Latest Updates
-
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.!
ట్రంప్ ఆస్తి ఎంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే.. అంబానీ కూడా..!
అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ రెండోసారి ఎన్నికయ్యారు. డెమోక్రాటిక్ అభ్యర్థి కమలా హారిస్ కంటే అధికంగా ఓట్లు సాధించి రెండోసారి అధ్యక్ష పదవిని ముద్దాడారు. ప్రతిష్టాత్మకమైన ఈ ఎన్నికల్లో గెలుపొంది ఆయన రెండోసారి అధ్యక్షుడు కావడం నిజంగానే చారిత్రాత్మకం. ఇంతటి ప్రతిష్టాత్మకమైన ఎన్నికల్లో గెలుపొంది ట్రంప్ నిజింగానే రికార్డు సృష్టించారని అని చెప్పుకోవచ్చు.
గతంలో ఓసారి అధ్యక్షుడిగా పని చేసిన ట్రంప్.. అధ్యక్షుడు కాకముందు ఒక వ్యాపారవేత్త. రియల్ ఎస్టేట్ వ్యాపారంతో పాటు హోటళ్లు, రెస్టారెంట్లు వంటి వ్యాపారాలు ఆయనకు ఉన్నాయి. ఆ వ్యాపారాల వల్ల ట్రంప్ భారీగానే నగదును మూటగట్టుకున్నారు. అత్యంత సంపన్నమైన అధ్యక్షుల్లో ఒకరిగా నిలిచారు. ఇప్పటి వరకు ట్రంప్ గురించి తెలిసిన వ్యక్తులు ఉన్నారు తప్పా.. ఆయనకున్న ఆస్తుల విలువ గురించి ఎవరికీ తెలియదు. ఈరోజు ట్రంప్ ఆస్తుల విలువ ఎంత? ఆయనకు ఎలాంటి ఆస్తులు ఉన్నాయనేది తెలుసుకుందాం.

ఆశ్చర్యపరిచిన ట్రంప్
డొనాల్డ్ ట్రంప్ తొలిసారి అధ్యక్ష పీఠాన్ని అధిరోహించినప్పుడు అందరూ ఆశ్చర్యపోయారు. ఎందుకంటే ఆయనకున్న సంపద, ఆయన రాజకీయం చూసి ఎవరూ నమ్మలేకపోయాను. డొనాల్డ్ ట్రంప్ రాజకీయ నేపథ్యం నుండి రానందున, అతను అంతకు ముందే అనేక రకాల వ్యాపారాలలో నిమగ్నమై ఉన్నారు. ముఖ్యంగా చెప్పాలంటే రియల్ ఎస్టేట్ రంగంలో ఆయన ప్రసిద్ధి చెందారు. ఆయన మొదటి సారి అధ్యక్షుడిగా ఎన్నికైనప్పుడు బ్లూమ్‌బెర్గ్ బిలియనీర్స్ ప్రకారం ట్రంప్ నికర ఆస్తి విలువ 7.7 బిలియన్ డాలర్లు.
ఇప్పుడు నికర ఆస్తి విలువ 6.6 బిలియన్ డాలర్లు. అంటే భారత రూపాయితో పోలిస్తే ఇది 55 వేల కోట్ల రూపాయలు. అతని తండ్రి కూడా రియల్ ఎస్టేట్ వ్యాపారి. ట్రంప్ రియల్ ఎస్టేట్ నుండి రాజకీయాల్లోకి ప్రవేశించారు. అనంతరం ఎన్నికల్లో గెలిచి యునైటెడ్ స్టేట్స్ అధ్యక్షుడయ్యారు. ఇప్పుడు మళ్లీ ఆయనే రెండోసారి అధ్యక్షుడయ్యారు.
ట్రంప్ ఆస్తి ఎంత..!
డొనాల్డ్ ట్రంప్ అత్యంత సంపన్న వ్యాపారవేత్త. అనేక హోటళ్లు, నివాసాలు, గోల్ఫ్ కోర్సులు, విల్లాలు కూడా అతని పేరు మీద ఉన్నాయి. ట్రూత్ సోషల్ అనే సోషల్ మీడియాకు యజమాని కూడా. ట్రంప్ డిజిటల్ కరెన్సీలలో పెట్టుబడులు పెట్టారు. క్రిప్టో కరెన్సీలో 1 మిలియన్ డాలర్లు ఇన్వెస్ట్ చేశారు కూడా. పైగా మాన్‌హాటన్‌లోని ట్రంప్ అవర్ అత్యాధునిక ప్రత్యేక భవనం. దీని విలువ కూడా భారీగానే ఉంటుంది.
డొనాల్డ్ ట్రంప్ 2016లో పదవికి దరఖాస్తు చేసినప్పుడు మొదట తన ఆస్తులను ప్రకటించారు. ఆశ్చర్యకరంగా, అతను అధ్యక్షుడైన తర్వాత, అతని ఆస్తులు క్షీణించాయి. 4.5 బిలియన్ డాలర్లుగా ఉన్న అతని ఆస్తులు తర్వాత 2.1 బిలియన్లకు తగ్గాయి. కానీ 2022లో అతని ఆస్తులు 3 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి. 2024 నాటికి, ఇది ఇప్పుడు 7.7 బిలియన్ డాలర్లకు చేరుకుంది.
ట్రంప్ మీడియా అండ్ టెక్నాలజీ గ్రూప్ డొనాల్డ్ ట్రంప్ నికర విలువలో అత్యధిక వాటాను కలిగి ఉంది. నవంబర్ 5న ఆయన ఆస్తుల విలువ భారీగా పెరిగినట్లు సమాచారం. మీడియా షేర్లు 15 శాతం పెరగడంతో ట్రంప్ ఆస్తులు 15 శాతం పెరిగాయి.



Click it and Unblock the Notifications