Latest Updates
-
కండల వీరుడికి ఏమైంది? సల్మాన్ ఖాన్ ఇలా అయిపోడానికి కారణం అదేనా? -
ఈ సింపుల్ చిట్కాతో ఎంతటి నల్లటి కడాయి అయినా సరే.. కొత్తదానిలా మెరవాల్సిందే! -
అద్భుత శక్తులున్న 4 రామాలయాలు ఇవే! -
చుక్క పాలు లేకుండానే గడ్డ పెరుగు.. ఇలా సులభంగా తయారు చేయండి! -
కర్ణాటక స్టైల్ గ్రీన్ చికెన్ బిర్యానీ.. ఇలా చేస్తే ఫిదా అవ్వాల్సిందే! -
దరిద్రం పోయి అదృష్టం..జూలై 20 నుంచి ఈ 3 రాశులకు తిరుగుండదు! -
పల్లెటూరి స్టైల్ లో మట్టికుండలో చేపల కుర్మా..అన్నం, ఇడ్లీ, దోసె దేనిలోకైనా అదుర్స్! -
కళ్లు ఎర్రబడి, నీరు కారుతోందా? కండ్లకలక లక్షణాలు, నివారణ మార్గాలివే! -
వైజాగ్ లో కథ మాములుగా లేదుగా..దానికోసం ఏఐ తెగ వాడేస్తున్నారంట! -
నానబెట్టే పనిలేదు,పిండి రుబ్బే పనిలేదు.15 నిమిషాల్లో అటుకుల ఇడ్లీ..డయాబెటిస్ ఉన్నవారికీ బెస్ట్
పొదుపు చేసినంతమాత్రాన శ్రీమంతులు కాలేరు, ఈ సీక్రేట్స్ తెలుసుకుంటే మీరే కింగ్
మిలియనీర్ సీక్రెట్ గురించి తెలుసుకుంటే మీరు కూడా మీ లక్షాలను చేరుకోవడానికి అవకాశం ఉంటుంది. ప్రతి ఒక్కరూ ధనవంతులు కావాలని కలలుకంటున్నారు. కానీ కొంతమంది మాత్రమే దానిని వాస్తవంగా వారికి అనుకూలంగా మార్చుకోగలుగుతారు. చాలా మంది తాము కష్టపడి పనిచేసినా మాకు డబ్బు లేకపోవడం ఆశ్చర్యం కలిగిస్తుంది. ఎంత కష్టపడినా డబ్బు నిలవదు అని అనుకుంటారు.
మీ జీవితంలో ఇలాంటి సమస్యలు ఎదురై ఉండవచ్చు. ఇలాంటి సమస్యలు ఎదుర్కొంటున్న వ్యక్తులను మీరు కలుసుకుని ఉండవచ్చు.

ఒక వ్యక్తి యొక్క ఆర్థిక స్థితిని బలహీనపరిచే అనేక అంశాలు ఉన్నాయి. ధనవంతులుగా మారడానికి ఆర్థిక పరిజ్ఞానం, తెలివైన పెట్టుబడి, సరైన ఖర్చు, వాళ్ల అలవాట్లు ముఖ్యమైనవి. ఒక వ్యక్తి ఎప్పటికి ధనవంతుడు అవ్వకుండా నిరోధించే అంశాలు ఏమిటో చూద్దాం.
* మీకు సరైన ప్రణాళిక లేకపోవడం
చాలా మంది ఉద్యోగాలు చేసేవాళ్లు, వ్యాపారం చేసే వాళ్లు ధనవంతులుగా మారడానికి డబ్బు ఆదా చేయడం చాలా ముఖ్యం కాదు అని తెలుసుకోవాలి. కానీ తరచుగా ప్రజలు డబ్బు ఆదా చేయడానికి చూపించే ఆసక్తి అదే డబ్బు సంపాదించే మార్గాలపై ఎక్కువ శ్రద్ధ చూపరు. కాబట్టి డబ్బు ఆదా చేయడం గురించి మాత్రమే ఆలోచించవద్దు. డబ్బు సంపాదించడం ఎలాగో ప్లాన్ చేసుకోండి. అనుభవజ్ఞులైన వ్యక్తుల నుండి సలహాలు, సూచనలు తీసుకోండి. పూర్తి కృషితో, పట్టుదలతో, అంకితభావంతో మీ ప్రణాళికను ఆచరణలో పెట్టడానికి ప్రయత్నించండి.
* ఎలాంటి మయంలో ఎక్కడ పెట్టుబడి పెట్టాలి?
మనం చేసే రెండో తప్పు పెట్టుబడి పెట్టకపోవడం లేదా ఎక్కడ పెట్టుబడి పెట్టాలో తెలియకపోవడం. ఎప్పుడు, ఎక్కడ పెట్టుబడి పెట్టాలో మీకు తెలియకపోతే నిపుణుల సలహాలు, వారి సలహాలు తీసుకోండి. నేడు ఏ రంగంలో పెట్టుబడి పెట్టాలి, ఎలా ఆరంగంలో రానించాలని అని సలహాలు, సూచలను అందించే వేలాది అడ్వైజరీ కంపెనీలు మనకు అందుబాటులో ఉన్నాయి. మీ ఏరంగంలోకి వెళ్లాలి అని డిసైడ్ అయిన తరువాత ఆరంగంలోని నిపుణుల సలహాలు, సూచనలు తీసుకోవాలి. మీరు ఒక రంగాన్ని ఎంచుకుని మరో రంగంలోని నిపుణులను సంప్రదిస్తే ఎలాంటి ఫలితం ఉండదు.

* మీరు ఒక ఆదాయానికే పరిమితం అవుతున్నారా ?
మీరు ఒకే ఒక్క ఆదాయంతో మీ జీతంతో సంతృప్తి చెందడం ప్రారంభిస్తే, మీరు తప్పు చేస్తున్నారు అని తెలుసుకోండి. దీనివల్ల మీరు ఎలాంటి సమస్యలు లేకుండా ఆర్థికంగా స్థిరపడతారు. మీరు జీవితంలో ఆర్థిక పురోగతిని మాత్రం పొందలేరు అని గుర్తించడండి. ధనవంతులు కావడానికి ఇది ఒక అడ్డంకి. కాబట్టి సాధారణంగా వచ్చే ఆదాయం కాకుండా అదనపు ఆదాయాన్ని అందించే వాటి కోసం ఎల్లప్పుడూ ప్రయత్నించండి. ఉద్యోగం చేస్తున్నామని, ఇప్పుడు గడిచిపోతుంది చాలులే అనుకునే వాళ్లు ఎప్పటిలా అలాగే ఉంటారు. అందుకే ప్రస్తుతం మీకు వచ్చే ఆదాయం కంటే అదనపు ఆదాయం వచ్చే మార్గాలను చూసుకోండి.
* ధనవంతులు కావాలని పట్టుదల ఉండాలి
ధనవంతులుగా మారడం మీ పరిధిలోకి రాదని ఎప్పుడూ అనుకోకండి. ఇప్పటికే అనేక రంగాల్లో విజయం సాధించిన ప్రముఖుల విజయ కథనాలను చదవండి. ప్రతిభతో, పట్టుదలతో కష్టపడి జీవితంలో విజయం సాధించిన వారి గురించి తెలుసుకోవడానికి ప్రయత్నించండి. ఇది మిమ్మల్ని ఎంతగానో ప్రేరేపిస్తుంది, మీ ఆత్మవిశ్వాసాన్ని రెట్టింపు పెంచుతుంది, మీ న్యూనతా భావాన్ని తొలగిస్తుంది. మీరు కొత్త ఉత్సాహంతో కష్టపడి పని చేయగలుగుతారు.
* అదృష్టం మీద ఎక్కువగా ఆధారపడతారు.
కష్టపడి పని చెయ్యడానికి బదులుగా అదృష్టం మీద ఎక్కువ మంది ఆధారపడటం వలన వారు జీవితంలో చాలా కోల్పోతారు. వేలకోట్ల రూపాయలు ఖర్చు చేసినా గతాన్ని తిరిగి తీసుకురాలేమని గుర్తుంచుకోండి. కాబట్టి ముందుగా మీ లక్ష్యాలను నిర్దేశించుకోండి. కష్టపడి పని చేయండి. మీ స్వంత ఆలోచన చేయండి.
* పొదుపుపై ఎక్కువ దృష్టి పెడితే సరిపోదు.
స్మార్ట్‌గా ఉండటానికి మరొక మార్గం పొదుపుతో పాటు మీ ఆదాయాన్ని పెంచుకోవడంపై దృష్టి పెట్టడం. సంపదను కూడబెట్టుకోవాలంటే దానిని పొదుపు చేయాలి. కానీ మీ దృష్టి అంతా పొదుపుపైనే పోతే మీరు మీ ఆదాయాన్ని కోల్పోతారు. ధనికుల సాధారణ అలవాటు ఏమిటంటే వారు బహుళ ఆదాయ వనరులను సృష్టించుకుంటారు.

* కంఫర్ట్ జోన్ నుండి బయటకు రాలేకపోతారు.
వ్యాపారులు, పారిశ్రామికవేత్తలు ఎప్పుడూ వారి సామ్రాజ్యాన్ని విస్తరించడానికి ఎక్కువ ఆసక్తి చూపిస్తుంటారు. ఈ విషయం మనం చూసినా మనం మాత్రం మారడానికి ప్రయత్నించము. మీరు ఉద్యోగాలు చేస్తున్న కంపెనీల యజమాలను టార్గెట్ ఎప్పటికప్పుడు మారుతుంటుంది అని మీకు తెలిసినా మీరు మాత్రం జీతం హైక్ అయితే చాలు అని అనుకుంటారు. అలాంటి సమయంలో మీ కంపెనీల యజమానులు కొత్తకొత్త కంపెనీలు పెడుతూ ఉంటారు, మనం మాత్రం జీతాల హైక్ గురించి ఆలోచిస్తూ ఉంటాము.
* కొంతమందికి మాత్రమే సాధ్యం ?
కొంతమంది మాత్రమే వారి జీవిత లక్ష్యాలను నిర్దేశించుకోగలుగుతారు. అలాంటి వారు వారి లక్షాలను నెరవేర్చగలుగుతారు. తరచుగా చాలా మంది వ్యక్తుల కోరికలు ఇతరుల కోరికల క్రింద పాతిపెట్టినట్లు అయిపోతుంది. చాలా మంది ప్రజలు తమ కుటుంబాల అవసరాలను తీర్చడానికి పని చేస్తారు. చాలా మందికి తమ కంఫర్ట్ జోన్ నుండి బయటపడే ధైర్యం ఉండదు. కంఫర్ట్ జోన్‌లో నివసించే వ్యక్తుల ఆర్థిక పరిస్థితి ఎప్పుడూ ఒక పరిమితిలోనే ఉంటుంది. అటువంటి పరిస్థితిలో మీరు మీ మనస్సు యొక్క స్వరాన్ని అంటే మీ మనసు ఏం చెబుతుందో అనే విషయం వినాలి, వాటిని తెలుసుకోవాలి.
* సోమరితనం పెద్ద సమస్య
అందరూ డబ్బు సంపాదించాలని కోరుకుంటారు, కానీ చాలా మందికి ఎటువంటి ప్రణాళిక, లక్ష్యం లేకుండా ఈ కోరికను తీర్చుకోవాలనుకుంటారు. అలాంటి వారికి ఇది ఎల్లప్పుడూ ప్రమాదకరమే. అయితే దీనికి ఒక కారణం మీ సోమరితనం కూడా కావచ్చు. అందుకే ముఖ్యంగా సోమరితనాన్ని విడిచిపెట్టి లక్ష్యాన్ని నిర్దేశించుకోండి. మీరు అనుకున్న పని పూర్తి చిత్తశుద్ధితో పని చేయండి.
* డబ్బు నిర్వహణ
ముందు దాన్ని ఖర్చు చేసి, మిగిలిన డబ్బును ఆదా చేసుకోవచ్చని అనుకోండి, అప్పుడు మీరు తప్పు చేస్తున్నారన అర్థం. మీరు ముందుగా మీ పొదుపును ప్లాన్ చేసి ఆ తర్వాత డబ్బు ఖర్చు చేస్తే, మీ బడ్జెట్‌కు భంగం కలగ. ఇలా చేస్తే మీరు మునుపటి కంటే ఎక్కువ డబ్బు ఆదా చేయగలుగుతారు.



Click it and Unblock the Notifications