Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
87 మంది పిల్లలకు తండ్రి.. ఒక్కో దేశంలో ఒక్కక్కడిని పుట్టించాలని ప్లాన్! మీరు కూడా అవ్వొచ్చు.. ఎలా అంటే?
ప్రస్తుతం ఉన్న కాలంలో ఒకరిద్దరు పిల్లలను కనడమే పెద్ద సవాలుగా మారుతుంది. మారిన జీవన విధానం, ఆహారపు అలవాట్లు, కాలుష్యం కారణంగా చాలా మంది వంధ్యత్వంతో బాధ పడుతున్నారు. సంతానలేమితో తెగ సతమతమవుతున్నారు. ఇదిలా ఉంటే.. కైల్ గోర్డీ అనే వ్యక్తి ఏకంగా 87 మంది పిల్లలకు తండ్రి అయ్యాడు. అలా అని అతను పెళ్లి చేసుకోలేదు. తన వీర్యాన్ని దానం చేసి ఏకంగా 87 మంది పిల్లలకు తండ్రి అయ్యాడు. అసలు అతనికి ఇది ఎలా సాధ్యమైంది? జీవితంలో అతని లక్ష్యం ఏంటి అనేది ఈ స్టోరీలో వివరంగా తెలుసుకుందాం.
ఎవరీ కైల్ గోర్డీ.. అతనికి ఇది ఎలా సాధ్యపడింది?
కైల్ గోర్డీ లాస్ ఏంజిలిస్‌కు చెందిన వారు. ఆయన ఒక స్పెర్మ్ డోనర్. ఇతను సంతానలేమితో బాధపడుతున్న వ్యక్తులకు తన వీర్య కణాలను దానం చేసి.. వారికి సంతానం కలిగేలా చేస్తున్నారు. ఇలా ఈయన ఇప్పటి వరకు పలు దేశాల్లో 87 మంది పిల్లలకు తండ్రి అయ్యాడు. bepregnantnow అనే వెబ్‌సైట్ ద్వారా.. ఈ సేవలను అందిస్తున్నాడు. ఈ సేవలను కూడా ఆయన ఉచితంగా అందించడం విశేషం. సంతానలేమితో ఎవరూ ఇబ్బంది పడకూడదని, ప్రతి ఒక్కరూ మాతృత్వ భావాలను పొందాలనే ఉద్దేశంతోనే తాను ఈ పని చేస్తున్నట్లు చెప్పుకొచ్చాడు.

ఇప్పటి వరకు తనకు వివిధ దేశాల్లో 87 మంది పిల్లలు ఉన్నారని కైల్ తెలిపాడు. అయితే 2025 చివరి నాటికి ప్రపంచంలోని ప్రతి దేశంలో ఒక్కో బిడ్డను కలిగి ఉండాలనేదే తన లక్ష్యమని చెప్పుకొచ్చారు. 2025 చివరి నాటికి ఈ ఘనతను సాధిస్తానని తెలిపారు.
ఇది సాధ్యమేనా?
ప్రపంచ వ్యాప్తంగా సాంకేతికత బాగా మెరుగుపడింది. సాంకేతిక యుగంలో ప్రస్తుతం సాధ్యం కానిదంటూ ఏదీ లేదు. ప్రపంచంతో పాటు మన దేశంలో కూడా వీర్య కణాల దానం ద్వారా.. సంతానాన్ని పొందుతున్న వ్యక్తులు చాలా మంది ఉన్నారు. సాంకేతికతను జత చేసి.. దాతల నుంచి వీర్యం సేకరించి సంతానం పొందేందుకు కృషి చేస్తున్నారు.
అయితే దీనికి సాంకేతికతతో పాటు సామాజిక అంగీకారం కూడా ఉండాలి. కొన్ని దేశాల్లో వీర్యం దానం చేయడం అనేది చట్టపరంగా న్యాయమైనది. అలాగే దానిని అనుసరించొచ్చు కూడా. దాని ఆధారంగా ఇది సాధ్యపడుతుందని చెప్పుకోవచ్చు. ఈ పని వల్ల కైల్ ఎంతో మందికి సహాయం చేస్తున్నట్లు అవుతున్నారు. ఎంతో మందికి ఆనందాన్ని పంచుతున్నారు. వారికి పిల్లలు లేని లోటును తీరుస్తున్నారు. దీని వల్ల ఎన్నో కుటుంబాలు సంతోషంగా ఉన్నాయని చెప్పుకోవచ్చు. అయితే 2025 నాటికి కైల్ తన లక్ష్యాన్ని చేరుకుంటారో లేదో చూడాలి.



Click it and Unblock the Notifications