో చాలా జాగ్రత్తగా ఉండటం చాలా అవసరం.
3. కన్యా రాశి
జూలై కన్యా రాశి వాళ్లకు పరీక్షా కాలం. అలాగే ఈ నెలలో ఈ రాశి వాళ్లకు వచ్చిన అవకాశాలను వాళ్లు ఎక్కువగా ఉపయోగించుకోవాలి. జూలై 10 మరియు జూలై 27 మధ్య చాలా శ్రద్ధ అవసరం. మీ ప్రేమ జీవితంలో సమస్యలు మరింత పెరిగే అవకాశం కనిపిస్తోంది. మీ భాగస్వామి మిమ్మల్ని నిందించవచ్చు. కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. మీరు చేసే పనిలో చాలా జాగ్రత్త వహించడం ముఖ్యం. జూలై 22వ తేదీ తర్వాత మీ సమస్యలు తీవ్రంగా మారవచ్చు. నెల చివరి వారంలో మీ సమస్యలు కొద్దికొద్దిగా తగ్గుముఖం పడతాయి.
4. మీనరాశి
శని మరియు నెప్ట్యూన్ అనే రెండు గ్రహాలు మీ రాశిలో తిరోగమనంలోకి వెళ్లడం వల్ల ఈ నెలలో జీవన వేగం మందగిస్తుంది. మీరు ఆశించిన అవకాశాలు జారిపోయే అవకాశం ఉంది. కాబట్టి చాలా జాగ్రత్తగా వ్యవహరించండి. జూలై 22వ తేదీన శుక్రుడు వీరితో కలసి రావడంతో ఆరోగ్యంపై ఎక్కువ శ్రద్ధ వహించాల్సి ఉంటుంది. నెల చివరి వారంలో మీ ఆరోగ్యంలో పెద్ద మార్పులు కనిపిస్తాయి. ఆరోగ్య సమస్యలను తగ్గించడానికి మీ అనారోగ్య అలవాట్లను సమీక్షించండి. మీ సహోద్యోగులతో మరియు జీవిత భాగస్వామితో సున్నితమైన సంబంధాన్ని కొనసాగించడానికి ప్రయత్నించండి. లేదంటే తీవ్ర ఒత్తిడికి గురికావాల్సి వస్తుంది. వారితో గొడవలు అయ్యే అవకాశాలు అధికంగా కనిపిస్తున్నాయి. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి. వారితో మాట్లాడే ముందు ఆచితూచి అడుగు వేయండి.
Disclaimer: ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా ఈ వ్యాసాన్ని రాయడం జరిగింది. కచ్చితత్వానికి, విశ్వసనీయతకు ఎలాంటి హామీ ఇవ్వడం లేదు. Boldsky Telugu ఈ వ్యాసానికి సంబంధించిన ఏ విషయాన్నీ నిర్ధారించడంలేదు. ఈ వ్యాసం ఉద్దేశం సమాచారం అందించడం మాత్రమే. ఏదైనా పాటించే ముందు సంబంధిత నిపుణుల సలహా తీసుకోగలరు.



Click it and Unblock the Notifications