Latest Updates
-
నాన్వెజ్ రుచిని మరిపించే మష్రూమ్ కర్రీ.. గ్రేవీ ఇలా చేశారంటే అద్భుతః అనాల్సిందే.! -
మీరు ఏ వంట నూనె వాడతారు.. ఆరోగ్యానికి ఎక్కువ ఏది మేలు చేస్తుందో తెలుసా.? -
ఆన్లైన్లో విపరీతంగా ఆభరణాలు కొంటున్నారా.. 'మెరిసే' నగలతో మోయలేని ఆరోగ్య సమస్యలు.! -
మీ భాగస్వామి ఈ విషయాల్లో మీకు దూరంగా ఉంటున్నారా.. ఈ సంకేతాలతో చాలా డేంజర్.! -
ఆలూ పరోటాకి మించిన రుచితో ఉల్లి పరోటా.. బరువు తగ్గాలనుకునేవారికి బెస్ట్ డైట్ ఫుడ్ ! -
భోజనం చేసిన వెంటనే కడుపు నొప్పిగా ఉంటుందా.?.. ఈ వ్యాధులకు సంకేతం కావచ్చు.! -
ఆషాఢం బల్కంపేటలో వైభవం.. నేడు ఘనంగా ఎల్లమ్మ తల్లి కళ్యాణం.. ‘జలదుర్గ’ విశేషాలివే.! -
వక్ర గతిలోకి శని గ్రహం.. ఈ నెల 28 వరకు ఈ 3 రాశుల వారికి కష్టాలు తప్పవు.! -
అద్భుతమైన విందు భోజనం కావాలా? అయితే ఈ కోకనట్ మిల్క్ మటన్ పులావ్ ట్రై చేయాల్సిందే -
ప్రోటీన్ రిచ్ రాగి పనీర్ పరాఠా..షుగర్ లెవెల్స్ కంట్రోల్ లో,బరువు తగ్గాలనుకునే వారికి బెస్ట్..ఈజీగా చేసుకోండిల
పుట్టిన నెల బట్టి వ్యక్తిలోని లక్షణాలు ఇవే.. మీరు ఎలాంటి వారో ఇక్కడ తెలుసుకోండి!
ఒక వ్యక్తి పుట్టిన తేదీ అతని జీవితాన్ని, ఇతరుల జీవితంలో అతని పాత్రను కూడా ప్రభావితం చేస్తుంది. ఒక వ్యక్తి పుట్టిన నెలలు బట్టి.. ఆ వ్యక్తి లక్షణాలు, అతని వృత్తి, ఆర్ధిక పరిస్థితి, ఆరోగ్యం, వివాహం వంటి విషయాలను తెలుసుకోవచ్చని న్యూమరాలజీలో ఉంది. మీరు మీలో దాగి ఉన్న లక్షణాల గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే కింద పేర్కొనబడిన నెలల్లో మీరు ఏ నెలలో పుట్టారు, మీ వ్యక్తిత్వం ఎలాంటిదో తెలుసుకోండి.
జనవరి
మీరు జనవరిలో జన్మించినట్లయితే, మీరు చాలా ధైర్యంగా ఉంటారు. అలాగే ఇతరులపై ఆధారపడి మీ అభిప్రాయాన్ని ఎట్టి పరిస్థితుల్లో మార్చుకోరు. పని విషయంలో మీరు కఠినమైన ప్రవర్తన కలిగి ఉంటారు. జనవరిలో పుట్టిన వ్యక్తులు తమ ఆశయాలను సాధించేందుకు ఎలాంటి అడ్డంకులైనా దాటేస్తారు. వీరు భవిష్యత్తులో గొప్ప నాయకులు అయ్యే అవకాశం ఉంది.

ఫిబ్రవరి
మీరు ఫిబ్రవరి నెలలో జన్మించినట్లయితే, మీకు మంచి సృజనాత్మకత ఉంటుంది. మీరు మంచి మేధోపరమైన చర్చలను ఇష్టపడతారు. ఈ నెలలో పుట్టిన వారు ఎక్కువగా స్వేచ్ఛను కోరుకుంటారు. ఎక్కువగా స్వేచ్ఛగా జీవిచేందుకు ఇష్టపడతారు. ఫిబ్రవరిలో పుట్టిన వ్యక్తులు ఎక్కువగా సాహసాలను ఇష్టపడతారు. అలాగే ప్రయాణం చేసేందుకు వీరు అధికంగా ప్రయత్నిస్తూ ఉంటారు. ఈ నెలలో పుట్టిన వ్యక్తులకు చాలా స్నేహితులు ఉంటారు. అలాగే వీరు ఇతరులపై శ్రద్ధ చూపిస్తారు.
మార్చి
మీరు మార్చిలో జన్మించినట్లయితే, మీకు మంచి ఊహ ఉంటుంది. మీరు ఇతరులతో ఎక్కువగా మాట్లాడరు. మార్చిలో పుట్టిన వ్యక్తులు పిరికి మనుషులు. మీరు కళ సహాయంతో వారి భావాలను వ్యక్తపరుస్తారు. మీరు సౌమ్యులు అలాగే చాలా దయగలవారు. మీరు శాంతిని కోరుకుంటారు. కాబట్టి మీరు ఎక్కడికి వెళ్లినా శాంతిని పొందుతారు.
ఏప్రిల్
మీరు ఏప్రిల్‌లో జన్మించినట్లయితే, మీరు ఆధిపత్యం వహిస్తారు. ఏదైనా సూటిగా చెప్పగల వ్యక్తులు. దీంతో మిమ్మల్ని ఎక్కువగా ఎవరూ ఇష్టపడరు. ఇతరులు మీ గురించి ఏమనుకుంటున్నారనే దాని గురించి మీరు అస్సలు పట్టించుకోరు. మీరు ఎల్లప్పుడూ మీకు నచ్చినట్లుగానే ఉంటారు. మీరు ఆకర్షణీయంగా కనిపిస్తారు. ఇది మీకు చాలా మంది స్నేహితులను పొందేందుకు సహాయపడుతుంది.
మే
మీరు మేలో జన్మించినట్లయితే, మీరు చాలా ప్రతిభావంతులైన సంగీతకారులు, నటులు, కళాకారులు అవుతారు. మీరు సమాజంలో చురుకుగా ఉంటారు. మీరు ఎక్కడికి వెళ్లినా సులభంగా స్నేహం చేస్తారు. తెలివితేటలతో పాటు మీరు ఫన్నీగా కూడా ఉంటారు. మీరు ఒకే చోట ఉండలేరు. మీరు ఏదో పని చేయాలనుకుంటున్నారు. మీరు తరచుగా మీ అభిప్రాయాలను, కోరికలను మార్చుకుంటూ ఉంటారు.
జూన్
మీరు జూన్‌లో జన్మించినట్లయితే, మీరు చాలా భావోద్వేగంగా, అలాగే ప్రేమగా ఉంటారు. మీరు ఎక్కువగా ఎవరితోనూ మాట్లాడరు. మీరు మీకోసం అవకాశాలను సృష్టించుకునేందుకు మీ తెలివి తేటలతో భవిష్యత్తులో ఏం జరుగుతుందో అని ఆలోచించి, ముందుగానే ప్రణాళిక వేసుకుంటారు. మీరు చాలా రొమాంటిక్‌గా ఉంటారు. అలాగే ఇతరులపై సులభంగా ద్వేషం పెంచుకుంటారు.
జూలై
మీరు జూలైలో జన్మించినట్లయితే, మీరు ఎల్లప్పుడూ చాలా సంతోషకరమైన ముఖంతో ఉంటారు. మీరు సాహసాలను ఇష్టపడతారు. మీరు ఇతరులపై సానుభూతి, దయ, కరుణ చూపుతారు. వీరు ఒంటరిగా ఉండేందుకు ఇష్టపడతారు. మీరు చాలా ఒత్తిడికి లోనవుతారు. వీరు ఇతరులపై త్వరగా కోపం తెచ్చుకుంటారు. దీని కారణంగా సులభంగా భావోద్వేగానికి గురవడంతో పాటు గాయాలపాలవుతారు.
ఆగస్టు
మీరు ఆగస్టులో జన్మించినట్లయితే, మీకు సమాజ సేవ చేయాలనే ఆసక్తి ఎక్కువ ఉంటుంది. ఆగస్టులో జన్మించిన వారు దయగల వ్యక్తులు. మీరు అందరినీ ప్రేమిస్తారు. మీరు ఆధ్యాత్మికత పట్ల ఎక్కువ మొగ్గు చూపుతారు. కానీ ఈ వ్యక్తులు కష్టపడి పనిచేసేవారు కాబట్టి జీవితంలో ఎలాంటి డబ్బు సమస్య ఉండదు.
సెప్టెంబర్
మీరు సెప్టెంబర్‌లో జన్మించినట్లయితే, మీరు తెలివైనవారు. అలాగే ఆధ్యాత్మికంగా మొగ్గు చూపుతారు. వీరు ఎల్లప్పుడూ ఎదో ఒకటి ఆలోచిస్తూ ఉంటారు. మీరు గొప్ప మేధావి అవుతారు. మీరు ప్రతి పరిస్థితిని చాలా లోతుగా చూస్తారు. అందువల్ల కొన్ని అనుకోని సంఘటనలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. మీలో ఉన్న చెడ్డ గుణం కూడా ఇదే.
అక్టోబర్
మీరు అక్టోబర్‌లో జన్మించినట్లయితే, మీరు అదృష్టవంతులు. అదృష్టం ఎల్లప్పుడూ మీ వైపు ఉంటుంది. మీరు ఎల్లప్పుడూ మీ లక్ష్యాలను సాధిస్తారు. మీతో వాదించడం కష్టం. మీరు ప్రతీకారం తీర్చుకుంటారు. మీరు కళ, సాహిత్య ప్రేమికులు. మీరు సులభంగా అసూయపడతారు. చాలా నిజాయితీగా ఉంటారు.
నవంబర్
మీరు నవంబర్‌లో జన్మించినట్లయితే, మీరు సానుకూలంగా, స్పష్టమైన వైఖరితో ఉంటారు. దాతృత్వం మీ బలమైన లక్షణాలలో ఒకటి. మీరు ధైర్యంగా, స్ఫూర్తిదాయకమైన వ్యక్తిగా ఉంటారు. మీరు ఏదైనా చేయటానికి ధైర్యం చేస్తారు. మీకు ప్రశంసలు నచ్చవు. మీరు కోపం తప్ప మరే ఇతర భావోద్వేగాలను నియంత్రించలేరు. అయితే కోపాన్ని అదుపులో ఉంచుకోవడంలో వీరు సమర్థులు.
డిసెంబర్
మీరు డిసెంబరు నెలలో జన్మించినట్లయితే, మీరు సరైన ఉద్యోగం, జీవిత భాగస్వామిని పొందుతారు. జీవితంలో రిస్క్ తీసుకోవడానికి వెనుకాడరు. దీని కారణంగా మీరు జీవితంలో చాలా ప్రమాదకరమైన పరిస్థితులను ఎదుర్కొంటారు. మీరు నిబంధనలను పాటించరు. మీకు దేశభక్తి ఎక్కువ.



Click it and Unblock the Notifications