Latest Updates
-
సేమియాతో ఎప్పుడూ పాయసమేనా? ఈసారి ఇలా బర్ఫీ చేసి చూడండి! -
గ్రహాల యువరాజు ఎంట్రీ.. సెప్టెంబర్ 7 నుంచి ఈ ఐదు రాశుల జాతకం మారనుంది! -
రాత్రి చపాతీలు మిగిలిపోయాయా? పారేయకుండా ఇలా కట్లెట్స్ చేయండి..రుచి చూస్తే అస్సలు వదలరు! -
అరటిపండుపై చిటికెడు యాలకుల పొడి చల్లి తింటే ఎన్ని లాభాలో తెలుసా? -
మాంసం కంటే 4 రెట్లు ఎక్కువ బలం..శరీరానికి ఉక్కు లాంటి బలాన్నిచ్చే పచ్చికొబ్బరి లడ్డూ చేసుకోండిలా.. -
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.!
లక్ష్మణ రేఖ వద్దు, కెమికల్ స్ప్రేలు వద్దు..వంటగదిలో చీమలను తరిమికొట్టే చిట్కా!
మన ఇళ్లలో సాధారణంగా ఎదురయ్యే అతి పెద్ద సమస్య.. చీమలు. వంటగదిలోకి వెళ్తే చాలు, ఎక్కడ తీపి వాసన వస్తే అక్కడ వాలిపోతాయి. పంచదార డబ్బాలు, స్వీట్ల పెట్టెలు, గ్యాస్ స్టవ్ చుట్టుపక్కల, సింక్ దగ్గర... ఇలా ఎక్కడ చూసినా చీమల దండే కనిపిస్తుంది. ఇవి కేవలం ఆహారాన్ని పాడు చేయడమే కాకుండా, మన ఇంట్లో పరిశుభ్రతకు కూడా పెద్ద సవాలుగా మారుతాయి. ఒక్కోసారి ఈ ఎర్ర చీమలు కుడితే వచ్చే మంట, దద్దుర్లు అంతా ఇంతా కాదు.

ఈ చీమల బెడద వదిలించుకోవడానికి మనం వెంటనే చేసే పని.. మార్కెట్లో దొరికే రసాయనాలతో కూడిన చాక్ పీస్ లు లక్ష్మణ రేఖ లాంటివి గీయడం లేదా విషపూరితమైన కెమికల్ స్ప్రేలను కొట్టడం. కానీ వంటగదిలో ఇలాంటి రసాయనాలు వాడటం ఏమాత్రం శ్రేయస్కరం కాదు. ముఖ్యంగా ఆహార పదార్థాలు ఉండే చోట వీటిని ఉపయోగించడం వల్ల, ఆ విష రసాయనాలు మన కడుపులోకి వెళ్లే ప్రమాదం ఉంది. ఇంట్లో చిన్న పిల్లలు లేదా పెంపుడు జంతువులు ఉంటే ఈ ముప్పు మరింత ఎక్కువ. పైగా ఈ కెమికల్స్ చాలా ఖర్చుతో కూడుకున్నవి
.
మన ఆరోగ్యాన్ని పణంగా పెట్టకుండా, చీమలను సురక్షితంగా ఎలా తరిమికొట్టాలి?
ఈ ప్రశ్నకు సమాధానంగా ప్రముఖ సెలబ్రిటీ చెఫ్ పంకజ్ భదోరియా ఒక అద్భుతమైన, సహజసిద్ధమైన చిట్కాను సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. ఆమె చెప్పిన చిట్కా ఏమిటంటే.. ఇది చీమలను చంపదు, వాటికి ఎలాంటి హాని తలపెట్టదు, కానీ వాటిని శాశ్వతంగా మీ ఇంటి నుంచి తరిమికొడుతుంది. పైగా దీనికి కావాల్సిన వస్తువులు మన ఇంట్లో ఎప్పుడూ అందుబాటులోనే ఉంటాయి.
సహజసిద్ధమైన స్ప్రే తయారీ తయారీకి కావాల్సినవి
ఒక ఖాళీ స్ప్రే బాటిల్
రెండు టీస్పూన్ల డెట్టాల్
ఒక టీస్పూన్ ఇంగువ పొడి

సహజసిద్ధమైన స్ప్రే ఎలా తయారు చేయాలి
-ముందుగా మీరు వంటల్లో వాడే ఇంగువను తీసుకుని మెత్తటి పొడిలా నూరుకోవాలి
-ఇప్పుడు ఒక ఖాళీ స్ప్రే బాటిల్ తీసుకుని అందులో కొద్దిగా నీళ్లు పోసి, రెండు స్పూన్ల డెట్టాల్ లిక్విడ్ వేయండి. ఆ తర్వాత అందులోనే ఒక టీస్పూన్ ఇంగువ పొడిని కలపండి. బాటిల్ మూత గట్టిగా మూసి, ఈ మిశ్రమం మొత్తం బాగా కలిసేలా గట్టిగా ఊపండి.
-అంతే చీమలను తరిమికొట్టే న్యాచురల్ స్ప్రే రెడీ.
ఇది ఎలా పనిచేస్తుంది?
ఇంగువకు సహజంగానే చాలా ఘాటైన వాసన ఉంటుంది. అలాగే డెట్టాల్ వాసన కూడా చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది. ఈ రెండింటి కలయికతో వచ్చే వాసనను చీమలు ఏమాత్రం భరించలేవు. ఈ స్ప్రేని వంటగదిలోని మూలల్లో, సింక్ కింద, స్వీట్ డబ్బాలు పెట్టే ప్రదేశాల్లో, కిటికీల దగ్గర, చీమలు ఎక్కువగా తిరిగే దారుల్లో స్ప్రే చేయండి. ఇలా చేయడం వల్ల చీమలు ఆ దరిదాపుల్లోకి కూడా రావు. దీనివల్ల మీ ఆహార పదార్థాలకు ఎలాంటి రసాయన ముప్పు ఉండదు, వంటగది సురక్షితంగా ఉంటుంది.



Click it and Unblock the Notifications
