Latest Updates
-
కూరలు లేకపోయినా ఈ ఒక్క మిర్చి ఫ్రై ఉంటే చాలు.. కంచం మొత్తం ఖాళీ చేసేస్తారు.! -
సాంబార్ అమృతంలా కుదరాలంటే.. ఇంట్లోనే ఈ స్పెషల్ సాంబార్ పొడి చేసుకోండి! -
కస్టమర్లకు అలర్ట్.. ఈ నెలలో వరుసగా ఐదు రోజులు బ్యాంకులు బంద్.! -
ఈ రాశుల వారికి రెండో పెళ్లి యోగం..మీది ఉందేమో చూసుకోండి! -
వేళ్లు జుర్రుకుంటూ తినడం పక్కా.. కేవలం 20 నిమిషాల్లో నలుగురికి సరిపోయే మేథీ చమన్ కర్రీ.! -
నిద్రపోయే ముందు ఒక గ్లాసు నీళ్లు తాగితే ఆ ప్రమాదం నుంచి బయటపడొచ్చా? -
మన పూర్వీకుల బలమైన ఆహారం.. రోగాల మాటే ఉండదు.. జొన్న సంగటి ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
పొట్టపై స్ట్రెచ్ మార్క్స్‌కి ఖరీదైన ప్రొడక్ట్స్ వద్దు.. ఇంట్లోనే ఇలా చేశారంటే శాశ్వతంగా చారలు మాయం.! -
పెద్దలను ఎదిరించి ప్రేమ వివాహం..కట్ చేస్తే ఫ్యాన్ కి వేలాడుతూ..మౌనిక మృతికి కారణమేంటి? -
పులిసిపోయిన పెరుగుతో ఎన్ని లాభాలో.. ఇన్ని చేయొచ్చని తెలిస్తే ఇకపై అస్సలు పారబోయరు.!
ప్రయాణం చేయబోతున్నారా? ఈ జ్యోతిష చిట్కాలతో సురక్షితంగా వెళ్లి రండి
ప్రయాణాలు చేసేటప్పుడు వారాలు, వర్జ్యం, తిథి, నక్షత్రం చూసుకుని బయలుదేరాలని పెద్దలు చెబుతుంటారు. ప్రయాణం సాఫీగా, ఆనందంగా సాగడానికి ఇలాంటివి తప్పనిసరిగా చూసుకోవాలని హిందువుల విశ్వాసం. ఇంటి నుండి పని చోటుకు, వ్యాపారానికి వెళ్లి వచ్చేటప్పుడు ఇలాంటి నియమాలు పాటించాల్సిన అవసరం లేదు కానీ.. ఇతర ప్రాంతాలకు, సుదూర ప్రాంతాలకు, ఎక్కువ రోజుల, ముఖ్యమైన పనుల నిమిత్తం వెళ్లే వారు కొన్ని నియమాలు పాటించాలని చెబుతున్నారు నిపుణులు.
ప్రయాణ శూల ఉండకూడదు:
కొన్ని నక్షత్రాల వారికి తూర్పు దిక్కున శూల ఉంటుంది. వారు ఆయా నక్షత్రాల సమయంలో తూర్పు దిక్కుకు వెళ్లకూడదు. అలాగే తూర్పు దిక్కుకు ఏ వారం శూల ఉంటుందో ఆ వారం అటువైపు వెళ్లకూడదు. తూర్పు దిక్కుకు ఒక లఘ్నంలో శూల ఉంటుంది. ఆ లఘ్నంలో ఆ దిక్కుకు ప్రయాణం చేయకూడదు. అలా తిథి, వారం, నక్షత్రం, లఘ్నంలో శూల లేని సమయం చూసుకుని ప్రయాణం మొదలు పెట్టాలని శాస్త్రాలు చెబుతున్నాయి.

దగ్ధయోగం:
కొన్ని వారాలకు, కొన్ని తిథులకు దగ్ధయోగం ఉంటుంది. ఆ తిథి, వారాలు కలిసి వచ్చే సందర్భాల్లో కూడా ప్రయాణం చేయకూడదు. శూల కంటే దగ్ధయోగం ఎక్కువ ప్రభావవంతమైనది. కాబట్టి ఈ సమయంలో ముఖ్యమైన ప్రయాణాలు వాయిదా వేసుకోవడం మంచిది. పెళ్లిళ్లు, ఆరోగ్యం, విద్య, వ్యాపార సంబంధిత పనులు, ఇతర ముఖ్యమైన పనుల కోసం వెళ్తున్నప్పుడు వీటిని పాటించాలని శాస్త్రాలు చెబుతున్నాయి.
నిర్ధ్యం పెట్టడం:
ఏదైనా అనుకోని పని గురించి తప్పకుండా వెళ్లాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు నిర్ధ్యం పెట్టాలంటారు పెద్దలు. తూర్పు వైపు వెళ్లాల్సిన అవసరం వచ్చినప్పుడు, ఆ సమయం మంచిది కానప్పుడు.. దానికి ముందుగా వచ్చే మంచి ముహూర్తంలో ఏదైనా వస్తువును ఆ దిక్కున పెడతారు. దీనిని నిర్ధ్యం అంటారు. ఇప్పుడు వెళ్లాల్సిన సమయంలో ఇంట్లో నుండి బయల్దేరి ముందుగు ఆ దిక్కులో ఉంచిన వస్తువును వెంట తీసుకుని వెళ్లాల్సి ఉంటుంది.
బయల్దేరటప్పుడు దైవ స్మరణ:
ఇంటి నుండి బయలుదేరి వెళ్లేటప్పుడు ఏదైనా దైవ నామ స్మరణ, మంత్ర పఠనం చేస్తూ వెళ్తే అంతా శుభం జరుగుతుందని విశ్వాసం. క్షేమంగా ఇంటి నుండి బయల్దేరిన వారు, తిరిగి అంతే క్షేమంగా ఇంటికి తిరిగి రావడం కోసం వీటిని పాటించాలని చెబుతారు.
సుదూర ప్రయాణాలు ఎప్పుడు చేయాలి:
సుదూర ప్రయాణాలకు సోమ, బుధ, గురు, శుక్రవారాలు శుభప్రదమని జ్యోతిష్యుకులు చెబుతున్నారు. అలాగే విదియా, తదియా, పంచమి, సప్తమి, దశమి, ఏకాదశి, త్రయోదశి ప్రయాణాలకు శుభ తిథులుగా పరిగణిస్తుంటారు. దీర్ఘకాల ప్రయాణాలకు తీర్థయాత్రలు చేయడానికి మంచి ముహూర్తాలు చూసుకోవడం మంచదని అంటారు. శుక్ర, ఆదివారాలు పశ్చిమ దిశ ప్రయాణం మంచిది కాదని చెబుతారు. గురువారం దక్షిణ దిక్కుకు ప్రయాణం చేయరాదని, భరణి, కృత్తిక, ఆర్థ్ర, ఆశ్లేష, పుబ్బ, విశాఖ, పూర్వాషాఢ, పూర్వభద్ర అనే స్థిర లఘ్నాల్లో ప్రయాణాలు పెట్టుకోవద్దని జ్యోతిష్కులు సూచిస్తున్నారు.
Disclaimer: ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా ఈ వ్యాసాన్ని రాయడం జరిగింది. కచ్చితత్వానికి, విశ్వసనీయతకు ఎలాంటి హామీ ఇవ్వడం లేదు. Boldsky Telugu ఈ వ్యాసానికి సంబంధించిన ఏ విషయాన్నీ నిర్ధారించడంలేదు. ఈ వ్యాసం ఉద్దేశం సమాచారం అందించడం మాత్రమే. ఏదైనా పాటించే ముందు సంబంధిత నిపుణుల సలహా తీసుకోగలరు.



Click it and Unblock the Notifications
