Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
Kim Kardashian Lookalike: కిమ్ కర్దాషియన్‌లా కనిపించేందుకు ప్లాస్టిక్ సర్జరీ, గుండెపోటుతో మృతి
సెలబ్రిటీలుగా కనిపించాలని ప్రతి ఒక్కరికీ ఉంటుంది. రకరకాల ఫేస్ వాష్‌లు, క్రీములు, లోషన్లు వాడుతుంటారు. మేకప్‌లు, యాక్ససెరీస్ లు ధరిస్తూ వారిలా కనిపించడానికి ప్రయత్నిస్తుంటారు. అయితే కొందరు ఒక అడుగు ముందుకేసి మరీ వారిలా కనిపించడానికి ఏకంగా ప్లాస్టిక్ సర్జరీలు చేయించుకుంటారు.

రకరకాల ప్లాస్టిక్ సర్జరీలు చేయించుకుని అందంగా కనిపించే ప్రయత్నం చేస్తుంటారు చాలా మంది. ముఖానికే కాకుండా ఇతర శరీర భాగాల వల్ల సర్జరీ చేయించుకుని అందంగా, మంచి ఫిగర్‌తో కనిపించాలని తాపత్రయపడతారు. ఈ క్రమంలో కొన్నిసార్లు సర్జరీలు వికటించి చనిపోయిన ఘటనలు చాలా ఉన్నాయి.
ఇటీవలె పాప్ సింగర్, BTS గాయకుడు జిమిన్ లాగా కనిపించడానికి కెనడియన్ నటుడు వాన్ మృతి చెందిన విషయం తెలిసిందే. అప్పుడు ప్లాస్టిక్ సర్జరీల గురించి పెద్ద స్థాయిలో చర్చ జరిగింది. తాజాగా అమెరికన్ స్టార్ కిమ్ కర్దాషియన్‌లా కనిపించేందుకు పలు సర్జరీలు చేయించుకున్న క్రిస్టినా ఆష్టెన్ అనే మోడల్ గుండెపోటుతో మృతిచెందింది.
కిమ్ కర్దాషియల్‌నా కనిపించాలని..:
మోడల్ క్రిస్టినా ఆష్టెన్ గౌర్కానీ(34) తను అచ్చం కిమ్ కర్దాషియన్‌లా కనిపించాలనుకుంది. అందుకోసం పలు ప్లాస్టిక్ సర్జరీలు కూడా చేయించుకుంది. కొన్ని సర్జరీలతో తను దాదాపుగా కిమ్ లా కనిపించింది. తనను చూసిన వారు అచ్చం కిమ్‌లా ఉన్నావంటూ అనేవారు.
ఇంకా కొన్ని ప్లాస్టిక్ సర్జరీలు చేయించుకుంటే మరింత అందంగా, అచ్చంగా కిమ్ కర్దాషియన్‌లా కనిపిస్తానని అనుకుంది క్రిస్టినా. తాజాగా మరో ప్లాస్టిక్ సర్జరీ చేయించుకుంది. అయితే అది కాస్త వికటించడంతో గుండె పనితీరు దెబ్బతింది. కార్డియాక్ అరెస్ట్ కు గురైంది. ఏప్రిల్ 20వ తేదీన క్రిస్టినా ఆష్టెన్ గౌర్కానీ గుండెపోటుతో చనిపోయింది. ఈ విషయాన్ని క్రిస్టినా ఫ్యామిలీ ఆలస్యంగా సోషల్ మీడియాలో వెల్లడించింది.
సర్జరీల వల్లే చనిపోయింది:
కిమ్ కర్దాషియన్‌లా కనిపించడానికి క్రిస్టినా దాదాపు రూ. 11.12 కోట్లు ఖర్చు పెట్టిందని కుటుంబసభ్యులు తెలిపారు. దీని ద్వారా తను దాదాపుగా కిమ్‌లా కనిపించింది. అలా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు సంపాదించుకుంది. ఈ ప్లాస్టిక్ సర్జరీల వల్ల క్రిస్టినా చాలా ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంది.
గుండె సంబంధిత సమస్యలు నిత్యం ఇబ్బంది పెడుతుండేవి. అయినా తను మరో సర్జరీ చేయించుకోవాలని నిర్ణయించుకుని చేయించుకుంది. ఈ సర్జరీ అయ్యాక కేవలం గంటల వ్యవధిలోనే గుండెపోటు వచ్చి చనిపోయినట్లు క్రిస్టినా కుటుంబసభ్యులు తెలిపారు.



Click it and Unblock the Notifications